Allu Arjun Dhurandhar 2 Review: బ్లాస్ట్.. రణ్‌వీర్‌లాంటి నటుడు ఉండటం గర్వకారణం.. దేశభక్తి, స్వాగ్: అల్లు అర్జున్ రివ్యూ
Allu Arjun Dhurandhar 2 Review: ధురంధర్ 2 మూవీకి అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చాడు. మూవీ బ్లాస్ట్ అంటూ.. రణ్‌వీర్ లాంటి నటుడు ఉండటం మనకు గర్వకారణం అని అన్నాడు. దేశభక్తితో కూడిన స్వాగ్ ఈ మూవీలో ఉందని బన్నీ చెప్పాడు.
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ప్యాక్డ్ మూవీ ధురంధర్ 2. ఈ ఎపిక్ బ్లాక్‌బస్టర్‌పై ఇప్పుడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు. సినిమా చూసిన వెంటనే తన ఎక్సైట్‌మెంట్‌ను ఆపుకోలేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు. తన బ్రదర్ రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్‌ను, ఆదిత్య ధర్ టేకింగ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ బన్నీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ రివ్యూలో ఏముందంటే..
అల్లు అర్జున్ తన పోస్ట్‌లో ధురంధర్ 2 సినిమాను ఓ రేంజ్‌లో పొగిడాడు. దేశభక్తితో కూడిన స్వాగ్ మూవీలో ఉందని, మాధవన్, రణ్‌వీర్ ఇరగదీశారని చెప్పాడు.
"ఇప్పుడే ధురంధర్ 2 సినిమా చూశాను. ఇది పక్కా స్వాగ్‌తో కూడిన దేశభక్తి. ప్రతి దేశభక్తుడిని గర్వపడేలా చేసే సినిమా ఇది. థియేటర్‌లో చప్పట్లు కొట్టించే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఒకే మాటలో చెప్పాలంటే బ్లాస్ట్. ఎంటైర్ టీమ్‌కి నా అభినందనలు. మాధవన్ గారితో పాటు మిగతా యాక్టర్స్ అందరూ అద్భుతంగా నటించారు. టెక్నికల్ బ్రిలియన్స్ సూపర్బ్" అని అల్లు అర్జున్ తన రివ్యూలో అన్నాడు.
రణ్‌వీర్ నా బ్రదర్.. గర్వకారణం
రణ్‌వీర్ సింగ్‌తో తనకున్న సోదర బంధాన్ని చూపిస్తూ బన్నీ ఇంకా ఇలా రాసుకొచ్చాడు.. "మన దేశంలో నా బ్రదర్ రణ్‌వీర్ సింగ్ లాంటి బ్రిలియంట్ అండ్ వర్సటైల్ యాక్టర్ ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆర్వీఎస్ ఆన్ ఫైర్. డైరెక్టర్ ఆదిత్య ధర్ గారు ఇరగదీసేశారు. మన దేశంలో ఆయన లాంటి బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక షో రాకర్. ఇది మన ఇండియన్ స్టోరీ... కానీ ఇంటర్నేషనల్ స్వాగ్. జై హింద్" అంటూ అల్లు అర్జున్ తన పోస్ట్‌ను ఫుల్ ఎనర్జీతో ముగించాడు.
పాన్ ఇండియా లెవల్‌లో ట్రెండింగ్..
'పుష్ప' లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌తో గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇలా ఒక బాలీవుడ్ సినిమాను, అందులోనూ దేశభక్తి నేపథ్యంతో వచ్చిన సినిమాను ఇంతలా పొగడటం విశేషమే. నిజానికి బన్నీ ఒక్కడే కాదు ధురంధర్ 2 మూవీ ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేయడంలో ఆర్జీవీ, తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్లు కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఎపిక్ బ్లాక్‌బస్టర్ అని తరణ్ ట్వీట్ చేయగా.. ఈ సినిమా ముందు మొఘల్-ఇ –ఆజం కూడా ఓ టీవీ షో అవుతుందని ఆర్జీవీ అన్నాడు. స్పీల్‌బర్గ్, క్రిస్టఫర్ నోలన్ లాంటి డైరెక్టర్లు కూడా ఈ సినిమాను చూడాలని అతడు అనడం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


