Ranveer Singh: జిమ్‌లో అయినా, కాలేజీలో అయినా అదే సౌండ్-ధురంధర్ పై రణ్‌వీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..ఇంత హైప్ ఊహించలేదంటూ

Ranveer Singh: బ్లాక్ బస్టర్ సీక్వెల్ ధురంధర్ 2 కోసం ఆడియన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లోనూ ఈ మూవీ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలోనే ధురంధర్ 2పై నెలకొన్న అంచనాలు నమ్మలేకపోతున్నానని హీరో రణ్‌వీర్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. 

Published on: Mar 18, 2026, 05:46:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ "ధురంధర్" బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1,300 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇందులో కేవలం భారతీయ మార్కెట్ నుంచే రూ.1,000 కోట్లు రావడం విశేషం. ఈ భారీ విజయం తర్వాత, దీనికి సీక్వెల్‌గా ‘‘ధురంధర్ 2’’ రేపు (మార్చి 19) ప్రేక్షకులు ముందుకు రానుంది.

రణ్‌వీర్ సింగ్ (HT_PRINT)
రణ్‌వీర్ సింగ్ (HT_PRINT)

రణ్‌వీర్ సింగ్ కామెంట్లు

ధురంధర్ 2 మ్యూజిక్ లాంచ్ కార్యక్రమంలో రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. "ధురంధర్ ఇంతటి చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూపించిన ప్రేమే. మా టీమ్ పడిన కష్టానికి దక్కిన గౌరవం ఇది. ఇప్పుడు సీక్వెల్‌పై ఉన్న అంచనాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ అంచనాలను నమ్మలేకపోతున్నా" అని పేర్కొన్నాడు.

సంగీతమే ఈ సినిమా ఆత్మ

ధురంధర్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలకు జాతీయ అవార్డు గ్రహీత శశాంక్ సచ్‌దేవ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రణ్‌వీర్ మాట్లాడుతూ.. శశాంక్ ఒక "మ్యూజికల్ జగ్గర్నాట్" అని, భవిష్యత్తులో గొప్ప సంగీత దర్శకుడిగా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించాడు.

కాలేజీలు, జిమ్‌లు ఇలా ఎక్కడ చూసినా ధురంధర్ పాటలే వినిపిస్తుండటం ఒక ఆర్టిస్ట్ గా తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని రణ్‌వీర్ తెలిపాడు. ఈ సినిమాకు సంగీతమే ఆత్మ అని అతను చెప్పాడు.

ధురంధర్ 2 రిలీజ్

భారీ అంచనాల మధ్య ధురంధర్ 2 గురువారం (మార్చి 19) రిలీజ్ కానుంది. ఉగాది, ఈద్ సందర్భంగా బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు ఈ మూవీ వచ్చేస్తుంది. ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కు అదిరే డిమాండ్ నెలకొంది. ఇప్పటికే టికెట్ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లు దాటింది. ఆదిథ్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ పై కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందనే అంచనాలున్నాయి.

రణ్‌వీర్ సింగ్‌ యాక్షన్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ స్పై థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సారా అర్జున్ కీలక పాత్రలో నటించింది. సీక్వెల్‌లో రణ్‌వీర్ తన 'హమ్జా' పాత్రలో మరోసారి పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. ఇందులో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ తదితరులు కూడా నటించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ నిర్మించాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More