...
...
Next Story

ఇదో అద్భుతమైన సినిమా.. చూసి ఎంజాయ్ చేయండి.. రణ్‌వీర్ ఇరగదీశాడు: దురంధర్ మూవీపై అల్లు అర్జున్ రివ్యూ

అల్లు అర్జున్ గురువారం (డిసెంబర్ 11) రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ చూశాడు. అంతేకాదు ఇవాళ ఎక్స్ వేదికగా తన రివ్యూ కూడా ఇచ్చాడు. ఇదో అద్భుతమైన సినిమా అని, థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండని అనడం విశేషం.

Published on: Dec 12, 2025, 13:52:02 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురువారం (డిసెంబర్ 11) సాయంత్రం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌లో మెరిశాడు. తనకు సొంతంగా 'ఏఏఏ సినిమాస్' (AAA Cinemas) ఉన్నప్పటికీ, సినిమా చూసేందుకు మహేష్ థియేటర్‌కు వెళ్లడం విశేషం. రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమాను చూసిన బన్నీ.. ఆ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు.

బన్నీ దురంధర్ మూవీ రివ్యూ ఇలా..

ఇదో అద్భుతమైన సినిమా.. చూసి ఎంజాయ్ చేయండి.. రణ్‌వీర్ ఇరగదీశాడు: దురంధర్ మూవీపై అల్లు అర్జున్ రివ్యూ (Image credit: Artistrybuzz)
ఇదో అద్భుతమైన సినిమా.. చూసి ఎంజాయ్ చేయండి.. రణ్‌వీర్ ఇరగదీశాడు: దురంధర్ మూవీపై అల్లు అర్జున్ రివ్యూ (Image credit: Artistrybuzz)

బాలీవుడ్ లో ఈ మధ్యే రిలీజైన దురంధర్ సినిమాకు ఒక్కో సెలబ్రిటీ అభిమానిగా మారుతున్నారు. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ మూవీ చూసి ఫిదా అయిపోయాడు. శుక్రవారం (డిసెంబర్ 12) ఉదయం బన్నీ 'ధురంధర్' సినిమాపై తన అభిప్రాయాన్ని 'ఎక్స్' వేదికగా పంచుకున్నాడు.

"ఇప్పుడే 'ధురంధర్' చూశాను. అద్భుతమైన నటన, అత్యున్నత సాంకేతిక విలువలు, మంచి సౌండ్‌ట్రాక్‌లతో రూపొందిన బ్రిలియంట్ సినిమా ఇది. నా బ్రదర్ రణ్‌వీర్ సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. తన వైవిధ్యంతో షోని అదరగొట్టేశాడు" అని బన్నీ కితాబిచ్చాడు.

అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్‌ల నటనను కూడా ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఇక దర్శకుడు ఆదిత్య ధర్ గురించి చెబుతూ.. "కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆదిత్య ధర్ గారు.. ఫుల్ స్వాగ్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నాకైతే బాగా నచ్చింది. చూసి ఎంజాయ్ చేయండి గాయ్స్" అని రాసుకొచ్చాడు.

'మోగ్లీ' టీమ్‌కు విషెస్

అదే థియేటర్‌లో సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటించిన 'మోగ్లీ' (Mowgli) సినిమా స్క్రీనింగ్ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి చిత్ర బృందాన్ని కలిశాడు. రోషన్ కనకాలకు షేక్ హ్యాండ్ ఇచ్చి, నవ్వుతూ విష్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ 'అఖండ 2' కారణంగా 'మోగ్లీ' విడుదల ఒక రోజు వాయిదా పడి డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల్లు అర్జున్ తర్వాతి సినిమాలు

ప్రస్తుతం బన్నీ.. అట్లీ (Atlee) దర్శకత్వంలో రాబోయే సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటించనుంది. ఇక దురంధర మూవీ విషయానికి వస్తే.. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా.. 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 274.25 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe