...
...
Next Story

Allu Arjun: మీ అందరినీ మరింత గర్వపడేలా చేస్తా.. మీ ప్రేమకు థ్యాంక్స్: రెండు వేల మంది ఫ్యాన్స్‌తో అల్లు అర్జున్ సెల్ఫీ

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులతో సెల్ఫీ దిగడమే కాదు.. తనకోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతి ఏటా జరిగే మీట్ ఈసారి కూడా మంగళవారం (జులై 28) జరిగిన విషయం తెలిసిందే.

Published on: Jul 28, 2026, 19:04:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Allu Arjun Fans Association: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాను నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'రాకా' (Raaka) షూటింగ్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి ఏకంగా 2000 మంది అభిమానులను కలిశారు. హైదరాబాద్ వేదికగా జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) స్పెషల్ ఈవెంట్‌లో అభిమానులతో ముచ్చటించిన బన్నీ.. ఆ తర్వాత వారితో రాకా స్టైల్లో దిగిన ఒక క్రేజీ సెల్ఫీని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. షూటింగ్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా సమయం కేటాయించి అభిమానులను కలవడంతో మెగా అండ్ బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

"మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తా".. అల్లు అర్జున్

Allu Arjun: మీ అందరినీ మరింత గర్వపడేలా చేస్తా.. మీ ప్రేమకు థ్యాంక్స్: రెండు వేల మంది ఫ్యాన్స్‌తో అల్లు అర్జున్ సెల్ఫీ
Allu Arjun: మీ అందరినీ మరింత గర్వపడేలా చేస్తా.. మీ ప్రేమకు థ్యాంక్స్: రెండు వేల మంది ఫ్యాన్స్‌తో అల్లు అర్జున్ సెల్ఫీ

తన అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో రాస్తూ.. "నా డియర్ ఫ్యాన్స్, ఈ ఈవెంట్ కోసం మీరంతా వేర్వేరు ప్రాంతాల నుంచి రావడం నా హృదయాన్ని తాకింది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. చాలా వినయంగా ఫీలవుతున్నా. రాబోయే రోజుల్లో మీరంతా నా గురించి మరింత గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నా" అని క్యాప్షన్ జోడించారు.

రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చిన దాదాపు రెండు వేల మంది అభిమానులతో బన్నీ పర్సనల్‌గా మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అనంతరం వారందరితో కలిసి స్టేజ్ మీద నుంచి దిగిన విజువల్ సెల్ఫీ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

సోషల్ మీడియా హేటర్స్‌కు క్లాస్.. "టైమ్ వేస్ట్ చేయకండి!"

ఈ ఈవెంట్ లో బన్నీ చెప్పిన ఒక పవర్ ఫుల్ స్టేట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆన్‌లైన్‌లో నిత్యం నెగెటివిటీ స్ప్రెడ్ చేసే హేటర్స్, ట్రోలర్స్‌ను ఉద్దేశించి బన్నీ ఒక క్లారిటీ ఇచ్చారు.

"మీకు ఏదైనా ఒక వ్యక్తి లేదా విషయం నచ్చకపోతే దానిపై ద్వేషం చూపిస్తూ మీ అమూల్యమైన కాలాన్ని వృథా చేసుకోకండి. జస్ట్ ఆ విషయాన్ని వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్లండి" అంటూ హేటర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ స్టేట్‌మెంట్ ఇప్పుడు అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.

అట్లీ 'రాకా' సెట్స్‌లో బన్నీ..

'పుష్ప 2' లాంటి ఆల్-టైమ్ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత బన్నీ నుంచి రాబోతున్న సినిమా కావడంతో 'రాకా'పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బన్నీ సరికొత్త యాక్షన్ మేకోవర్‌లో కనిపించబోతున్నారని టాక్.

లోకేష్ కనగరాజ్‌తో 'AA23'.. బాక్సాఫీస్ రికార్డులపై కన్ను

'రాకా' మూవీతో పాటు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో 'AA23' ప్రాజెక్ట్‌ను కూడా బన్నీ లైన్‌లో పెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

పక్కా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ రెండు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర బన్నీ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకపక్క వరుస బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, మరోపక్క తన అభిమానులతో ఇలా పర్సనల్‌గా టైమ్ గడపడం బన్నీ గొప్పతనానికి నిదర్శనమని సినీ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe