Allu Arjun: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్‌లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన విషాదకర తొక్కిసలాట కేసులో సోమవారం (జూన్ 22) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించి నాంపల్లి క్రిమినల్ కోర్టు ఎదుట సినీ నటుడు అల్లు అర్జున్ నేరుగా హాజరుకాలేదు.
అల్లు అర్జున్ లీగల్ టీమ్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో వ్యక్తిగతంగా అటెండ్ కావాలని అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ ప్రస్తుతం ఆయన ముంబైలో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారని, అందుకే వ్యక్తిగతంగా రాలేకపోయారని బన్నీ తరఫు న్యాయవాదుల బృందం (లీగల్ టీమ్) న్యాయస్థానానికి వివరించింది.
"ఈరోజు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ముంబైలో సినిమా షూటింగ్ జరుగుతున్నందున అల్లు అర్జున్ ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి కోరారు. ఆయన నాంపల్లి కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరవుతారు" అని నటుడి లీగల్ టీమ్ స్పష్టం చేసింది.
న్యాయస్థానం ఆదేశాలు
అల్లు అర్జున్ కోర్టుకు రాకపోవడంతో అతని న్యాయవాది ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. అయితే మోమో దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. ఈ కేసును జులై 6కు కోర్టు వాయిదా వేసింది. అయితే అప్పుడు కూడా అల్లు అర్జున్ వర్చువల్ గానే హాజరు అవుతాడని అతని లాయర్ కోర్టుకు తెలిపారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఏ11గా అల్లు అర్జున్
2024 డిసెంబర్లో 'పుష్ప 2' ప్రత్యేక ప్రదర్శన సమయంలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టు గతంలోనే నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా (A11) చేర్చారు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని, నిర్వాహకులను 1 నుంచి 10వ నిందితులుగా (A1–A10) పేర్కొన్నారు. థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టు మొత్తం 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది.
{{/usCountry}}2024 డిసెంబర్లో 'పుష్ప 2' ప్రత్యేక ప్రదర్శన సమయంలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టు గతంలోనే నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా (A11) చేర్చారు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని, నిర్వాహకులను 1 నుంచి 10వ నిందితులుగా (A1–A10) పేర్కొన్నారు. థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టు మొత్తం 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది.
{{/usCountry}}నిందితులు చేసిన పలు తప్పుల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. సరైన ముందస్తు అనుమతులు లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, అక్కడ కనీస భద్రతా ఏర్పాట్లు కూడా చేయలేదని దర్యాప్తులో తేలింది. అలాగే పోలీసుల మార్గదర్శకాలను, నిబంధనలను నిర్వాహకులు పూర్తిగా ఉల్లంఘించారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే.
రాకా షూటింగ్ లో
అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' (Raaka) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్నందు వల్లే బన్నీ కోర్టుకు రాలేకపోయారని సమాచారం.
సోషల్ మీడియాలో ట్రోల్స్
అయితే అల్లు అర్జున్ కేసు విచారణ కోసం కోర్టుకు రాకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. సెలబ్రిటీ అయితే ఏంటీ? అందరూ చట్టం ముందు సమానమే అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.