Allu Arjun Arha: కూతురిపై అల్లు అర్జున్ ప్రేమ.. జీవితంలోని ఆనందం నువ్వే అంటూ.. అల్లు అర్హ వరల్డ్ రికార్డు తెలుసా?

Allu Arjun Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ముద్దుల కుమార్తె అల్లు అర్హ 10వ పుట్టినరోజు సందర్భంగా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే నటిగా వెండితెరపై మెరిసి, చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అల్లు అర్హ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Published on: Nov 21, 2026, 18:04:33 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Allu Arjun Arha: పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ గా మారింది. ఇవాళ (నవంబర్ 21) తన గారాలపట్టి అల్లు అర్హ 10వ పుట్టినరోజు సందర్భంగా ఆయన షేర్ చేసిన పోస్ట్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కూతురిపై అల్లు అర్జున్ ప్రేమ.. జీవితంలోని ఆనందం నువ్వే అంటూ.. అల్లు అర్హ వరల్డ్ రికార్డు తెలుసా? (x/alluarjun)
కూతురిపై అల్లు అర్జున్ ప్రేమ.. జీవితంలోని ఆనందం నువ్వే అంటూ.. అల్లు అర్హ వరల్డ్ రికార్డు తెలుసా? (x/alluarjun)

అల్లు అర్జున్ పోస్టు

తన కూతురితో కలిసి ఉన్న ఓ అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పంచుకున్నారు అల్లు అర్జున్. “హ్యాపీ బర్త్‌డే టు ది జాయ్ ఆఫ్ మై లైఫ్” (నా జీవితంలోని ఆనందం నువ్వే) అంటూ ప్రేమపూర్వక సందేశాన్ని జోడించారు. ఒక స్టార్ హీరోగా కాకుండా ఓ సాధారణ తండ్రిగా కూతురిపై ఆయన చూపిన ఆప్యాయత నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

శ్రీలంకలో అర్హ బర్త్‌డే సెలబ్రేషన్స్

అర్హ పదో పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా జరుపుకునేందుకు అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, పిల్లలతో కలిసి శ్రీలంకకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రకృతి అందాల మధ్య అర్హ దిగిన క్యూట్ ఫొటోలను స్నేహారెడ్డి సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అభిమానులు, సినీ ప్రముఖులు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పాత వీడియోలను పంచుకుంటున్నారు.

‘అంజలి అంజలి’తో మెస్మరైజ్..

అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ తర్వాత అల్లు కుటుంబం నుంచి నాలుగో తరం నటిగా అర్హ ఇప్పటికే వెండితెరపై అడుగుపెట్టింది. అంతకుముందే 2020లో అర్హ నాలుగో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘అంజలి అంజలి’ స్పెషల్ వీడియో సాంగ్ సంచలనం సృష్టించింది. మణిరత్నం క్లాసిక్ చిత్రంలోని ఈ పాటను రీక్రియేట్ చేయగా, అందులో అర్హ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ కోట్లాది మంది వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

ఆ తర్వాత 2023లో గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ద్వారా అర్హ బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఇందులో యువరాజు భరతుడి పాత్రలో నటించడమే కాకుండా, తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి టేక్‌లోనే అర్హ డైలాగులు అద్భుతంగా చెప్పిందని, భవిష్యత్తులో ఆమె కచ్చితంగా సూపర్ స్టార్ అవుతుందని సమంత అప్పట్లో ప్రశంసలు కురిపించింది.

నటనకు అవార్డు.. చెస్‌లో ప్రపంచ రికార్డు!

‘శాకుంతలం’ చిత్రంలో భరతుడిగా కనబరిచిన అద్భుతమైన నటనకు గాను అల్లు అర్హకు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ బాలనటి పురస్కారం లభించింది. కేవలం నటనలోనే కాదు, మేధస్సు పరంగానూ అర్హ చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను చాటుకుంది.

కేవలం ఐదేళ్ల వయసులోనే చెస్ లో 50 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఒకేసారి 30 చెస్ పజిల్స్‌ను పరిష్కరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అరుదైన ఘనతతో ప్రఖ్యాత ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్‌గా అర్హ స్థానం సంపాదించుకుంది.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.