...
...
Next Story

Allu Sirish Reception: మెగా వేడుకలో మెరిసిన తారలు.. గ్రాండ్ గా అల్లు శిరీష్-నయనిక రిసెప్షన్

Allu Sirish Reception: టాలీవుడ్ లో పెళ్లి సందడి సాగుతోంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. ఇప్పుడు అల్లు శిరీష్, నయనిక వెడ్డింగ్ జరగబోతుంది. పెళ్లి కంటే ముందు అల్లు శిరీస్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి అటెండ్ అయిన సెలబ్రిటీల ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: Mar 03, 2026 08:29 AM IST
Advertisement

సెలబ్రిటీ తారలు తరలివచ్చిన వేళ అల్లు స్టూడియోస్ వెలిగిపోయింది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్-నయనిక రెడ్డి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ సోమవారం (మార్చి 2) రాత్రి గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కు సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారాయి.

అల్లు శిరీష్ రిసెప్షన్

అల్లు అరవింద్ ఫ్యామిలీతో రామ్ చరణ్
అల్లు అరవింద్ ఫ్యామిలీతో రామ్ చరణ్

అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. మార్చి 6న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు శిరీష్-నయనిక పెళ్లి జరగబోతుంది. అంతకంటే ముందే సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల కోసం గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ కు తెలుగు, తమిళ, కన్నడ తదితర చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

సెలబ్రిటీ గెస్ట్ లు

అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కు భార్య అమలతో కలిసి అక్కినేని నాగార్జున, నందమూరి బాల‌కృష్ణ‌, రామ్ చరణ్, నాగ చైతన్య, నాని, రానా దగ్గుబాటి, నిఖిల్, రవితేజ, గోపీచంద్, జగపతి బాబు, నవీన్ పొలిశెట్టి, మంచు లక్ష్మి, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్, డైరెక్టర్లు అట్లీ, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, కమెడియన్లు బ్రహ్మానందం, అలీ, సునీల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తదితర సెలబ్రిటీ గెస్ట్ లు అటెండ్ అయ్యారు.

అల్లు అర్జున్

తమ్ముడు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఏర్పాట్లు అన్నీ దగ్గరుండి మరీ చూసుకున్నాడు. వచ్చిన గెస్ట్ లకు వెల్ కమ్ పలకడం దగ్గర నుంచి వాళ్లతో కలిసి ఫొటోలు దిగడం వరకు అల్లు అర్జున్ అన్నీ తానై వ్యవహరించాడు. అతని భార్య స్నేహారెడ్డి అందంగా కనిపించింది.

పెళ్లి కొడుకు ఫంక్షన్

2013లో వచ్చిన ‘గౌరవం’ సినిమాతో అల్లు శిరీష్ డెబ్యూ చేశాడు. ఆ తర్వాత 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు', 'ఒక్క క్షణం', 'ఉర్వశివో రాక్షశివో’ తదితర సినిమాల్లో హీరోగా చేశాడు. చివరగా 2024లో వచ్చిన బడ్డీ మూవీలో అల్లు శిరీష్ కనిపించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe