...
...
Next Story

Allu Sirish Wedding: పెళ్లి కొడుకైన అల్లు శిరీష్.. స్పెషల్ అట్రాక్షన్‌గా విజయ్, రష్మిక జోడీ

అల్లు శిరీష్ పెళ్లి (Allu Sirish Wedding) పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. అతన్ని పెళ్లి కొడుకును చేసే ఈవెంట్ ఆదివారం (మార్చి 1) మొదలైంది. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Published on: Mar 1, 2026, 21:51:38 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మెగా, అల్లు కుటుంబాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, యువ నటుడు అల్లు శిరీష్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు నయనిక రెడ్డితో మార్చి 6న శిరీష్ వివాహం జరగనుంది. ఈ క్రమంలో అల్లు వారి నివాసంలో వివాహ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తాజాగా జరిగిన 'పెళ్లికొడుకు' వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు వారి ఇంట్లో మంగళ స్నానాలు

Allu Sirish Wedding: పెళ్లి కొడుకైన అల్లు శిరీష్.. స్పెషల్ అట్రాక్షన్‌గా విజయ్, రష్మిక జోడీ
Allu Sirish Wedding: పెళ్లి కొడుకైన అల్లు శిరీష్.. స్పెషల్ అట్రాక్షన్‌గా విజయ్, రష్మిక జోడీ

అల్లు శిరీష్ తన నివాసంలో జరిగిన పెళ్లికొడుకు వేడుక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "నేను పెళ్లి చేసుకోబోతున్నాననే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది" అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. పూలతో ముస్తాబైన అల్లు నివాసంలో శాస్త్రోక్తంగా 'మంగళ స్నానాలు' నిర్వహించారు.

పసుపు, గంధంతో వరుడిని అలంకరించి, కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న శిరీష్‌ను కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ పాటలకు స్టెప్పులేస్తూ హుషారుగా కనిపించగా, శిరీష్ తన ఆత్మీయ మిత్రుడు రామ్ చరణ్‌తో ముచ్చటిస్తూ కనిపించాడు.

మెరిసిన సినీ తారలు

ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, రామ్ చరణ్-ఉపాసన కొణిదెలతో పాటు వసుంధర (బాలకృష్ణ భార్య) వంటి సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొని వరుడిని ఆశీర్వదించారు. శిరీష్, అల్లు అర్జున్‌లతో కలిసి విజయ్, రష్మిక ఫోటోలకు ఫోజులిచ్చారు.

వరుణ్ తేజ్ పెళ్లిలో మొదలైన ప్రేమాయణం

శిరీష్, నయనికల పరిచయం వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహ వేడుకలో మొదలైంది. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి, గతేడాది హైదరాబాద్‌లో నిశ్చితార్థానికి దారితీసింది. పెళ్లికి ముందు దుబాయ్‌లో శిరీష్ తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. అలాగే అన్న అల్లు అర్జున్ కూడా తమ్ముడి కోసం స్పెషల్ కాక్‌టైల్ పార్టీని హోస్ట్ చేశారు.

మార్చి 2న సినీ ప్రముఖులకు రిసెప్షన్

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks