Allu Sirish Wedding: ఇక అల్లు వారి పెళ్లి సందడి.. అల్లు శిరీష్ వివాహం కంటే ముందు గ్రాండ్ గా రిసెప్షన్.. ఎక్కడంటే?

అల్లు వారి ఇంట పెళ్లి బాాజాలు మోగబోతున్నాయి. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ పెళ్లి మార్చి 6న జరగబోతుంది. అంతకంటే ముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీల కోసం ప్రి వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. 

Published on: Feb 27, 2026, 12:55:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ముగిసింది. గురువారం (ఫిబ్రవరి 26) వీళ్లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఇప్పుడు అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్నకుమారుడు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అల్లు అర్జున్ తమ్ముడైన శిరీష్ వివాహం మార్చి 6న జరుగుతుంది. అంతకంటే ముందు ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.

అల్లు శిరీష్, నయనిక
అల్లు శిరీష్, నయనిక

అల్లు శిరీష్ పెళ్లి

అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మార్చి 6న వీళ్ల వెడ్డింగ్ జరుగుతుంది. అంతకంటే ముందే ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహిస్తామని అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో అల్లు శిరీష్ పేర్కొన్నాడు.

ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్

‘‘మార్చి 6న ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో అత్యంత సన్నిహిత వేడుకలో నేను, నయనిక పెళ్లి చేసుకోబోతున్నాం. కానీ మా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఇందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇది మార్చి 2న అల్లు స్టూడియోస్ లో జరుగుతుంది’’ అని అల్లు శిరీష్ పేర్కొన్నాడు.

అల్లు శిరీష్ స్టోరీ
అల్లు శిరీష్ స్టోరీ

అన్న పెళ్లి రోజే

అల్లు శిరీష్ తన వెడ్డింగ్ డేట్ ను గతేడాది డిసెంబర్ లో ప్రకటించాడు. మార్చి 6న పెళ్లి చేసుకుంటామని తెలిపాడు. అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్, బాబీ కుమార్తె అన్వితతో కలిసి ఓ పాపులర్ రీల్ తో ఈ డేట్ ను శిరీష్ రివీల్ చేశాడు. అయితే అన్న అల్లు అర్జున్, స్నేహారెడ్డి పెళ్లి తేదీ కూడా అదే కావడం విశేషం.

పెళ్లి పనులు

ఇప్పటికే అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. దుబాయ్ లో ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ జోడీ గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత ఇంట్లో పసుపు దంచుడు ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు. శుభలేఖలు కూడా పంచారు. ముందుగా సంప్రదాయం ప్రకారం మేనత్త సురేఖ-చిరంజీవి దంపతులకు మొదటి శుభలేఖ అందించారు. ఇప్పుడు అల్లు శిరీష్, నయనిక పెళ్లికి రెడీ అవుతున్నారు.

హైదరాబాద్ లో తమ్ముడు శిరీష్ పెళ్లికి ముందు అల్లు అర్జున్ నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్ దంపతులు అటెండ్ అయిన ఫొటోలు తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More