Allu Sirish: ఏది మగతనమూ నాకు ఎవరూ చెప్పక్కర్లేదు- నగలు ధరించడంపై అల్లు శిరీష్ కౌంటర్- మగాళ్లు వేసుకోకూడదా అంటూ!
Allu Sirish On Wore Jewellery On Wedding: తన వివాహ వేడుకల్లో విలక్షణమైన నగలు ధరించినందుకు ట్రోల్స్ ఎదుర్కొన్న మెగా హీరో అల్లు శిరీష్, విమర్శకులకు గట్టి సమాధానమిచ్చారు. ప్రాచీన కాలంలో పురుషులు కూడా నగలు ధరించేవారని గుర్తు చేస్తూ, జెండర్ నిబంధనలను బద్దలు కొట్టాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నయనిక రెడ్డిని వివాహం చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు అల్లు శిరీష్. అయితే ఆ పెళ్లి వేడుకల కంటే, అల్లు శిరీష్ ధరించిన ఆభరణాలే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

విభిన్నమైన నెక్లెస్‌లు
నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అల్లు శిరీష్ విభిన్నమైన నెక్లెస్‌లు (నగలు), చోకర్లు ధరించడంపై నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో ట్రోల్ చేశారు. తాజాగా ఈ విషయంపై శిరీష్ స్పందిస్తూ.. ఫ్యాషన్ విషయంలో తనకున్న స్పష్టతను, ధైర్యాన్ని చాటుకున్నారు.
"ఏది మగతనమో నేనే నిర్ణయించుకుంటా"
తన ఫ్యాషన్ సెన్స్‌పై వస్తున్న విమర్శలను అల్లు శిరీష్ ఏమాత్రం పట్టించుకోలేదు. "ఏది మగతనం? ఏది ఆడతనం? అని ఇతరులు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఏం ధరించాలి అనేది నేనే నిర్ణయించుకుంటాను" అని అల్లు శిరీష్ ఖరాకండిగా చెప్పారు. మగవారికి బట్టల విషయంలో పెద్దగా ప్రయోగాలు చేసే అవకాశం ఉండదని, అందుకే యాక్సెసరీస్‌తో తనదైన స్టైల్‌ను చాటుకున్నానని వివరించారు.
జెండర్ నిబంధనలు మనమే మార్చుకోవాలి
"అబ్బాయిలు అంటే నీలం రంగు, అమ్మాయిలు అంటే పింక్ అని ఫిక్స్ అయిపోవడం ఈ కాలంలో పుట్టుకొచ్చిన పద్ధతి. ప్రాచీన కాలంలో మన రాజులు, మహారాజులు కూడా భారీ ఆభరణాలు ధరించేవారు. వంద ఏళ్ల క్రితం వరకు పర్ఫ్యూమ్స్‌లో కూడా ఆడ, మగ అనే తేడాలు ఉండేవి కావు. ఎవరో ఒకరు మొదలుపెడితేనే కదా మార్పు వస్తుంది. ట్రోల్స్ వస్తాయని తెలిసినా, ఆ పాతకాలపు ఆలోచనలను బ్రేక్ చేయాలనే నేను ఇలా సిద్ధమయ్యాను" అని అల్లు శిరీష్ ట్రోల్ర్స్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.
కుటుంబ సభ్యులను ఒప్పించడం సవాలుగా మారింది!
తన పెళ్లి డ్రెస్సింగ్‌పై ఇంట్లో వారు కూడా మొదట సందేహించారని అల్లు శిరీష్ సరదాగా పంచుకున్నారు. "నెక్లెస్‌లు వేసుకోవడం ఇప్పుడు అవసరమా? అని వాళ్లు అడిగారు. అప్పుడు నేను.. 'ఎహే ఊరుకోండి.. మనం కూడా ట్రై చేయకపోతే ఇంకెవరూ చేయరు. ఇలాగే వదిలేస్తే ఇంకో ఇరవై ఏళ్లయినా పరిస్థితులు మారవు' అని వాళ్లను ఒప్పించాను" అని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు.
మీమ్స్ రాయుళ్లకు క్లాస్..
అల్లు శిరీష్ నిశ్చితార్థం సమయంలో ధరించిన చోకర్‌పై వచ్చిన ఓ మీమ్‌కు ఆయన గతంలోనే అదిరిపోయే రియాక్షన్ ఇచ్చారు. "పెళ్లికి వడ్డాణం కూడా పెట్టుకుంటాడేమో" అని జోక్ చేసిన వారికి.. "మన తెలుగు మీమర్స్ చాలా ఫన్నీగా ఉంటారు. వడ్డాణం కేవలం మహిళలు మాత్రమే ధరిస్తారు, కానీ చోకర్లు మన భారతీయ మహారాజులు, మొఘల్ చక్రవర్తులు కూడా వాడేవారు. చోకర్లు కేవలం మహిళలకే అనేది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఆలోచన మాత్రమే" అని చరిత్రను గుర్తు చేశారు
అంగరంగ వైభవంగా పెళ్లి
మార్చి 6న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిలో అల్లు శిరీష్ తన ఆచారాలకు, ట్రెండీ ఫ్యాషన్‌కు సమ ప్రాధాన్యత ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పెళ్లి వేడుకలన్నింటిని తన అన్నయ్య అల్లు అర్జున్ చూసుకున్నారని ఇదివరకు అల్లు శిరీష్ చెప్పారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


