టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యువ హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నయనికతో అతని పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. దుబాయ్ తీరంలో ఓ లగ్జరీ యాట్ (Yacht)లో జరిగిన ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నటి, సింగర్ సోఫీ చౌదరి సోషల్ మీడియాలో పంచుకుంది.
అల్లు అర్జున్ 'షాంపేన్' కష్టాలు.. నవ్వులే నవ్వులు

ఈ పార్టీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైలైట్‌గా నిలిచాడు. వేడుకలో భాగంగా బన్నీ స్టైలిష్‌గా షాంపేన్ బాటిల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. అందరూ ఆసక్తిగా చూస్తుండగా.. బాటిల్ మూత తెరుచుకుంది కానీ, షాంపైన్ మాత్రం పొంగలేదు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.
వెంటనే పక్కనే ఉన్న వరుడు శిరీష్ బాటిల్ అందుకుని, దాన్ని షేక్ చేసి ఆ సిచువేషన్ 'కవర్' చేశాడు. ఈ తతంగం చూసి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, సోదరుడు అల్లు బాబీ పడిపడి నవ్వడం వీడియోలో కనిపించింది.
వైరల్ అవుతున్న ఫోటోలు
సోఫీ చౌదరి షేర్ చేసిన ఫోటోల్లో.. సన్ సెట్ అవుతున్న వేళ శిరీష్, నయనికలతో దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే అల్లు అర్జున్, శిరీష్‌లతో సోఫీ దిగిన సెల్ఫీ, అల్లు బాబీతో దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో హీరో నితిన్ భార్య షాలిని కందుకూరి కూడా సందడి చేసింది.
"మీ జంట చూడముచ్చటగా ఉంది"
ఈ ఫోటోలను షేర్ చేస్తూ సోఫీ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. "నా బెస్ట్ ఫ్రెండ్, ఎంతో స్వీట్ అయిన శిరీష్.. అతనికి కాబోయే అందమైన భార్య నయనిక.. మీ జంట చూడముచ్చటగా ఉంది. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. అలాగే అర్జున్.. నువ్వు నువ్వులా ఉన్నందుకు థాంక్యూ" అంటూ అల్లు అర్జున్‌ను కూడా ట్యాగ్ చేసింది.
మార్చి 6న ముహూర్తం
గతేడాది అక్టోబర్ 31న హైదరాబాద్‌లో శిరీష్, నయనికల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. నితిన్, షాలిని కలిసి వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి కోసం ఇచ్చిన విందులో శిరీష్, నయనికలు తొలిసారి కలుసుకున్నారు. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత వీరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మార్చి 6న వీరి వివాహం జరగనుంది.
{{/usCountry}}గతేడాది అక్టోబర్ 31న హైదరాబాద్‌లో శిరీష్, నయనికల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. నితిన్, షాలిని కలిసి వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి కోసం ఇచ్చిన విందులో శిరీష్, నయనికలు తొలిసారి కలుసుకున్నారు. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత వీరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మార్చి 6న వీరి వివాహం జరగనుంది.
{{/usCountry}}