Ram Charan Allu Sirish: మేము మందు ముట్టుకోక ముందే చరణ్ స్వామి వచ్చి వెళ్లాడు: రామ్ చరణ్‌పై వస్తున్న విమర్శలపై శిరీష్
రామ్ చరణ్ (Ram Charan) అయ్యప్ప దీక్షలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీకి వెళ్లడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చాడు. తాము మందు ముట్టుకోక ముందే చరణ్ వచ్చి విష్ చేసి వెళ్లిపోయాడని చెప్పాడు.
అల్లు శిరీష్, నయనికా రెడ్డి జంటకు అల్లు అర్జున్ ఇటీవల హైదరాబాద్‌లో ఇచ్చిన కాక్‌టెయిల్ పార్టీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉండి కూడా హాజరుకావడంపై నెట్టింట కొన్ని విమర్శలు వచ్చాయి. మాలలో ఉండి ఆల్కహాల్ సర్వ్ చేసే పార్టీకి ఎలా వెళ్తారంటూ ప్రశ్నించిన వారికి అల్లు శిరీష్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

శిరీష్ ఇచ్చిన క్లారిటీ ఇదే..
సాధారణంగా అయ్యప్ప దీక్షలో ఉన్నవారు 41-48 రోజుల పాటు అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తారు. నల్లటి దుస్తులు ధరించడం, పాదరక్షలు లేకుండా నడవడం, నేలపై నిద్రించడం, బ్రహ్మచర్యం పాటించడం, ఉల్లి, వెల్లుల్లి, ఆల్కహాల్ వంటివి తీసుకోకుండా కేవలం శాకాహారం మాత్రమే భుజించడం లాంటివి చేస్తుంటారు. దీక్షలో ఉన్నవారిని అందరూ 'స్వామి' అని పిలుస్తారు. అయితే ఇలాంటి కఠిన దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఆల్కహాల్ సర్వ్ చేసే పార్టీకి వెళ్లడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై ఒక అభిమాని "చరణ్ స్వామి" అని కామెంట్ చేయగా.. శిరీష్ వెంటనే స్పందిస్తూ.. "ఇక్కడ ఎవరూ ఆల్కహాల్ ముట్టుకోకముందే స్వామి (రామ్ చరణ్) వచ్చారు. మమ్మల్ని విష్ చేసి వెళ్లిపోయారు. అయ్యప్ప స్వామి పట్ల ఆయనకున్న డెడికేషన్ ఎంతో గొప్పది" అని క్లారిటీ ఇచ్చాడు.
అల్లు అర్జున్ ఇచ్చిన గ్రాండ్ కాక్‌టెయిల్ పార్టీ..
వీకెండ్‌లో శిరీష్, నయనికల కోసం అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఈ గ్రాండ్ కాక్‌టెయిల్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు శ్రీలీల, ఫరియా అబ్దుల్లా, మిహీకా బజాజ్ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రామ్ చరణ్ కూడా భార్య ఉపాసనతో కలిసి ఈ ఈవెంట్‌లో సందడి చేశాడు. ఈ పార్టీలో చరణ్.. అల్లు అర్జున్, అల్లు అరవింద్ లను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. "నా కోసం, నయనిక కోసం అర్జున్, స్నేహ ఇచ్చిన ఈ పార్టీ ఒక మ్యాడ్‌నెస్. రోహిత్ గాంధీ-రాహుల్ ఖన్నా డిజైన్ చేసిన ఆల్-బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో మేమిద్దరం అదిరిపోయాము" అని శిరీష్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
మార్చి 6న శిరీష్, నయనికా వెడ్డింగ్..
గతేడాది అక్టోబర్ 31న హైదరాబాద్‌లో నయనికా రెడ్డితో శిరీష్‌కు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ మార్చి 6న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. నిజానికి అదే రోజు అల్లు అర్జున్ - స్నేహా రెడ్డిల వెడ్డింగ్ యానివర్సరీ కూడా. శిరీష్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు దుబాయ్‌లో ఒక యాట్ పార్టీతో, హైదరాబాద్‌లో సాంప్రదాయ పసుపు దంచే కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల కోసం నితిన్, షాలిని కందుకూరి ఏర్పాటు చేసిన పార్టీలో శిరీష్, నయనిక తొలిసారి కలుసుకున్నారు. "షాలిని తన బెస్ట్ ఫ్రెండ్ నయనికను ఆ పార్టీకి ఆహ్వానించింది. ఆ రాత్రే నేను నయనికను తొలిసారి నిజంగా కలిశాను. ఇప్పుడు రెండేళ్ల తర్వాత మేమిద్దరం ప్రేమలో ఉండి, సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాం" అని శిరీష్ గతంలో తమ లవ్ స్టోరీని అభిమానులతో పంచుకున్నాడు.

ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


