రీసెంట్ గా అల్లు శిరీష్ ఓ ఇంటివాడయ్యాడు. మార్చి 6న హైదరాబాద్ లో జరిగిన పెళ్లిలో తన ప్రియురాలు నయనిక రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. పెళ్లి తర్వాత ఈ జంట తమ వర్క్ లైఫ్ లో బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, హనీమూన్ ప్లాన్స్ గురించి శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
అల్లు శిరీష్ లవ్ స్టోరీ

నయనికను ఓ పార్టీలో అల్లు శిరీష్ కలిశాడు. హీరో నితిన్ భార్య శాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్. 2023లో పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కోసం నితిన్, శాలిని ఓ పార్టీ అరెంజ్ చేశారు. ఈ పార్టీలోనే నయనికను ఫస్ట్ టైమ్ కలిసినట్లు శిరీష్ తెలిపాడు.
పెళ్లి గురించే
“మేము డేటింగ్ ప్రారంభించినప్పటి నుంచి పెళ్లి గురించే మాట్లాడుకున్నాం. వెడ్డింగ్ చేసుకుంటామనే అనుకున్నాం. అలాగే మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులో మాట్లాడాలని కోరుకుంటున్నాం’’ అని అల్లు శిరీష్ చెప్పాడు.
సెన్స్ ఆఫ్ హ్యూమర్
‘‘నయనిక సెన్సాఫ్ హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె చాలా సూటిగా మాట్లాడుతుంది. ఏ విషయాన్ని అయినా డైరెక్ట్ గా చెప్పేస్తుంది. ఏదైనా బాలేదనిపిస్తే బాలేదని అంటుంది. నా జీవితంలోని ఏ విషయమైనా ఆమెతో షేర్ చేసుకుంటా. నా సినిమాల గురించి కూడా ఆమె ఉన్నది ఉన్నట్లు చెప్తుంది’’ అని శిరీష్ పేర్కొన్నాడు.
అత్తకు ఫోన్
ఒకసారి నయనికతో కలిసి తాను కాఫీ షాప్ కు వెళ్లిన విషయం మేనత్త సురేఖ (చిరంజీవి భార్య)కు తెలిసిందని అల్లు శిరీష్ వెల్లడించాడు. “మేము ఒకసారి కాఫీ షాప్‌కు వెళ్లాం. ఆ విషయం బయటకు తెలిసింది. అమెరికాలోని మా రిలేటివ్స్ అత్త సురేఖకు ఫోన్ చేసి మా విషయం అడిగారు. స్నేహ (అన్న అల్లు అర్జున్ భార్య), నిహారిక (నయనిక సిస్టర్) మంచి ఫ్రెండ్స్, దీంతో మా విషయం అందరికీ తెలిసిపోయింది’’ అని అల్లు శిరీష్ తెలిపాడు.
హనీమూన్ ప్లాన్స్
{{/usCountry}}ఒకసారి నయనికతో కలిసి తాను కాఫీ షాప్ కు వెళ్లిన విషయం మేనత్త సురేఖ (చిరంజీవి భార్య)కు తెలిసిందని అల్లు శిరీష్ వెల్లడించాడు. “మేము ఒకసారి కాఫీ షాప్‌కు వెళ్లాం. ఆ విషయం బయటకు తెలిసింది. అమెరికాలోని మా రిలేటివ్స్ అత్త సురేఖకు ఫోన్ చేసి మా విషయం అడిగారు. స్నేహ (అన్న అల్లు అర్జున్ భార్య), నిహారిక (నయనిక సిస్టర్) మంచి ఫ్రెండ్స్, దీంతో మా విషయం అందరికీ తెలిసిపోయింది’’ అని అల్లు శిరీష్ తెలిపాడు.
హనీమూన్ ప్లాన్స్
{{/usCountry}}నయనిక తండ్రి చనిపోయాడు. తన దివంగత మామ లాగే నయనికను ఎంతో ప్రేమగా చూసుకుంటానని అల్లు శిరీష్ పేర్కొన్నాడు. నయనికకు రక్షణగా నిలిచే భర్తగా ఉంటానని శిరీష్ అన్నాడు. ఇక హనీమూన్ ప్లాన్స్ గురించి కూడా శిరీష్ మాట్లాడాడు.
‘‘“మేము మా అపార్ట్‌మెంట్‌ను రెడీ చేసుకుంటున్నాం. నయనిక తిరిగి వర్క్ స్టార్ట్ చేసింది. నేను కూడా బిజీ అయిపోయా. అల్లు సినిమాస్ కూడా ఓపెన్ అయింది. మేం ఇద్దరం కంప్లీట్ చేయాల్సిన పెండింగ్ పనులు ఉన్నాయి. అవి పూర్తి అయ్యాక హనీమూన్ కు వెళ్తాం’’ అని అల్లు శిరీష్ చెప్పాడు.