...
...
Next Story

Sai Pallavi: ఈ పోస్టు రాస్తుంటే కన్నీళ్లు వచ్చాయి.. నా హృదయం సంతోషంతో నిండిపోయింది.. ఇది ఈజీ జర్నీ కాదు: సాయి పల్లవి

Sai Pallavi: నేచురల్ యాక్టింగ్ తో కోట్లాది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న సాయి పల్లవి ఎమోషనల్ అయింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నానని ఈ బ్యూటీ చెప్పింది. సాయి పల్లవి ట్వీట్ ఎందుకు చేసిందో? ఇక్కడ చూసేయండి.

Published on: Jul 22, 2026, 06:05:49 IST
Advertisement

Sai Pallavi: మేజర్ ముకుంద్ వరదరాజన్ వీర మరణం, ఆయన జీవిత కథ ఆధారంగా రూపొందిన 'అమరన్' చిత్రం ఎంతో స్పెషల్. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ మూవీ.. తాజాగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో ఏకంగా మూడు పురస్కారాలు సొంతం చేసుకుంది. దీనిపై సాయి పల్లవి ఎమోషనల్ అయింది.

సాయిపల్లవి ఎమోషనల్!

ఈ పోస్టు రాస్తుంటే కన్నీళ్లు వచ్చాయి.. నా హృదయం సంతోషంతో నిండిపోయింది.. ఇది ఈజీ జర్నీ కాదు: సాయి పల్లవి (PTI)
ఈ పోస్టు రాస్తుంటే కన్నీళ్లు వచ్చాయి.. నా హృదయం సంతోషంతో నిండిపోయింది.. ఇది ఈజీ జర్నీ కాదు: సాయి పల్లవి (PTI)

అమరన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికయ్యాడు దర్శకుడు రాజ్‌కుమార్. ఈ నేపథ్యంలో అతను చేసిన పోస్ట్‌పై రిప్లై ఇస్తూ సాయి పల్లవి ఎంతో ఎమోషనల్ ట్వీట్ చేసింది.

"నా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఇది సులువైన ప్రయాణం కాదు. మీరు చెప్పాలనుకున్న కథపై అపారమైన గౌరవంతో ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ పోస్టు రాస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఇక్కడివరకూ మీ ప్రయాణంలో సాక్షిగా ఉన్నా. ఎంతో గర్వంగా ఉంది రాజ్ కుమార్ సర్. మీ విజయాన్ని నా సొంత విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నా’’ అని సాయి పల్లవి ట్వీట్ చేసింది.

నా జీవిత కాల కల నెరవేరింది

"సినిమా దర్శకుడిని కావాలనుకున్న రోజు నుంచే జాతీయ అవార్డు అందుకోవాలని కలలు కన్నాను. ఈ రోజు ఆ కల నెరవేరింది! దేవుడు చాలా దయగలవాడు. 'అమరన్' రాస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు భారత సైనికులు, వారి కుటుంబాల త్యాగాలను ప్రేక్షకులు గుండెలకు హత్తుకోవాలనే ఆలోచన మాత్రమే నా మనసులో ఉంది’’ అని రాజ్ కుమార్ రాసుకొచ్చాడు.

వాళ్లకే అంకితం

‘‘ఈ ‘స్వర్ణ కమలం’ పురస్కారం నన్ను మరిన్ని మంచి కథలు తీసేలా ప్రోత్సహిస్తుంది. ఈ అవార్డును అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ కుటుంబానికి, భారత సైన్యంలోని ప్రతి సైనికుడికి అంకితం ఇస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, ఎడిటర్ కలైవాణన్, నిర్మాతలు కమల్ హాసన్, మహేంద్రన్, సోనీ పిక్చర్స్, హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయిపల్లవిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఫ్యాన్స్ డిసప్పాయింట్

'అమరన్' చిత్రంలో మేజర్ ముకుంద్ భార్య 'ఇందు రెబెక్కా వర్గీస్' పాత్రలో సాయి పల్లవి జీవించిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే 72వ జాతీయ అవార్డుల్లో 'ఆర్టికల్ 370' చిత్రానికి గానూ యామీ గౌతమ్‌కు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లభించడంతో సాయిపల్లవి అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సాయిపల్లవికి కనీసం 'స్పెషల్ మెన్షన్' లేదా జాయింట్ అవార్డు దక్కి ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఒక కమర్షియల్ బయోపిక్ రూ.300 కోట్లు వసూలు చేయడమే కాకుండా 3 నేషనల్ అవార్డులు సాధించడం ఇండియన్ సినిమా ట్రెండ్‌లో ఒక గొప్ప మైలురాయి అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe