దేశవ్యాప్తంగా యువతను విశేషంగా ఆకట్టుకున్న 'ఆస్పిరెంట్స్' సిరీస్ ఎట్టకేలకు తన మూడవ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజేందర్ నగర్ గల్లీల నుంచి ఐఏఎస్ (IAS) స్థాయి వరకు సాగే ఈ ప్రయాణం.. ఈసారి మరిన్ని మలుపులతో సాగనుంది. దీపేష్ సుమిత్ర జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సీజన్.. పాత జ్ఞాపకాలను, ప్రస్తుత వృత్తిపరమైన సవాళ్లను మేళవించి సరికొత్త కథాంశంతో రూపొందింది. ఆస్పిరెంట్స్ మూడో సీజన్ మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది.
అభిలాష్ ఎదుర్కోనున్న సవాళ్లు ఏమిటి?

ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్ ముగ్గురు ఐఏఎస్ ఆస్పిరెంట్స్ చుట్టూ తిరిగే కథ. వాళ్లలో ఒక్కరు (అభిలాష్) మాత్రమే తన కలను సాకారం చేసుకుంటాడు. మిగిలిన వాళ్లలో ఒకరు సివిల్స్ అభ్యర్థులకు కోచింగ్ ఇస్తుండగా.. మరొకరు మాత్రం బిజినెస్ వైపు మళ్లుతాడు. ఈ కొత్త సీజన్ లో ప్రస్తుత కాలంలో సాగే కథలో అభిలాష్ శర్మ జిల్లా మేజిస్ట్రేట్ (DM) హోదాలో కనిపిస్తాడు.
అయితే ఈ సీజన్‌లో అతని కెరీర్ అతిపెద్ద సంక్షోభంలో పడనుంది. ఏఎల్సీ సందీప్ ఓహ్లాన్ చేసిన తీవ్రమైన ఆరోపణల కారణంగా అభిలాష్‌పై అధికారిక విచారణ ప్రారంభమవుతుంది. ఇది అతని వృత్తిపరమైన ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా.. తన అత్యంత సన్నిహితులైన దీప, గురి, ధైర్య, ఎస్‌కే, సందీప్ భయ్యాలతో ఉన్న సంబంధాలను కూడా పరీక్షకు గురిచేస్తుంది. వీటికి తోడు అతని ఆశయాలకు అడ్డుపడే మరో కొత్త ప్రత్యర్థి కూడా ఈ సీజన్‌లో పరిచయం కానున్నారు.
ఆస్పిరెంట్స్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ
మరోవైపు అభిలాష్ ఐఆర్ఎస్ (IRS) కు ఎంపికైన తర్వాత జరిగిన సంఘటనలను ఈ సీజన్ చూపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ.. తన ఐఏఎస్ కల కోసం మళ్లీ రాజేందర్ నగర్ కోచింగ్ సెంటర్‌కు వెళ్లి చివరి ప్రయత్నం చేయాలని అతను నిర్ణయించుకుంటాడు. పోటీ పరీక్షల ఒత్తిడి, కొత్త స్నేహాలు, యూపీఎస్‌సీ అభ్యర్థుల మధ్య ఉండే తీవ్రమైన పోటీని ఈ టైమ్‌లైన్ కళ్లకు కట్టనుంది.
నవీన్ కస్తూరియా (అభిలాష్ శర్మ), శివాంకిత్ సింగ్ పరిహార్ (గురి), అభిలాష్ థప్లియాల్ (ఎస్‌కే), సన్నీ హిందుజా (సందీప్ భయ్యా), నమితా దూబే (ధైర్య) వంటి ప్రధాన నటీనటులందరూ ఈ సీజన్లోనూ అలరించనున్నారు. వీరితో పాటు జతిన్ గోస్వామి ఒక కీలక పాత్రలో కొత్తగా జాయిన్ అవుతున్నారు.
{{/usCountry}}నవీన్ కస్తూరియా (అభిలాష్ శర్మ), శివాంకిత్ సింగ్ పరిహార్ (గురి), అభిలాష్ థప్లియాల్ (ఎస్‌కే), సన్నీ హిందుజా (సందీప్ భయ్యా), నమితా దూబే (ధైర్య) వంటి ప్రధాన నటీనటులందరూ ఈ సీజన్లోనూ అలరించనున్నారు. వీరితో పాటు జతిన్ గోస్వామి ఒక కీలక పాత్రలో కొత్తగా జాయిన్ అవుతున్నారు.
{{/usCountry}}ప్రైమ్ వీడియో, టీవీఎఫ్ కలయికలో వస్తున్న ఈ కొత్త సీజన్.. విద్యార్థులకే కాకుండా బ్యూరోక్రసీలో ఉన్న వృత్తి నిపుణులకు కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన రెండు సీజన్లు కూడా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి.