అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ కొత్త వెబ్ సిరీస్ పేరు 'స్టార్మ్' (Storm). అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ మీద ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గురువారం (మార్చి 19) ప్రైమ్ వీడియో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను ఎక్స్ లో షేర్ చేసింది.
'స్టార్మ్' వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే..

హృతిక్ రోషన్ ప్రొడ్యూసర్ గా మారి నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టార్మ్.. ఐదుగురు మహిళల చుట్టూ తిరిగే ఒక పవర్‌ఫుల్ కథ. వాళ్లందరికీ ఎవరి బాధలు వాళ్లకు ఉన్నాయి. అలాగే ఎన్నో కలలు, ఎవరికీ తెలియని కొన్ని భయంకరమైన సీక్రెట్స్ కూడా ఉన్నాయి.
ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ పేరుతో మొదలైన ఒక స్కీమ్.. అనుకోకుండా ఒక డెడ్లీ స్కామ్ గా మారుతుంది. ఈ మోసాల వలయంలో ఆ ఐదుగురు మహిళలు ఎలా ఇరుక్కున్నారు? ఆ స్కామ్ వాళ్లను నాశనం చేసిందా లేక వాళ్లకు అక్కడి నుంచి స్వేచ్ఛను ఇచ్చిందా? అనేది ఈ సిరీస్ మెయిన్ ప్లాట్.
స్టార్మ్ వెబ్ సిరీస్ నటీనటులు
ప్రైమ్ వీడియో తమ పోస్ట్‌లో వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. ఫిల్మ్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ లో ఒక డివిజన్ అయిన 'హెచ్ఆర్ఎక్స్ ఫిల్మ్స్' (HRX Films) బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు.
స్టార్ హీరో హృతిక్ రోషన్, ఇషాన్ రోషన్ కలిసి ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అజిత్‌పాల్ సింగ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. అంతేకాదు అతడే.. ఫ్రాంకోయిస్ లూనెల్, స్వాతి దాస్ తో కలిసి స్టోరీ అందించాడు.
{{/usCountry}}స్టార్ హీరో హృతిక్ రోషన్, ఇషాన్ రోషన్ కలిసి ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అజిత్‌పాల్ సింగ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. అంతేకాదు అతడే.. ఫ్రాంకోయిస్ లూనెల్, స్వాతి దాస్ తో కలిసి స్టోరీ అందించాడు.
{{/usCountry}}ఇక ఈ స్టార్మ్ వెబ్ సిరీస్‌లో సౌత్ స్టార్ హీరోయిన్ పార్వతి తిరువోతు, బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలయ ఎఫ్, సృష్టి శ్రీవాస్తవ, రమా శర్మ, సబా ఆజాద్ (హృతిక్ రోషన్ రియల్ లైఫ్ పార్ట్‌నర్) మెయిన్ లీడ్స్‌గా చేస్తున్నారు. వీళ్లతో పాటు సువీందర్ పాల్ విక్కీ, టాలెంటెడ్ సీనియర్ యాక్టర్స్ ఆశిష్ విద్యార్థి, రజత్ కపూర్, అశోక్ పాఠక్, గౌతమ్ రోడే, ప్రియాంక సేథియా, రంజన్ రాజ్ లాంటి భారీ కాస్ట్ అంతా ఇందులో ఉన్నారు.
ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ప్రైమ్ వీడియో ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే రానుందని మాత్రం చెప్పింది. ఈ సిరీస్ తర్వాత ప్రైమ్ వీడియోతోనే హృతిక్ రోషన్.. మెస్ అనే మరో మూవీ చేస్తున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేశాడు.