Prime Video Releases: ఈ వారం ఓటీటీ ప్రియులకు ప్రైమ్ వీడియో నాలుగు మైండ్ బ్లాకింగ్ కంటెంట్ అందించబోతోంది. ఈ సెప్టెంబర్ 22 నుంచి 26 మధ్యలో ఏకంగా నాలుగు భారీ సినిమాలు, హై-వోల్టేజ్ రియాలిటీ షోలతో వీకెండ్ బింజ్ వాచ్ లైనప్‌ను సిద్ధం చేసింది. బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ నిర్మాణంలో వస్తున్న క్రేజీ మూవీ 'డోంట్ బి షై' తో పాటు ఇండియన్ క్రికెట్ లెజెండ్ వీరేందర్ సెహ్వాగ్ హోస్ట్ చేస్తున్న 'రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2' ప్రేక్షకులను అలరించేందుకు లైన్‌లో ఉన్నాయి.
ఈవారం ప్రైమ్ వీడియో రిలీజెస్

1. బెస్ట్ మెడిసిన్ సీజన్ 2 : సెప్టెంబర్ 22 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
2. ది లవ్ హైపోథెసిస్ : సెప్టెంబర్ 23 (ఇంగ్లీష్ మూవీ)
3. డోంట్ బి షై : సెప్టెంబర్ 25 (హిందీ మూవీ)
4. రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2 : సెప్టెంబర్ 26 (హిందీ రియాలిటీ షో)
1. ఆలియా భట్ ప్రొడక్షన్‌లో 'డోంట్ బి షై'..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తన సోదరి షహీన్ భట్‌తో కలిసి నిర్మించిన సరికొత్త డ్రామా మూవీ 'డోంట్ బి షై' (Don't Be Shy). ఈ సినిమా సెప్టెంబర్ 25 నుంచి ప్రైమ్ వీడియోలో నేరుగా డిజిటల్ ప్రిమియర్ కాబోతోంది.
తన లైఫ్‌ను పక్కా ప్లానింగ్‌తో లీడ్ చేయాలనుకునే ఒక 20 ఏళ్ల యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఆమె వేసుకున్న ప్లాన్స్ అన్నీ తలకిందులైపోవడంతో కథలో ఎలాంటి ఫన్నీ, ఎమోషనల్ ట్విస్ట్‌లు వచ్చాయనేది దర్శకులు చాలా రిఫ్రెషింగ్‌గా చూపించారు. అరుణి బజాజ్, అంశ్ దుగ్గల్, బియాంకా అరోరా, పియూష్ ఖాతి ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.
2. వీరేందర్ సెహ్వాగ్ హోస్టింగ్‌లో ‘రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2’
మొదటి సీజన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన గేమ్ రియాలిటీ షో 'రైజ్ అండ్ ఫాల్' (Rise & Fall Season 2) ఇప్పుడు రెండవ సీజన్‌తో మరింత రసవత్తరంగా మారింది. ఈ షోకి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
{{/usCountry}}మొదటి సీజన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన గేమ్ రియాలిటీ షో 'రైజ్ అండ్ ఫాల్' (Rise & Fall Season 2) ఇప్పుడు రెండవ సీజన్‌తో మరింత రసవత్తరంగా మారింది. ఈ షోకి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
{{/usCountry}}ఈ సీజన్‌లో ప్రియాంక చాహర్ చౌదరి, గౌతమ్ గులాటీ, స్వర భాస్కర్, షెహజాద్ పూనావాలా, తేజ్ ప్రతాప్ యాదవ్ సహా మొత్తం 15 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. లగ్జరీ పెంట్ హౌస్, డార్క్ బేస్‌మెంట్ అనే రెండు భిన్నమైన వాతావరణాల్లో కంటెస్టెంట్లు ఉంటూ ఒకరితో ఒకరు పోటీపడాల్సి ఉంటుంది. ఎంఎక్స్ ప్లేయర్ ద్వారా ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో సెప్టెంబర్ 26 నుంచి ఈ షో ప్రారంభం కానుంది.
3. మెడికల్ డ్రామా ‘బెస్ట్ మెడిసిన్ 2’
ఇంగ్లీష్ కంటెంట్ ఇష్టపడే వ్యూయర్స్ కోసం ప్రైమ్ వీడియో రెండు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మొదటిది మైండ్ బ్లోయింగ్ సర్జన్ కథ ఆధారంగా తెరకెక్కిన 'బెస్ట్ మెడిసిన్ సీజన్ 2' (Best Medicine Season 2). ప్రముఖ డాక్టర్ మార్టిన్ బెస్ట్ తన సర్జన్ కెరీర్ వదిలేసి కొత్త వృత్తిలోకి అడుగుపెట్టే క్రమంలో ఎదురయ్యే సవాళ్లతో ఈ సిరీస్ సెప్టెంబర్ 22 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
4. రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ది లవ్ హైపోథెసిస్’
అలాగే సైన్స్, డాక్టోరల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'ది లవ్ హైపోథెసిస్' (The Love Hypothesis) సెప్టెంబర్ 23న గ్రాండ్‌గా డిజిటల్ స్పేస్‌లోకి రానుంది. నిజమైన ప్రేమను నమ్మని ఒలివ్ స్మిత్ అనే అమ్మాయి, తన ఫ్రెండ్స్ కోసం ఒక ఫేక్ బాయ్‌ఫ్రెండ్‌ను క్రియేట్ చేయడంతో ఎలాంటి గందరగోళం మొదలైందో ఇందులో ఫన్నీగా చూపించారు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే బింజ్ వాచ్ చేయడానికి ఈ నాలుగు టైటిల్స్ పర్ఫెక్ట్ ఛాయిస్.