...
...
Next Story

ఓటీటీలో దుమ్మురేపుతున్న కొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు.. ప్రైమ్ వీడియో టాప్ 10 లిస్ట్ చూశారా?

ప్రైమ్ వీడియోలో జూన్ 8 నుంచి 14 మధ్య ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్, సినిమాల జాబితాను ఆ ఓటీటీ వెల్లడించింది. నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో ఉన్న సిరీస్, మూవీస్ లో ఇండియాకు చెందినవే ఎక్కువగా ఉండటం విశేషం.

Published on: Jun 18, 2026, 16:02:29 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గ్లోబల్ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) తాజాగా ప్రకటించిన (జూన్ 8 - జూన్ 14 వారానికి) నాన్-ఇంగ్లీష్ గ్లోబల్ టాప్ 10 ఒరిజినల్ వెబ్ సిరీస్, సినిమాల లిస్ట్‌లో ఇండియన్ కంటెంట్ సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది విదేశీ వెబ్ సిరీస్‌లు, సినిమాలను వెనక్కి నెట్టి.. ఇండియాకు చెందిన రెండు క్రేజీ ప్రాజెక్టులు నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. హై-వోల్టేజ్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

టాప్ ఒరిజినల్ వెబ్ సిరీస్: నంబర్ 1 స్థానంలో 'రాఖ్'

ఓటీటీలో దుమ్మురేపుతున్న కొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు.. ప్రైమ్ వీడియో టాప్ 10 లిస్ట్ చూశారా?
ఓటీటీలో దుమ్మురేపుతున్న కొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు.. ప్రైమ్ వీడియో టాప్ 10 లిస్ట్ చూశారా?

అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసిన నాన్-ఇంగ్లీష్ ఒరిజినల్ వెబ్ సిరీస్ కేటగిరీలో ఇండియాకు చెందిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh) నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకొని గ్లోబల్ లెవెల్లో దుమ్మురేపుతోంది. ఇంటెన్స్ డ్రామాతో సాగే ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 1978లో ఢిల్లీలో రంగా, బిల్లా చేసిన దారుణానికి ఫిక్షన్ జోడించి తీసిన సిరీస్ ఇది.

ఈ లిస్ట్‌లో జపాన్‌కు చెందిన నిప్పాన్ సాంగోకు ( Nippon Sangoku) రెండో స్థానంలో నిలవగా, జర్మనీ ఫేమస్ కామెడీ షో ఎల్‌ఓఎల్ ( LOL: Last One Laughing Germany) మూడో స్థానంలో నిలిచింది.

టాప్ 10 నాన్-ఇంగ్లీష్ ప్రైమ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ లిస్ట్ (జూన్ 8 - జూన్ 14)

1. రాఖ్ (Raakh) - ఇండియా

2. నిప్పాన్ సాంగోకు: ది త్రీ నేషన్స్ ఆఫ్ ది క్రిమ్సన్ సన్

3. ఎల్‌ఓఎల్: లాస్ట్ వన్ లాఫింగ్ జర్మనీ

4. మాక్స్టన్ హాల్ - ది వరల్డ్ బిట్వీన్ అస్

6. ది హౌస్ ఆఫ్ ది స్పిరిట్స్

7. మట్కా కింగ్ (Matka King) - ఇండియా

8. ఎల్‌ఓఎల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఫ్రాన్స్

9. ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man) - ఇండియా

10. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్

ఈ లిస్ట్‌లో విశేషం ఏంటంటే.. ఇండియా నుంచి రీసెంట్‌గా వచ్చిన విజయ్ వర్మ 'మట్కా కింగ్' ఏడో స్థానంలోనూ, ఎవర్ గ్రీన్ స్పై థ్రిల్లర్ సిరీస్ మనోజ్ బాజ్‌పాయ్ 'ది ఫ్యామిలీ మేన్' తొమ్మిదో స్థానంలోనూ కొనసాగుతూ తమ క్రేజ్ తగ్గలేదని నిరూపిస్తున్నాయి.

టాప్ ఒరిజినల్ ఫిల్మ్స్: సోనాక్షి సిన్హా 'సిస్టమ్' హవా

ఇక ఒరిజినల్ సినిమాల విభాగానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్ పొలిటికల్ క్రైమ్ డ్రామా మూవీ 'సిస్టమ్' (System) గ్లోబల్ చార్ట్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా సోషల్ మీడియాలో, ఓటీటీ సర్కిల్స్‌లో విపరీతమైన పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

స్పానిష్ ట్రెండ్ సెట్టర్ రొమాంటిక్ మూవీ 'కుల్పా మియా' (Culpa Mia) రెండో స్థానంలో నిలవగా, ఫ్రెంచ్ డ్రామా మూవీ 'ఎ ఫ్యామిలీ ఆఫ్ బాస్టర్డ్స్' (A Family of Bastards) మూడో స్థానంలో నిలిచాయి.

టాప్ 10 నాన్-ఇంగ్లీష్ ప్రైమ్ ఒరిజినల్ ఫిల్మ్స్ లిస్ట్ (జూన్ 8 - జూన్ 14)

1. సిస్టమ్ (System) - ఇండియా

2. కుల్పా మియా (Culpa Mia)

3. ఎ ఫ్యామిలీ ఆఫ్ బాస్టర్డ్స్ (A Family of Bastards)

4. కుల్పా న్యూస్ట్రా (Culpa Nuestra)

5. నో ప్లేస్ టు బి సింగిల్

6. కుల్పా తుయా (Culpa Tuya)

7. స్టిల్ సెక్సీ (Still Sexy)

8. వెంజెన్స్ (Vengeance)

9. ఏజెంట్ జెటా (Agent Zeta)

10. టెల్ మీ సాఫ్ట్లీ (Tell Me Softly)

గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఇండియన్ డైరెక్టర్లు, యాక్టర్లు అనుసరిస్తున్న కొత్త తరహా కథనాలు, మేకింగ్ స్టాండర్డ్స్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ప్రైమ్ వీడియోలో ఈ వారానికి ఈ కంటెంట్ అంతా టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఒకవేళ మీరు ఈ క్రేజీ వెబ్ సిరీస్ లు, సినిమాలను మిస్ అయి ఉంటే ఈ వీకెండ్ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. ప్రైమ్ వీడియోలో చూసేయండి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe