...
...
Next Story

Ameer Log: హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని తీశా, నీతి బోధ చేసినట్లుగా ఉండదు: అమీర్ లోగ్ డైరెక్టర్ రమణా రెడ్డి సోమ

Ameer Log Release Date And Avval Dawath Song Launch: తెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమీర్ లోగ్. ఈ సినిమాకు రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. తాజాగా అమీర్ లోగ్ రిలీజ్ డేట్‌తోపాటు అవ్వల్ దావత్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో డైరెక్టర్, నిర్మాత కామెంట్స్ చేశారు.

Published on: Jul 26, 2026, 07:47:52 IST
Advertisement

Ameer Log Release Date And Avval Dawath Song Launch: 'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

అమీర్ లోగ్ రిలీజ్ డేట్ ప్రకటన

హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని తీశా, నీతి బోధ చేసినట్లుగా ఉండదు: అమీర్ లోగ్ డైరెక్టర్ రమణా రెడ్డి సోమ
హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని తీశా, నీతి బోధ చేసినట్లుగా ఉండదు: అమీర్ లోగ్ డైరెక్టర్ రమణా రెడ్డి సోమ

అలాగే, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి ఇతర కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. ఆగస్ట్ 21న అమీర్ లోగ్ మూవీని విడుదల చేయనున్నట్లుగా శనివారం (జూలై 25) నాడు ప్రకటించారు.

అమీర్ లోగ్ రిలీజ్ డేట్‌తో పాటుగా ‘అవ్వల్ దావత్’ సాంగ్‌ని కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు రమణా రెడ్డి, నిర్మాత మాధవి రెడ్డి తదితరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మాది నల్గొండలోని రాఘవపురం

డైరెక్టర్ రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ .. "మాది నల్గొండలోని రాఘవపురం. నేను 97లోనే హైదరాబాద్‌కు వచ్చాను. హైదరాబాద్‌లోని చాలా ఏరియాల్లో జీవించాను. హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని ‘అమీర్ లోగ్’ తీశాను" అని అన్నారు.

"మేం ముందుగా మా టీంకి సినిమా వేసి చూపించాము. ఆ తర్వాత స్పిరిట్ మీడియా టీంకి కూడా చూపించాం. వారికి సినిమా నచ్చడంతో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. డబ్బులున్న వారు అమీర్ లోగా?, సంతోషంగా ఉండే వారు అమీర్ లోగా? అన్నది ఈ చిత్రం చూసిన తర్వాత అర్థం అవుతుంది" అని దర్శకుడు రమణా రెడ్డి సోమ తెలిపారు.

నీతి బోధ చేసినట్లుగా ఉండదు

నిర్మాత మాధవి రెడ్డి మాట్లాడుతూ .. "‘అమీర్ లోగ్’లో చూపించే బస్తీలోనే నేను పుట్టి పెరిగాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి కారణం నా భర్త రమణా రెడ్డి. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆగస్ట్ 21న మా మూవీ రాబోతోంది. అందరూ మా సినిమాని చూసి ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

కల్చర్‌ను ప్రతీకగా తీసే సినిమాలు

మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ .. "కల్చర్‌ను ప్రతీకగా తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్‌ను, ఇక్కడి బస్తీలను రమణా రెడ్డి గారు అద్బుతంగా క్యాప్చర్ చేశారు. ‘అమీర్ లోగ్’ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన రాహుల్, కీరవాణి గారికి థాంక్స్. తెలుగు సినిమాల్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది. ఆగస్ట్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి" అని చెప్పుకొచ్చారు.

"‘అమీర్ లోగ్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన రమణా రెడ్డి గారికి థాంక్స్. హరి, మనోజ్, శశి అద్భుతంగా నటించారు. వేద అందరినీ ఆకట్టుకుంటుంది. అందరూ మా మూవీని చూడాలని కోరుకుంటున్నాను" నటి కీర్తి పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe