...
...
Next Story

నాలుగేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి పాయల్ రాజ్‌పుత్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌.. డ‌బ్బు, న‌గ‌ల కోసం హ‌త్య కుట్ర‌

నాలుగేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి పాయల్ రాజ్‌పుత్ సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరో ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Nov 9, 2025, 18:30:02 IST
Advertisement

నాలుగేళ్ల తర్వాత హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘అనగనగా ఓ అతిథి’ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇన్ని రోజులూ ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోని అందుబాటులోకి వచ్చింది. ఓ హత్య కుట్ర చుట్టూ సస్పెన్స్ రేపుతూ సాగుతోంది ఈ సినిమా.

అనగనగా ఓ అతిథి ఓటీటీ

ఓటీటీలో పాయల్ థ్రిల్లర్ మూవీ (youtube)
ఓటీటీలో పాయల్ థ్రిల్లర్ మూవీ (youtube)

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ అనగనగా ఓ అతిథి. ఇది డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజైంది. ఆహా ఒరిజినల్ ఫిల్మ్ గా ఇది తెరకెక్కింది. దీన్ని 2020, నవంబర్ 20న డైరెక్ట్ గా ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. పేదరికం, డబ్బు, అత్యాశ, కోరిక చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

మరో ఓటీటీలోకి

అనగనగా ఓ అతిథి సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చింది. నాలుగేళ్ల తర్వాత ఇంకో డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ లో పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ, వీణ సుందర్, ఆనంద చక్రపాణి తదితరులు నటించారు. అనగనగా ఓ అతిథి సినిమాకు దయాళ్ పద్మనాభన్ డైరెక్టర్.

ఆ మూవీ రీమేక్

కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ‘ఆ కరాళ రాత్రి’ మూవీకి రీమేక్ ఈ అనగనగా ఓ అతిథి సినిమా. 2018లో వచ్చి ఆ కరాళ రాత్రి హిట్ గా నిలిచింది. ఆ సినిమాను తెలుగులో అనగనగా ఓ అతిథి పేరుతో ఆహా ఓటీటీ రీమేక్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా సినిమాకు కాస్త మార్చి డైరెక్ట్ గా తెలుగులో రిలీజ్ చేసింది.

అనగనగా ఓ అతిథి కథ

ఆ సమయంలోనే శ్రీనివాస్ (చైతన్య కృష్ణ) మల్లిక కుటుంబంలోకి వస్తాడు. అతను బాగా ధనవంతుడు. అతనికి మల్లిక కుటుంబం మర్యాదలు చేస్తుంది. ఆ క్రమంలో అతని దగ్గర పెట్టెనిండా డబ్బు, నగలు చూసి మల్లికకు దురాశ మొదలవుతుంది. అతణ్ని టెంప్ట్ చేయాలని చూస్తుంది. శ్రీనివాస్ ను చంపి ఆ డబ్బు, నగలు తీసుకోవాలని అనుకుంటుంది. మరి శ్రీనివాస్ ను మల్లిక కుటుంబం చంపిందా? అసలు శ్రీనివాస్ ఎవరు? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks