...
...
Next Story

అలవైకుంఠపురంలో తర్వాత సంతృప్తికర సంక్రాంతి ఇది.. వాళ్లకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్స్

అనగనగా ఒక రాజు మూవీ సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆరేళ్ల తర్వాత తనకు ఇది ఎంతో సంతృప్తిని మిగిల్చిన సంక్రాంతి అని చెప్పాడు. సక్సెస్ కు కారణమైన అందరికీ థ్యాంక్స్ చెప్పడం విశేషం.

Published on: Jan 16, 2026, 18:20:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన మూవీ అనగనగా ఒక రాజు. ఈ సంక్రాంతికి భారీ కాంపిటీషన్ మధ్య వచ్చినా మంచి సక్సెస్ సాధించింది. దీంతో మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ.. ఆరేళ్ల కిందట వచ్చిన అలవైకుంఠపురంలో తర్వాత తనకు ఇదే బెస్ట్ సంక్రాంతి అని అనడం విశేషం.

నాగవంశీ ఏమన్నాడంటే?

అలవైకుంఠపురంలో తర్వాత సంతృప్తికర సంక్రాంతి ఇది.. వాళ్లకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్స్
అలవైకుంఠపురంలో తర్వాత సంతృప్తికర సంక్రాంతి ఇది.. వాళ్లకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్స్

టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అతడు నిర్మించిన అనగనగా ఒక రాజు మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించింది. దీంతో ఆరేళ్ల తర్వాత తనకు ఇదే అత్యంత సంతృప్తికర సంక్రాంతి అని అతడు అన్నాడు. శుక్రవారం (జనవరి 16) మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.

“లాస్ట్ ఇయర్ కూడా పెద్ద హిట్ కానీ అనుకున్నంత సాటిస్‌ఫ్యాక్షన్ లేదు. సినిమా హిట్ అయితే ఉండే 100 శాతం సంతృప్తి లేదు. ఈసారి మాత్రం 2020లో వచ్చిన అలవైకుంఠపురంలో తర్వాత అంతటి సంతృప్తినిచ్చిన సంక్రాంతి నాకిది. ఇలాంటి సంక్రాంతి మళ్లీ ఇచ్చిన ఆడియెన్స్ ను రుణపడి ఉంటాను. మీడియా కూడా నా సినిమా సక్సెస్ కావాలని కోరుకుంది. అటు నా కాంపిటీటర్ ప్రొడ్యూసర్లు కూడా అదే కోరుకున్నారు. వరుసగా రెండు సినిమాలు బోల్తా పడటంతో వాళ్లు అలా అనుకున్నారు. 72 గంటలుగా మా ఫ్యాన్ బాయ్స్ అందరూ చాలా కష్టపడుతున్నారు. మరిన్ని లాభాలు తీసుకురండి. వాళ్లందరికీ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా” అని నాగవంశీ అన్నాడు.

అనగనగా ఒక రాజు మూవీ విశేషాలు

తన తాతకు ఉన్న గొప్ప పేరును ఉపయోగించుకొని డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే రాజు పాత్రలో నవీన్ నటించాడు. ఫస్ట్ నైట్ రోజు వచ్చే లెటర్ అతని జీవితాన్ని ఎలా మార్చేసిందన్నదే ఈ మూవీ స్టోరీ. ఈసారి సంక్రాంతికి రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తిలాంటి సినిమాలు ఉన్నా ధైర్యం చేసి బరిలోకి దిగిన అనగనగా ఒక రాజు ఊహకందని విజయం సొంతం చేసుకుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks