ఆ సినిమాకు పది షోలు మాత్రమే ఇస్తామన్నారు- కానీ, ఆడియెన్సే మార్కెటింగ్ చేశారు- హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్

తెలుగు హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించిన లేటెస్ట్ కామెడీ సినిమా అనగనగా ఒక రాజు. డైరెక్టర్ మారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (జనవరి 14) రిలీజ్ కానుంది. రెండు రోజుల ముందు వరంగల్‌లో నిర్వహించిన అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్ చేశాడు.

Published on: Jan 14, 2026, 10:00:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు క్రేజీ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ కామెడీ మూవీ అనగనగా ఒక రాజు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇవాళ ఈ సినిమా రిలీజ్ కానుంది. రెండు రోజుల ముందు జరిగిన అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నవీన్ పోలిశెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ సినిమాకు పది షోలు మాత్రమే ఇస్తామన్నారు- కానీ, ఆడియెన్సే మార్కెటింగ్ చేశారు- హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్
ఆ సినిమాకు పది షోలు మాత్రమే ఇస్తామన్నారు- కానీ, ఆడియెన్సే మార్కెటింగ్ చేశారు- హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్

వరంగల్‌లోనే జరిగింది

నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. "జాతిరత్నాలు ప్రీ రిలీజ్ వేడుక కూడా ఈ వరంగల్ ప్రాంతంలోనే జరిగింది. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' ప్రీ రిలీజ్ వేడుక ఇక్కడ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

పది షోలు మాత్రమే

"'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా సమయంలో మాకు షోలు కూడా దొరకని పరిస్థితి. పది షోలు మాత్రమే ఇస్తామన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాని మీరు మౌత్ టాక్‌తో పెద్ద హిట్ చేశారు. నా ప్రతి సినిమాకి ప్రేక్షకులే మార్కెటింగ్ చేస్తుంటారు. నా సినిమాని భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు" అని నవీన్ పోలిశెట్టి తెలిపాడు.

రెట్టింపు వినోదం అందించాలని

"మీ ప్రేమ, మీ అభిమానం, మీరు నాకు అందించిన మూడు విజయాలు.. నాలో ఎంతో ఎనర్జీని నింపాయి. ఆ ఎనర్జీకి రెట్టింపు వినోదాన్ని మీకు అందించాలని అనుకున్నాను. ఈ క్రమంలోనే 'అనగనగా ఒక రాజు' కథ రాయడం జరిగింది. టీంలో ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు" అని నవీన్ పోలిశెట్టి పేర్కొన్నాడు.

అదే నమ్మకంతో టికెట్ బుక్ చేసుకోండి

"మీరు ఏ నమ్మకంతో అయితే నా సినిమాలకు వచ్చి, వాటిని హిట్ చేశారో.. అదే నమ్మకంతో 'అనగనగా ఒక రాజు'కి టికెట్స్ బుక్ చేసుకోండి. ఆలస్యమైనా కానీ మంచి సినిమా అందించాలనేదే మా ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలోనే ఈ 'అనగనగా ఒక రాజు' సినిమా వస్తుంది" అని చెప్పాడు హీరో నవీన్ పోలిశెట్టి.

నిల్చుని చప్పట్లు కొట్టారు

మేము ఇప్పటికే సినిమాని చాలాసార్లు చూసుకున్నాము. అలాగే చిత్ర బృందంలో భాగం కాని కొందరికి ప్రత్యేక షోలు వేసి సినిమా చూపించాము. వారు సినిమా చూస్తున్నంతసేపూ కడుపుబ్బా నవ్వుతూనే ఉన్నారు. అలాగే భావోద్వేగ సన్నివేశాలు చూసి హత్తుకున్నారు. సినిమా అయిపోగానే అందరూ నిల్చొని చప్పట్లు కొట్టారు. ఇలాంటి స్పందన చూసి మాకు చాలా సంతోషం కలిగింది" అని నవీన్ పోలిశెట్టి వెల్లడించాడు.

మూడు విజయాల తర్వాత

ఇదిలా ఉంటే, మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి ఇప్పుడు అనగనగా ఒక రాజుతో రానున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More