...
...
Next Story

ఆడాళ్లకు ఫీలింగ్స్ ఉంటే కదా గడ్డం పెరగడానికి.. తెగ నవ్వించేస్తున్న అనగనగా ఒక రాజు ట్రైలర్.. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ

పక్కా సంక్రాంతి వైబ్స్‌తో అనగనగా ఒక రాజు ట్రైలర్ వచ్చేసింది. గురువారం (జనవరి 8) రిలీజైన ఈ ట్రైలర్ చాలా ఫన్నీగా సాగిపోయింది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Published on: Jan 8, 2026, 13:55:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఈ ఏడాది సంక్రాంతికి మరో సర్‌ప్రైజ్ హిట్ రెడీ అవుతోందా? తాజాగా వచ్చిన అనగనగా ఒక రాజు మూవీ ట్రైలర్ చూస్తే అదే అనిపిస్తోంది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన ఈ మూవీ ట్రైలర్ మొత్తం సరదాగా సాగిపోయింది. సినిమా మొత్తం వందకు వంద శాతం నవ్వులు గ్యారెంటీ అనేలా ఈ ట్రైలర్ ఉంది.

అనగనగా ఒక రాజు ట్రైలర్

ఆడాళ్లకు ఫీలింగ్స్ ఉంటే కదా గడ్డం పెరగడానికి.. తెగ నవ్వించేస్తున్న అనగనగా ఒక రాజు ట్రైలర్.. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ
ఆడాళ్లకు ఫీలింగ్స్ ఉంటే కదా గడ్డం పెరగడానికి.. తెగ నవ్వించేస్తున్న అనగనగా ఒక రాజు ట్రైలర్.. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ

ప్రభాస్, చిరంజీవి, రవితేజ, శర్వానంద్ లాంటి స్టార్ హీరోల మధ్య సంక్రాంతి బరిలో నిలిచాడు యువ నటుడు నవీన్ పోలిశెట్టి. తన మార్క్ కామెడీతో అనగనగా ఒక రాజు మూవీతో రాబోతున్నాడు. జనవరి 14న భోగి రోజు మూవీ రిలీజ్ కానుండగా.. గురువారం (జనవరి 8) ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఓపెన్ చేయగానే.. బుల్లెట్ బండిపై నవీన్ పోలిశెట్టి స్టైలిష్ గా వస్తుంటాడు. బ్యాక్‌గ్రౌండ్ లో నాగార్జున వాయిస్ ఓవర్ చెబుతుంటాడు. అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి చాలా పెద్ద మనసు అంటూ అది సాగిపోయింది. ఈ సినిమాలో నవీన్.. 'రాజు' అనే పాత్రలో, పెళ్లి చేసుకోవడానికి నానా తంటాలు పడే యువకుడిగా కనిపిస్తున్నాడు.

ట్రైలర్ చూస్తుంటే.. ఇది ఒక ఫన్-ఫిల్డ్ మ్యారేజ్ డ్రామాగా అనిపిస్తోంది. అట్టహాసంగా పెళ్లి జరగాల్సిన టైంలో ఊహించని సమస్యలు రావడం, కిడ్నాప్ డ్రామాలు, ఆ గందరగోళంలో హీరో పడే పాట్లు.. ఇవన్నీ హిలేరియస్‌గా కట్ చేశారు. ముఖ్యంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎనర్జీ, నవీన్ కామెడీ టైమింగ్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.

నీవన్ మార్క్ కామెడీ

అనగనగా ఒక రాజు సినిమాను మారి డైరెక్ట్ చేశాడు. నాగవంశీ నిర్మించాడు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి సినిమాల్లో తమదే చిన్న బడ్జెట్ మూవీ అని ఇప్పటికే పలుమార్లు నాగవంశీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే లోబడ్జెట్ మూవీ అయినా.. కామెడీ కంటెంట్ తో పండుగ పూట తెగ నవ్వించడానికి నవీన్ పోలిశెట్టి సిద్ధమయ్యాడు. మీనాక్షి తన అందంతో ఆకట్టుకుంది.

ఈ సినిమా జనవరి 14న (భోగి పండగ రోజు) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రభాస్ 'రాజా సాబ్', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' బరిలో ఉన్నా.. పక్కా కామెడీ సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి కూడా క్యూ కడతారని మేకర్స్ నమ్ముతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks