Anakapalli Movie Review And Rating In Telugu: ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ రూరల్ లవ్ రొమాంటిక్ రివేంజ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘అనకాపల్లి’.

కాండ్రేగుల నాయుడు, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతలుగా రూపొందించిన ఈ సినిమాతో ఖగేష్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీని అక్టోబర్ 2న అంటే ఇవాళ విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఏ మేరకు మెప్పించిందో నేటి అనకాపల్లి రివ్యూలో చూద్దాం.
కథ:
అనకాపల్లిలో బుల్లెట్ (తారక్ పొన్నప్ప) తిరుగులేని రౌడీలా చలమాణి అవుతుంటాడు. బుల్లెట్‌కి నాయుడు (కాండ్రేగుల నాయుడు) అనే డ్రగ్ డీలర్‌తో గొడవలు ఉంటాయి. ఇక అదే గ్రామంలో కరెంట్ ఆఫీసులో ఏఈగా పని చేస్తుంటాడు సాంబ శివ రావు (త్రినాథరావు నక్కిన). అతని కొడుకే సూర్య (విక్రమ్ సహిదేవ్).
తండ్రి నిజాయితీగా ఉండటం, మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేస్తుండటం సూర్యకి నచ్చదు. ఇక బుల్లెట్ హవా, యాటిట్యూడ్, హీరోయిజం చూసి అతని గ్యాంగ్‌లో చేరతాడు సూర్య. అలా చివరకు బుల్లెట్‌కి రైట్ హ్యాండ్‌లా మారిపోతాడు. అయితే ఈ క్రమంలో సూర్యకి తొలి చూపులోనే అమృత (సంధ్య వశిష్ట) నచ్చేస్తుంది. అమృతకి ఉన్న కరెంట్ మీటర్ సమస్యని తీర్చేందుకు సూర్య ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అమృత మీద మరింత ప్రేమను పెంచుకుంటాడు సూర్య.
అలాంటి సూర్యకి ఊహించని సీన్ ఎదురవుతుంది. తాను ఎంతో ఇష్టంగా చూసుకున్న బుల్లెట్, తాను ఎంతో ఇష్టపడ్డ అమృత కలిసి ఉండటం చూసి తట్టుకోలేకపోతాడు సూర్య. అసలు అమృత ఆ బుల్లెట్‌ని ఎలా ఇష్టపడింది? ఆమె మనసులో అతడి పట్ల ప్రేమ ఎలా మొదలైంది? మరి సూర్య ప్రేమ కథ ఎలా ముగుస్తుంది? చివరకు ఈ కథలో ఎవరి పాత్ర ఎలా ముగుస్తుంది? ఈ ప్రయాణంలో తల్లి జయంతి (ఇంద్రజ), ఎమ్మెల్యే (శ్రీనివాస్ వడ్లమాని) పాత్రలు ఏంటి? చివరకు ఏం అవుతుంది? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
{{/usCountry}}అలాంటి సూర్యకి ఊహించని సీన్ ఎదురవుతుంది. తాను ఎంతో ఇష్టంగా చూసుకున్న బుల్లెట్, తాను ఎంతో ఇష్టపడ్డ అమృత కలిసి ఉండటం చూసి తట్టుకోలేకపోతాడు సూర్య. అసలు అమృత ఆ బుల్లెట్‌ని ఎలా ఇష్టపడింది? ఆమె మనసులో అతడి పట్ల ప్రేమ ఎలా మొదలైంది? మరి సూర్య ప్రేమ కథ ఎలా ముగుస్తుంది? చివరకు ఈ కథలో ఎవరి పాత్ర ఎలా ముగుస్తుంది? ఈ ప్రయాణంలో తల్లి జయంతి (ఇంద్రజ), ఎమ్మెల్యే (శ్రీనివాస్ వడ్లమాని) పాత్రలు ఏంటి? చివరకు ఏం అవుతుంది? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
{{/usCountry}}‘అనకాపల్లి’ ఒక విలేజ్ లవ్ రొమాంటిక్ రివేంజ్ యాక్షన్ డ్రామా. కానీ, ఈ కథలో చెప్పడానికి ఎన్నో అంశాలున్నాయి. ఓ కుర్రాడు తప్పు దారి పడితే జీవితం ఎలా మారిపోతుంది.. కత్తి పట్టిన వాడు కత్తిపోటుకే బలి అవుతాడు.. పిల్లలు చేసే తప్పులకు తల్లిదండ్రులు పడే వేదన ఎలా ఉంటుంది.. ప్రేమకు, ఆకర్షణకు ఉన్న తేడా ఏంటి.. ఇలా ఎన్నెన్నో విశేషాల్ని అంతర్లీనంగా కథలో చెప్పే ప్రయత్నం చేశారు.
డైరెక్టర్ త్రినాథరావు రాసిన కథకి ఖగేష్ తన వంతుగా న్యాయం చేశాడనే చెప్పొచ్చు. అయితే ఈ రా అండ్ రస్టిక్ లవ్ రివేంజ్ డ్రామా అక్కడక్కడా స్లో అయినా ఇంటర్వెల్, క్లైమాక్స్‌కి హార్డ్ హిట్టింగ్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బుల్లెట్ హంగామా, అతని గ్యాంగులో సూర్య చేరి మెల్లిమెల్లిగా ఎదగడం, అదే సమయంలో హీరోయిన్ పాత్ర ఎంట్రీ.. లవ్ ట్రాక్.. ఇలా సాదాసీదాగా సాగుతుంది.
సర్‌ప్రైజ్ చేసే ఇంటర్వెల్
ఇందులో కొత్త ఏముంది అని అనుకునే సమయానికే ఇంటర్వెల్ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్ హార్డ్ హిట్టింగ్‌లా ఉంటుంది. సెకండాఫ్ మొత్తం ఎమోషనల్ జర్నీగా, రివేంజ్ డ్రామాగా సాగుతుంది. ఇక క్లైమాక్స్ అయిపోయింది.. అని అనుకున్న టైంలో మళ్లీ ఓ బ్లాక్ పెడతారు. అలా చివరకు అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేస్తారు. ప్రేమకు నిర్వచనం చెప్పేలా, లోతైనా భావోద్వేగంతో, ఆలోచింపజేసేలా కథను ముగించేస్తారు.
నటీనటుల విషయానికి వస్తే.. విక్రమ్ సహిదేవ్ హీరోగా సూర్య పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించాడు. ఎమోషన్స్, యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ విక్రమ్ మెప్పించాడు. అయితే కొన్ని చోట్ల ఇంకాస్త పరిణితిని కనబర్చితే బాగుండనిపిస్తుంది. ఇక తారక్ పొన్నప్ప అయితే తన నటనతో అందరినీ భయపెట్టేస్తాడు.
ఆకట్టుకునే నటీనటులు
సంధ్య వశిష్టను తెరపై చూస్తే నిజంగానే అనకాపల్లి అమ్మాయిలానే సహజంగా నటించేసింది. ఫస్ట్ హాఫ్‌లో డ్రగ్స్ డాన్‌గా నాయుడు పాత్రలో నిర్మాత కాండ్రేగుల నాయుడు చక్కగా నటించారు. తండ్రిగా త్రినాథరావు, తల్లిగా ఇంద్రజ మిడిల్ క్లాస్ పేరెంట్స్‌లా ఒదిగిపోయారు. రౌడీ గ్యాంగ్, ఎమ్మెల్యే, ఎస్సై, డీఎస్పీ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో పరిధి మేరకు మెప్పించారు.
టెక్నికల్‌గా చూసుకుంటే అనకాపల్లి ఎంతో రూటెడ్, రస్టిక్, విలేజ్ డ్రామాగా కనిపిస్తుంది. మనల్ని కూడా అనకాపల్లిలోకి తీసుకు వెళ్లినట్టుగా అనిపిస్తుంది. మాటలు, పాటలు, కెమెరా వర్క్ ఇలా అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తాయి. క్యాస్టూమ్స్ కూడా ఆ కాలానికి తీసుకు వెళ్లినట్టుగా కనిపిస్తుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే?
నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. మొదటి ప్రాజెక్ట్ అయినా కూడా గొప్పగా సినిమాని నిర్మించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఓ లవ్ రివేంజ్ డ్రామాను ఇష్టపడేవారికి అనకాపల్లి గుండెలను బరువెక్కించే ప్రేమకథ అవుతుంది.