...
...
Next Story

తెలుగు సినిమా ఏకంగా 30 భాషల్లో.. నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న ఆనంద్ దేవరకొండ మూవీ సరికొత్త రికార్డు

నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తున్న ఓ తెలుగు సినిమా ఇప్పుడు ఏకంగా 30 భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఈ విషయాన్ని ఆ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీయే వెల్లడించాడు. ఎపిక్ మూవీ టైటిల్ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా అతడు చెప్పిన విషయం ఆసక్తి రేపుతోంది.

Published on: Dec 2, 2025, 17:27:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మూవీ తక్షకుడు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. సుమారు రెండు నెలల కిందట నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాకు సంబంధించి వెల్లడించిన ఓ విషయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

తక్షకుడు మూవీ 30 భాషల్లో..

తెలుగు సినిమా ఏకంగా 30 భాషల్లో.. నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న ఆనంద్ దేవరకొండ మూవీ సరికొత్త రికార్డు
తెలుగు సినిమా ఏకంగా 30 భాషల్లో.. నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న ఆనంద్ దేవరకొండ మూవీ సరికొత్త రికార్డు

నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా వస్తున్న సినిమా తక్షకుడు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి ఎందుకు తీసుకొస్తున్నామో వెల్లడించాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. తాను ప్రొడ్యూస్ చేస్తున్న ఎపిక్ మూవీ టైటిల్ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా అతడు మాట్లాడాడు.

ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 30 భాషల్లో వివిధ దేశాల్లో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందని, ఎక్కువ మంది ఆడియెన్స్ కు చేర్చేందుకు ఇలా చేశామని చెప్పాడు. కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసం ఉంటే.. మరికొన్ని ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరేందుకు ఓటీటీ బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు. తక్షకుడు మూవీని 30 భాషల్లో రిలీజ్ చేస్తున్నారంటే.. అందులో అంతలా ఏముంది? అసలు ఆ సినిమా స్టోరీ ఏంటన్నదానిపై చర్చ మొదలైంది.

తక్షకుడు ఓటీటీ రిలీజ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తమ్ముడు, నటుడు అయిన ఆనంద్ దేవరకొండ గతంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ తో నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరోసారి అతడు నటించిన తక్షకుడు కూడా ఓటీటీలోకే వస్తోంది. ఆ మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మూవీ తీసిన డైరెక్టర్ వినోద్ అనంతోజుతోనే ఆనంద్ ఈ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీకి తక్షకుడు అనే ఓ డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ మూవీని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెబుతూ గతంలోనే నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe