Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ చాలా రోజుల తర్వాత నటించిన మూవీ ఎపిక్ (Epic). ఈ మూవీ టీజర్ బుధవారం (ఏప్రిల్ 29) రిలీజైంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆనంద్ తోపాటు వైష్ణవి చైతన్య, డైరెక్టర్ ఆదిత్య హాసన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వదినమ్మను కూడా పిలుస్తా..

ఎపిక్ టీజర్ లాంచ్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగా చివర్లో వదినను కూడా పిలుస్తారా అని ఒకరు అడిగారు. దీనికి ఆనంద్ స్పందిస్తూ.. కచ్చితంగా వదినమ్మ (రష్మిక మందన్న)ను కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు పిలుస్తాను అని ఆనంద్ అన్నాడు.
అంతేకాదు ఇంతకుముందు వదిన అంటూ ఏడిపించారు.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా వదిన వదిన అంటున్నాను అని ఆనంద్ అనడం విశేషం. రష్మిక తమ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని, మరింత వెలుగు నింపిందని చెప్పాడు.
నువ్వో స్పెషల్ యాక్టర్
ఈ సందర్భంగా ఎపిక్ మూవీలో ఫిమేల్ లీడ్ గా నటించిన వైష్ణవి చైతన్యపైనా ఆనంద్ ప్రశంసలు కురిపించాడు. ఆమెతో నటిస్తుంటే తాను ఆటో పైలట్ మోడ్ లోకి వెళ్లిపోతానని, ఆమె ఓ స్పెషల్ యాక్టర్ అని అన్నాడు. ఆమె ఓ నటిగా మారడానికే పుట్టిందని, ఎలాంటి నటననైనా చాలా సులువుగా చేసేస్తుందని ఆనంద్ చెప్పాడు. తనతో నటించే అవకాశం రావడం అదృష్టమని తెలిపాడు. కెరీర్లో ఆమె చాలా ఎత్తుకు వెళ్తుందని కూడా అన్నాడు.
వీడు పక్కా ఒరిజినల్ డైరెక్టర్
ఇక ఎపిక్ మూవీ డైరెక్టర్ ఆదిత్య గురించి ఆనంద్ మాట్లాడుతూ.. వీడు ఓ పక్కా ఒరిజినల్ డైరెక్టర్ అని అన్నాడు. “డైరెక్టర్లలో రెండు రకాలు ఉంటారు. ఒకరు ఒరిజినల్ డైరెక్టర్స్. మరొకరు ఈ ఒరిజినల్ డైరెక్టర్లను చూసి ఇన్స్పైర్ అయ్యే డైరెక్టర్లు. వీడు మాత్రం పక్కా ఒరిజినల్ డైరెక్టర్. మీలో ఎవరైనా డైరెక్టర్ కావాలనుకుంటే వీడిని చూసి ఇన్స్పైర్ అవుతారు” అని ఆనంద్ స్పష్టం చేశాడు.
ఎపిక్ టీజర్ విశేషాలు
{{/usCountry}}ఇక ఎపిక్ మూవీ డైరెక్టర్ ఆదిత్య గురించి ఆనంద్ మాట్లాడుతూ.. వీడు ఓ పక్కా ఒరిజినల్ డైరెక్టర్ అని అన్నాడు. “డైరెక్టర్లలో రెండు రకాలు ఉంటారు. ఒకరు ఒరిజినల్ డైరెక్టర్స్. మరొకరు ఈ ఒరిజినల్ డైరెక్టర్లను చూసి ఇన్స్పైర్ అయ్యే డైరెక్టర్లు. వీడు మాత్రం పక్కా ఒరిజినల్ డైరెక్టర్. మీలో ఎవరైనా డైరెక్టర్ కావాలనుకుంటే వీడిని చూసి ఇన్స్పైర్ అవుతారు” అని ఆనంద్ స్పష్టం చేశాడు.
ఎపిక్ టీజర్ విశేషాలు
{{/usCountry}}ఎపిక్ మూవీ టీజర్ చాలా ఇంట్రెస్టింగా సాగింది. ముఖ్యంగా ఇందులో ఆనంద్, వైష్ణవి మధ్య కెమెస్ట్రీ, లిప్ లాక్స్ ఆకట్టుకున్నాయి. 90's వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆదిత్య డైరెక్టర్ గా వస్తున్న మూవీ కావడంతో ఎపిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఆనంద్ మాట్లాడుతూ.. ఈ మూవీ చూస్తుంటే కాలేజీ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారని, ఆ నోస్టాల్జియా ఫీలింగ్ మీకు కలుగుతుందని చెప్పాడు.