...
...
Next Story

RGV Tweet Raptadu: కిడ్నాప్‌లు పెర‌గ‌డానికి రామాయ‌ణ‌మే కార‌ణ‌మ‌న్న‌ట్లుంది- రాప్తాడు ఘ‌ట‌న‌పై ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్!

Ram Gopal Varma Tweet Raptadu: అనంతపురం జిల్లా రాప్తాడులో ఓ విద్యార్థినిపై జరిగిన దారుణ దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన తర్వాత సమాజంలో పెరుగుతున్న హింసకు సినిమాలే కారణమా అనే చర్చ మొదలైంది. దీనిపై ఆర్జీవీ ట్వీట్ వివాదాస్పదమైంది. నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Published on: Nov 2, 2026, 06:15:09 IST
Advertisement

Ram Gopal Varma Tweet Raptadu: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మనుషులు రాక్షసుల్లా మారుతున్నారడానికి ఇదే నిదర్శనమనే కామెంట్లు వస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్ చేశారు.

అసలేం జరిగిందంటే?

కిడ్నాప్‌లు పెర‌గ‌డానికి రామాయ‌ణ‌మే కార‌ణ‌మ‌న్న‌ట్లుంది- రాప్తాడు ఘ‌ట‌న‌పై ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్!
కిడ్నాప్‌లు పెర‌గ‌డానికి రామాయ‌ణ‌మే కార‌ణ‌మ‌న్న‌ట్లుంది- రాప్తాడు ఘ‌ట‌న‌పై ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్!

శనివారం (అక్టోబర్ 31) రాప్తాడు గవర్నమెంట్ స్కూల్ లోకి ఓ దుండగుడు రంపంతో తరగతి గదిలోకి చొరబడి పదో తరగతి విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటనలో 15 ఏళ్ల బాలిక కుడి చేయి కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, ఆమెను కాపాడేందుకు యత్నించిన మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్యం కోసం బాధిత బాలికను గ్రీన్ కారిడార్ ద్వారా అనంతపురం నుంచి బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడిలో ఉన్న ఆడపిల్లలపై దాడి చేసే వారికి సమాజంలో స్థానం లేదని, బాలికకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

హింసను ప్రేరేపిస్తున్న 'ఏ' రేటెడ్ సినిమాలు?

ఈ దారుణ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. 'యానిమల్', 'కేజీఎఫ్' లాంటి సినిమాల్లో రక్తపాతాన్ని, క్రూరత్వాన్ని హీరో ఎలివేషన్ కోసం వాడుకోవడం వల్లే సమాజంలో ఇలాంటి దాడులు సాధారణం అయిపోతున్నాయా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో చూపించే అదుపులేని హింస యువత, చిన్నపిల్లల ఆలోచనా విధానంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఆర్జీవీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. "చారిత్రక ఉదాహరణలు చెబుతూ సినిమాకు సామాజిక బాధ్యత లేదని తప్పించుకోకండి. అత్యంత దారుణమైన హత్యలను కూడా సినిమాల్లో చాలా కూల్‌గా, హీరోయిక్‌గా చూపిస్తున్నారు. దీనివల్ల 8 ఏళ్ల పిల్లలు కూడా రాక్షసుల్లా పెరుగుతున్నారు. సమాజం పట్ల సినిమా వాళ్లకు కాస్తయినా సిగ్గు, బాధ్యత ఉండాలి" అని ఒక యూజర్ ఫైర్ అయ్యారు.

"సినిమాల వల్లే నేరుగా నేరాలు జరుగుతాయని ఎవరూ అనట్లేదు, కానీ సినిమాల ప్రభావం సమాజంపై జీరో అని చెప్పడం మూర్ఖత్వం. ప్రేక్షకుల ఆలోచనలను సినిమాలు మారుస్తాయి" అని మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చారు. "మనం చూసేదే మనల్ని ప్రభావితం చేస్తుంది. భారత్ లాంటి దేశంలో సినిమాల ప్రభావం ప్రజల మైండ్‌సెట్‌పై చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నిజాన్ని దాచిపెట్టి మేధావిలా మాట్లాడటం కరెక్ట్ కాదు" అంటూ నెటిజన్లు వర్మను ఏకిపారేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks