Anasuya: అనసూయ భరద్వాజ్.. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా వెలుగు వెలిగిన ఆమె, ఇప్పుడు నటిగా బిజీ అయిపోయారు. తెలుగు సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ సాగిపోతున్నారు. అదే సమయంలో ఎప్పటికప్పుడూ తాజా సంఘటనలపై తనదైన స్టైల్లో రియాక్టవుతుంటారు. దీంతో తరచుగా వివాదాల్లో అనసూయ పేరు వినిపిస్తుంటుంది.
అనసూయ జిమ్ వీడియో

అనసూయ భరద్వాజ్ పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది. ఇవాళ (ఆగస్టు 31) అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేసింది. జిమ్ లో వర్కౌట్లు చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, చిత్ర విచిత్రంగా ఎంజాయ్ చేస్తూ వీడియో తీసుకొని తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
ఆగస్టుకు వీడ్కోలు పలుకుతూ
ఈ రోజు ఆగస్టు నెలలో చివరి రోజు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలకు సెండాఫ్ ఇస్తూ అనసూయ ఈ వీడియో పోస్టు చేసింది. ‘‘ఆగస్టు.. నువ్వు నన్ను మరింత బలంగా మార్చావు. చురుకుగా కదులుతూ.. డ్యాన్స్ చేస్తూ.. నవ్వుతూ.. చెమటోడుస్తూ… పూర్తిగా నన్ను నేనుగా ఆస్వాదిస్తూ... నేను ఎలా ముందుకు సాగాలనుకుంటున్నానో.. అదే ఉత్సాహంతో నిన్ను సాగనంపుతాను’’ అని ఈ వీడియోకు అనసూయ క్యాప్షన్ ఇచ్చింది.
పొట్టి డ్రెస్ లో
అనసూయ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో అనసూయ బ్లాక్ కలర్ పొట్టి బట్టలు వేసుకొని ఉంది. స్టెప్పులు వేసింది. ఈ నేపథ్యంలో అనసూయ ఔట్ ఫిట్ పై విమర్శలు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు కామెంట్లలో ఫైర్ అవుతున్నారు.
ఔట్ ఫిట్ బాలేదంటూ
‘‘శివాజీ చెప్పింది మీ తలకు ఎక్కినట్లు లేదు’’, ‘‘ఔట్ ఫిట్ అస్సలు బాగోలేదు’’, ‘‘నువ్వు ఎన్ని వేషాలు వేసినా జనాలకు అసహ్యమే’’, ‘‘కామెడీ పీస్ లా ఉన్నావ్’’ అని కొంతమంది కామెంట్లు చేశారు.
{{/usCountry}}‘‘శివాజీ చెప్పింది మీ తలకు ఎక్కినట్లు లేదు’’, ‘‘ఔట్ ఫిట్ అస్సలు బాగోలేదు’’, ‘‘నువ్వు ఎన్ని వేషాలు వేసినా జనాలకు అసహ్యమే’’, ‘‘కామెడీ పీస్ లా ఉన్నావ్’’ అని కొంతమంది కామెంట్లు చేశారు.
{{/usCountry}}వివాదాలు
అనసూయ పేరు తరచుగా వివాదాల్లో వినిపిస్తూనే ఉంటుంది. గతంలో శివాజీ వర్సెస్ అనసూయ వివాదం ఎంత పెద్దగా మారిందో తెలిసిందే. హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోవాలని చెప్తూ శివాజీ ఓ అసభ్యకర పదం వాడారు. దీనిపై అనసూయ ఫైర్ అయింది. దీంతో శివాజీ వర్సెస్ అనసూయ మాటల యుద్ధం సాగింది.
రీసెంట్ గా ‘జై శ్రీరామ్’ నినాదంపై అనసూయ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేసేవాళ్లలో కొందరు ఆ పవిత్రమైన పేరును అడ్డం పెట్టుకుని అసాంఘిక దాడులకు పాల్పడుతున్నారని, సనాతన ధర్మం ముసుగులో దొంగలు తిరుగుతున్నారని అనసూయ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.