నటి రాశికి అనసూయ భరద్వాజ్ క్షమాపణ చెప్పింది. నటుడు శివాజీ చేసిన కామెంట్స్, దానికి అనసూయ కౌంటర్.. దీనికి ప్రతిగా ఆమె మూడేళ్ల కిందట జబర్దస్త్ షోలో చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో అనసూయ దిగి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో రాశికి క్షమాపణ చెబుతూ ఆమె ఓ పోస్ట్ చేసింది. తనను అవమానించేలా మాట్లాడిన అనసూయపై రాశి మండిపడిన తర్వాత ఆమె క్షమాపణ చెప్పడం గమనార్హం.
అనసూయ క్షమాపణ

అనసూయ భరద్వాజ్ సినిమాల్లోకి వచ్చే ముందు ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో యాంకర్ గా ఉన్న విషయం తెలుసు కదా. అప్పట్లో ఓ స్కిట్ లో రాశి గారు ఫలాలు అని అనసూయ అనడం, అవి రాశి ఫలాలు అని హైపర్ ఆది కౌంటర్ వేసిన వీడియో ఈ మధ్య బాగా వైరల్ అయింది.
శివాజీ కామెంట్స్ విషయంలో అనసూయ గట్టిగా రిప్లై ఇచ్చిన నేపథ్యంలో మూడేళ్ల కిందటి ఈ వీడియోను మళ్లీ తెరపైకి తెచ్చి ట్రోల్ చేశారు. నటి రాశి కూడా దీనిపై మండిపడిన వీడియో ఒకటి బయటకు రావడంతో అనసూయ దిగి వచ్చి క్షమాపణ చెప్పింది. ఆ పోస్టులో ఆమె ఏం రాసిందో చూడండి.
నా శక్తి సరిపోలేదు
“డియర్ రాశి గారు.. మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను.. మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో “ తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే.. దానికి క్షమించండి" అని అనసూయ రాసింది.
అంతేకాదు ఇంకా కొనసాగిస్తూ.. "వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. మనుషులు మారతారు, పరిణతి సాధిస్తారు. ఆ షో లో ద్వంద్వార్ధపు మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి విద్వేష ప్రచారం నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను” అని అనసూయ చెప్పింది.
{{/usCountry}}అంతేకాదు ఇంకా కొనసాగిస్తూ.. "వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. మనుషులు మారతారు, పరిణతి సాధిస్తారు. ఆ షో లో ద్వంద్వార్ధపు మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి విద్వేష ప్రచారం నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను” అని అనసూయ చెప్పింది.
{{/usCountry}}