...
...
Next Story

అది మగతనం అనిపించుకోదు.. నీ ఉచిత సలహాలు అవసరం లేదు: శివాజీకి మరో గట్టి కౌంటర్ ఇచ్చిన అనసూయ

నటుడు శివాజీ చేసిన కామెంట్స్ కు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరో గట్టి కౌంటర్ ఇచ్చింది. నీ ఉచిత సలహాలు అవసరం లేదని, ఎవరు ఏం వేసుకోవాలో అది వాళ్లు వ్యక్తిగత విషయమని ఆమె అనడం గమనార్హం. మగతనం గురించి కూడా కామెంట్స్ చేసింది.

Published on: Dec 23, 2025 04:48 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నటుడు శివాజీ హీరోయిన్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఓసారి దీనిపై ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్పందించిన అనసూయ.. తాజాగా పరోక్షంగా అతని పేరు ఎత్తకుండానే మళ్లీ కౌంటర్ వేసింది. అలా అనడం మగతనం కాదంటూ ఆమె చాలా గట్టిగానే స్పందించింది.

అనసూయ కౌంటర్ ఇలా..

అది మగతనం అనిపించుకోదు.. నీ ఉచిత సలహాలు అవసరం లేదు: శివాజీకి మరో గట్టి కౌంటర్ ఇచ్చిన అనసూయ
అది మగతనం అనిపించుకోదు.. నీ ఉచిత సలహాలు అవసరం లేదు: శివాజీకి మరో గట్టి కౌంటర్ ఇచ్చిన అనసూయ

నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ అనసూయ కాసేపటి కిందట ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అందులో ఆమె ఇలా రాసుకొచ్చింది.

“ఈ మధ్య ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే దానిపై పబ్లిక్‌గా వస్తున్న కామెంట్స్ చూస్తుంటే.. ఇది గుర్తుచేయాలి అనిపిస్తోంది. కొందరు ఇతరులను కంట్రోల్ చేయడాన్ని 'బాధ్యత' అని, జడ్జ్ చేయడాన్ని 'రక్షణ' అని ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారో ఆశ్చర్యంగా ఉంది. ఒక అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది పూర్తిగా తన పర్సనల్ ఛాయిస్. అది ఎవరినో ఉద్దేశించి వేసుకునేది కాదు, దాని వల్ల ఎవరికీ హాని జరగదు” అని అనసూయ చెప్పింది.

అది మగతనం అనిపించుకోదు

ఇంకా ఆమె స్పందిస్తూ.."నిజానికి ఇతరులను ఇబ్బంది పెట్టేవి, హాని కలిగించేవి ఏంటంటే.. అవతలి వాళ్ళు చేసే కామెంట్స్, చూసే వెకిలి చూపులు, అడగకపోయినా ఇచ్చే ఉచిత సలహాలు. వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మీలోని అభద్రతా భావాన్ని 'మోరల్ పోలీసింగ్' లా మార్చేసి.. అదేదో మగతనం అనో, రక్షణ కల్పిస్తున్నామనో అనుకుంటే పొరపాటు. అది కేవలం ఎదుటివారిని కంట్రోల్ చేయడమే అవుతుంది. గౌరవం ఇవ్వడానికి ఎవరి పర్యవేక్షణా అవసరం లేదు. ఇతరులను కంట్రోల్ చేయాలనుకోవడం అనేది.. బలం ముసుగులో ఉన్న బలహీనత. సాటి మనిషిని గౌరవించడమే నిజమైన పవర్" అని అనసూయ చాలా ఘాటుగా స్పందించింది.

అసలు ఏం జరిగిందంటే?

‘‘ఒక విషయం చెబుతున్నా. అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తదమ్మా. ఏం అనుకోవద్దు హీరోయిన్లందరూ, మీరు అనుకున్నా నాకు పోయేదేం లేదు. లైట్ తీసుకుంటాం అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనే, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనపడేదాంట్లో ఏముండదమ్మా’’ అని శివాజీ అన్నారు.

‘‘అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రపు ము*.. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? మంచివి వేసుకోవచ్చు కదా అని అనాలని ఉంటుంది లోపల. కానీ అనలేం కదా. అంటే మళ్లీ స్ట్రీ స్వాతంత్రం లేదంటారు’’ అని శివాజీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.

స్త్రీ అంటే ప్ర‌కృతి

‘‘స్త్రీ అంటే ప్ర‌కృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్ర‌కృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ ఎప్పటికీ గుండెల్లో కనిపిస్తూ ఉంటుంది. సావిత్రి, సౌందర్య కానీ ఈ జనరేషన్ లో రష్మిక లాంటి వాళ్లు. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్లందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి వెంబడే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. ఇక్కడి (చేతులు) వరకు ఉంటే పర్వాలేదు కానీ ఇక్కడి (ఎద) వరకూ రాకూడదు’’ అని శివాజీ మాట్లాడాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe