ఇది నా శరీరం, నీది కాదు-సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్-మెట్టెలు పెట్టుకోవాలన్న చిన్మయి-శివాజీ వివాదాస్పద కామెంట్లకు కౌంటర్!

అనసూయ భరద్వాజ్ కు కోపమొచ్చింది. సోషల్ మీడియాలో తన అసహనాన్ని వెళ్లగక్కింది. ఇది నా శరీరమంటూ పోస్టు పెట్టింది. శివాజీ హీరోయిన్ల గురించి చేసిన కాంట్రవర్సీ కామెంట్లకు అనసూయ ఇలా కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు. మరోవైపు సింగర్ చిన్మయి కూడా విరుచుకుపడింది. శివాజీ మెట్టెలు పెట్టుకోవాలని డిమాండ్ చేసింది. 

Published on: Dec 23, 2025, 12:48:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరోయిన్ డ్రెస్ లపై సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చీరలోనే అందంగా ఉంటారని, సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకోవద్దని శివాజీ కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. శివాజీ కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కొంతమంది ఖండిస్తే, మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా అనసూయ పోస్ట్ శివాజీ కామెంట్లకు కౌంటర్ గా ఉందని అంటున్నారు. సింగర్ చిన్మయి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

అనసూయ (instagram-Anasuya Bharadwaj)
అనసూయ (instagram-Anasuya Bharadwaj)

అనసూయ పోస్ట్

సోషల్ మీడియాలో ఒకప్పటి హాట్ యాంకర్, ఇప్పుడు నటిగా బిజీ అయిన అనసూయ యాక్టివ్ గా ఉంటోంది. ఏ విషయం అయినా తన అభిప్రాయాలు చెబుతోంది. ట్రోల్స్ ఎన్ని వచ్చినా తగ్గేదేలేదన్నట్లు తన సొంత దారిలో సాగిపోతుంది. ఆమె మంగళవారం (డిసెంబర్ 23) సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ‘‘ఇది నా శరీరం. నీది కాదు (ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్)’’ అని పోస్టు చేసింది. ఇప్పుడీ ఎక్స్ పోస్ట్ వైరల్ గా మారింది.

శివాజీకి కౌంటర్

శివాజీ వివాదాస్పద కామెంట్లకు కౌంటర్ గానే అనసూయ ఈ పోస్టు పెట్టిందని అంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల డ్రెస్ విషయంలో శివాజీ చేసిన వ్యాఖ్యలపై నెగెటివిటీ వస్తుంది. అనసూయ కూడా ఈ విషయంలో ఫైర్ అయింది. అందుకే ఇలా పోస్టు పెట్టిందని చెబుతున్నారు.

మెట్టెలు పెట్టుకోవాలి

సింగర్ చిన్మయి కూడా శివాజీ వ్యాఖ్యలపై మండిపడింది. ‘‘దరిద్రపు ము**, సామాన్ లాంటి అసభ్యమైన పదాలతో నటీమణులకు శివాజీ అనవసరమైన సలహాలు ఇచ్చారు. ఓ అద్భుతమైన సినిమాలో శివాజీ విలన్ గా నటించారు. కానీ ఇప్పుడు స్త్రీ ద్వేషులకు హీరోగా మారారు. దరిద్రపు ము** అనే పదాలను వాడేందుకు ఇది ప్రొఫెషనల్ స్పేసా?

ఆయన జీన్స్, హుడీ వేసుకున్నారు. ఆయన ధోతి మాత్రమే కట్టుకోవాలి. ఇండియన్ కల్చర్ ను ఫాలో కావాలి. బొట్టు పెట్టుకోవాలి. పెళ్లి అయినట్లయితే కంకణం ధరించాలి. పెళ్లయినట్లు మెట్టెలు పెట్టుకోవాలి. మహిళలను ఇలా చూడటం నమ్మశక్యంగా లేదు’’ అని ఎక్స్ లో పోస్టు చేసింది చిన్మయి.

సామాన్లు కనపడేలా

‘‘ఒక విషయం చెబుతున్నా. అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తదమ్మా. ఏం అనుకోవద్దు హీరోయిన్లందరూ, మీరు అనుకున్నా నాకు పోయేదేం లేదు. లైట్ తీసుకుంటాం అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనే, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనపడేదాంట్లో ఏముండదమ్మా’’ అని శివాజీ అన్నారు.

‘‘అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రపు ము*.. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? మంచివి వేసుకోవచ్చు కదా అని అనాలని ఉంటుంది లోపల. కానీ అనలేం కదా. అంటే మళ్లీ స్ట్రీ స్వాతంత్రం లేదంటారు’’ అని శివాజీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More