Peddi Controversy: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రణ, కొన్ని వివాదాస్పద సీన్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇన్ స్టాలో పంచుకున్న ఓ లెంగ్తీ పోస్టు హాట్ టాపిక్ గా మారింది.
అనసూయ స్ట్రైట్ టాక్

సినిమాలు సమాజానికి అద్దం పడతాయనేది వాస్తవమే అయినా, సమాజాన్ని మార్చే లేదా ఎడ్యుకేట్ చేసే పూర్తి బాధ్యతను సినిమాపైనే నెట్టేయడం సరికాదని అనసూయ అభిప్రాయపడింది.
"సినిమా అనేది ప్రాథమికంగా ఒక ఊహాజనిత కథ. ఏది తప్పు, ఏది రైటో తెలుసుకునే విచక్షణ, బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంటాయి. సినిమాల ద్వారా పిల్లల పెంపకం జరగాలని నేను అనుకోవడం లేదు’’ అని ఆమె స్పష్టం చేసింది.
బాధ్యత లేదా?
అయితే ఇదే సమయంలో కథలు చెప్పే మేకర్స్ తమ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకోవడానికి వీల్లేదని అనసూయ గుర్తు చేసింది. సినిమాకు ఒక అద్భుతమైన శక్తి ఉందని, అది సమాజంలో చర్చలను ప్రభావితం చేస్తుందని వివరించింది.
{{/usCountry}}అయితే ఇదే సమయంలో కథలు చెప్పే మేకర్స్ తమ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకోవడానికి వీల్లేదని అనసూయ గుర్తు చేసింది. సినిమాకు ఒక అద్భుతమైన శక్తి ఉందని, అది సమాజంలో చర్చలను ప్రభావితం చేస్తుందని వివరించింది.
{{/usCountry}}‘‘అప్పట్లో హీరో అంటే మనం ఆరాధించే విలువలకు ప్రతీకగా, విలన్ అంటే మనం అనుసరించకూడని చెడు మార్గానికి గుర్తుగా ఉండేవాళ్లు. కానీ ప్రస్తుత కాలంలో ఆ గీత మసకబారిపోయింది. చెడును వైభవంగా చూపించడానికీ, కేవలం పాత్రను ఉన్నది ఉన్నట్లు చూపించడానికీ మధ్య తేడా తెలియకుండా కథనాలు సాగుతున్నాయి’’ అని అనసూయ బోల్డ్ కామెంట్స్ చేసింది.
బాబోయ్ అంత మాట!
తన అభిప్రాయాలు, వ్యక్తిగత స్టాండ్స్ కారణంగా గతంలో తను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని అనసూయ ఈ సందర్భంగా బయటపెట్టింది. ఒకానొక దశలో పాపులర్ టీవీ షో నుంచి కూడా ఆమె బయటకు వచ్చేయాల్సి వచ్చిందని తెలిపింది.
‘‘గతంలో ఒక పాపులర్ టీవీ షో నుంచి నేను బయటకు రావడానికి ఇదే కారణం. నా అభిప్రాయాలు, స్టాండ్స్ ఆ టీమ్ సృజనాత్మకతకు అడ్డుపడుతున్నాయని భావించి నేను తప్పుకొన్నా. అప్పుడు నా గొంతు నొక్కాలని చూశారు. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డా’’ అని అనసూయ షాకింగ్ విషయాలు చెప్పింది.
ఆ షో నుంచే
అనసూయ గతంలో బుల్లితెరపై 'జబర్దస్త్' వంటి బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ ద్వారా స్టార్‌డమ్ తెచ్చుకుంది. అయితే కొన్ని షోలో వచ్చే బాడీ షేమింగ్, డబుల్ మీనింగ్ డైలాగులపై ఆమె గతంలోనూ పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు 'పెద్ది' వివాదం నేపథ్యంలో తను నమ్మిన సిద్ధాంతాల కోసం కెరీర్‌లో ఎంతటి ఆర్థిక నష్టాన్ని, అవకాశాలను వదులుకోవడానికైనా సిద్ధపడ్డానని చెప్పడం టాలీవుడ్ ఇన్‌సైడర్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
People Also Ask (FAQ)
ప్రశ్న: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ సీన్లపై వివాదం ఎందుకు వచ్చింది?
సమాధానం: పెద్ది' సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను ప్రెజెంట్ చేసిన విధానంపై విమర్శలు వచ్చాయి.
ప్రశ్న: అనసూయ భరద్వాజ్ తన సుదీర్ఘ పోస్ట్‌లో దేని గురించి మాట్లాడింది?
సమాధానం: సినిమాలకు ఉండే సామాజిక బాధ్యత, సృజనాత్మక స్వేచ్ఛల మధ్య ఉండాల్సిన సమతుల్యత గురించి అనసూయ మాట్లాడింది.
ప్రశ్న: తన అభిప్రాయాల వల్ల గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని అనసూయ చెప్పింది?
సమాధానం: తన స్పష్టమైన నైతిక అభిప్రాయాల వల్ల గతంలో ఒక టాప్ టీవీ షోను వదులుకోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత పరిశ్రమలో ఇబ్బందులు పడ్డానని వెల్లడించింది.