...
...
Next Story

నేనూ హీరోయిన్‌నే-అది చేత‌గానిత‌నం-ద‌మ్ముంటే మ‌గ‌వాళ్ల‌కు అలా చెప్పండి-నాకు దూరంగా ఉండండి: శివాజీకి అన‌సూయ కౌంటర్

శివాజీ, అనసూయ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హీరోయిన్ల డ్రెస్ లపై శివాజీ అసభ్యకరమైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అనసూయ రియాక్టయింది. అయితే అనసూయ ఎందుకు మధ్యలోకి వచ్చిందని శివాజీ ప్రెస్ మీట్లో అన్నాడు. దీనికి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Published on: Dec 25, 2025, 08:52:36 IST
Advertisement

అనసూయ మరోసారి మాటలతో రెచ్చిపోయింది. సీనియర్ నటుడు శివాజీపై మండిపడింది. తాను కూడా హీరోయిన్ నే అని, తనకు దూరంగా ఉండాలని చెప్పింది. చేతగానితం, దమ్ముందా అంటూ ఇన్ స్టాగ్రామ్ లైవ్ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేసింది అనసూయ.

అనసూయ కామెంట్లు

అనసూయ (instagram-Anasuya Bharadwaj)
అనసూయ (instagram-Anasuya Bharadwaj)

‘‘అతి వినయం ధూర్త లక్షణం. నేను ఒక స్టోర్ లాంఛ్ కు వెళ్లా. అక్కడ జర్నలిస్ట్ లు అడిగిన దానికి చెప్పా. ఆయనకు అనిపించింది ఆయన చెప్పినట్లు నాకు అనిపించింది నేను చెప్పా. ఈ రోజు ఆయన ఒక్కరే ప్రెస్ మీట్ పెట్టి విక్టిమ్ లా కూర్చున్నారు. ఇది చేతగానితనం. ఫెమినిజం అనే వర్డ్ ఉండకూడదు. ఆడ, మగ ఉంటేనే ప్ర‌కృతి ముందుకు వెళ్తుంది’’ అని ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో చెప్పింది అనసూయ.

నేనూ హీరోయిన్ నే

‘‘బట్టల గురించి మాట్లాడటం చేతగానితనం. వాళ్లకు కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్లను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. పాపం ఆయనకు సింపతీ కావాలి కాబట్టి అదే ఇస్తున్నా. నేను కూడా హీరోయిన్ నే. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లు ఒకటో రెండో చేశా. హీరోయిన్ల బట్టల గురించి ఎందుకు? నేను మీకు చెప్తున్నానా ఇలా బట్టలు వేసుకోవాలని? ఎవరైనా ఆ హీరోయిన్లు అయినా మీతో అంటున్నారా? చాలా మంది హీరోయిన్లు నా వాయిస్ వినిపిస్తానని నన్ను పొగుడుతారు. ఆ బలాన్ని పాజిటివ్ గానే తీసుకున్నా’’ అని అనసూయ తెలిపింది.

గ్లామసర్ గా కనిపించాలని

‘‘ఇలాంటి బట్టలు వేసుకోవాలని చెప్పించుకునేంత చిన్న పిల్లలం కాదు. మా ఇష్టాలు మాకు వదిలేయాలని ప్రార్థిస్తున్నాం సర్. మీరు నన్ను లాగలేరు. కానీ కలెక్టివ్ గా లాగారు. నేనూ ఆడదాన్ని. గ్లామసర్ గా కనిపించాలనుకుంటా. నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పా సర్. మీరు ఏదైతే బల్లగుద్ది చెప్పగలుగుతున్నారో, బూతులు మాట్లాడి సారీ చెబుతున్నారో, ఈజీగా మర్చిపోవాలనుకుంటున్నారో కానీ అలా ఉండదు’’ అని అను స్ట్రాంగ్ గానే చెప్పింది.

ప్లేస్ చూపించాలంటే

‘‘మీరు చాలా తెలివిగల వాళ్లు అనుకుంటే మీరు ఒక్కరే అలా ఉంటే సృష్టిక‌ర్త‌లైన‌ మాకు ఎంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నారు. మీకు మీ ప్లేస్ చూపించడానికి మేం కంకణం కట్టుకుంటే ఎలా ఉంటుంది? మరణ శిక్ష వేయండి లాంటివి వద్దు సర్. ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి’’ అని అనసూయ పేర్కొంది.

దమ్ముంటే

బట్టలు అలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసి ఉంది సర్. మీ క్యారెక్టర్ అనేదే ముఖ్యం. మన సనాతనంలో మగవాళ్లు ఎంత నిష్ఠగా ఉండేవాళ్లు అంటే, అప్పుడు ఆడవాళ్లు కేవలం ఒక వస్త్రం చుట్టుకునేవాళ్లు. మొఘలులు, బ్రిటీష్ వాళ్లు వచ్చి ఇదంతా రుద్దారు’’ అని అనసూయ చెప్పింది.

దూరంగా ఉండండి

ప్రెస్ మీట్ లో నా పేరు శివాజీ తీసుకొచ్చారు. చాలా మర్యాదగా చెప్తున్నా. ఆ రుణం తీర్చుకునే అవకాశం తనకు దొరకాలన్నారు. నేను చాలా ఇబ్బందులు దాటుకుని వచ్చా. నాకు మీ సపోర్ట్ అవసరం లేదు. నాకు భర్త, ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు మీ లాంటి వాళ్లు అవసరం లేదు. నాకు దూరంగా ఉండండి.

కామెంట్ చేసిన వాళ్లకు, ప్రెస్ మీట్లో రెచ్చగొట్టేలా మాట్లాడిన పెద్ద మనిషికి లీగల్ నోటీసులు వస్తాయి. ఏం టైప్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం అనేదానిపై జాగ్రత్తగా ఉండండి’’ అని లైవ్ ఎండ్ చేసింది అనసూయ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe