అనసూయా.. నువ్వెందుకు వచ్చావు మధ్యలో.. నిన్నేమన్నాను.. ఆ హీరోయిన్‌కు అలా జరిగింది కాబట్టే ఆ మాటన్నాను: శివాజీ

హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్ చేసిన శివాజీ తాజాగా అనసూయను టార్గెట్ చేశాడు. తాను మధ్యలో ఎందుకు వచ్చిందని, తననేమీ అనలేదు కదా అని ప్రశ్నించాడు. నిధి అగర్వాల్ కు లులు మాల్ లో జరిగిన ఘటనను మనసులో పెట్టుకునే తాను హీరోయిన్లకు ఆ సూచన చేశానని చెప్పాడు.

Published on: Dec 24, 2025, 18:20:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరోయిన్ల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ.. తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు. తన స్పీచ్ లో వాడిన రెండు అసభ్యకరమైన పదాలకు మాత్రమే క్షమాపణలు చెప్పిన శివాజీ.. తాను చెప్పిన అసలు పాయింట్‌కు మాత్రం కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు. ఇటీవల నిధి అగర్వాల్‌ను జనం చుట్టుముట్టిన ఘటనే తనను ఇలా మాట్లాడేలా చేసిందని సమర్థించుకున్నాడు. అనసూయ ఎందుకు మధ్యలో వచ్చిందని ప్రశ్నించాడు.

అనసూయా.. నువ్వెందుకు వచ్చావు మధ్యలో.. నిన్నేమన్నాను.. ఆ హీరోయిన్‌కు అలా జరిగింది కాబట్టే ఆ మాటన్నాను: శివాజీ
అనసూయా.. నువ్వెందుకు వచ్చావు మధ్యలో.. నిన్నేమన్నాను.. ఆ హీరోయిన్‌కు అలా జరిగింది కాబట్టే ఆ మాటన్నాను: శివాజీ

శివాజీ వివరణ ఇలా..

నటుడు శివాజీ హీరోయిన్ల బట్టల గురించి చేసిన కామెంట్స్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. దీనిపై మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం, నెటిజన్లు పాత వీడియోలు బయటపెట్టడంతో శివాజీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చాడు.

శివాజీ మాట్లాడుతూ.. తాను ఇన్నేళ్ళలో ఎప్పుడూ మహిళల గురించి హద్దు దాటి మాట్లాడలేదని అన్నాడు. "ఆ మాటలు నా నోటి నుంచి ఎలా వచ్చాయో నాకే తెలియదు. స్పీచ్ అయిపోయాక నేను తప్పు మాట్లాడానని అర్థమైంది. నేను వాడిన ఆ రెండు బూతు పదాలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. నా వల్ల నా కుటుంబం కూడా బాధపడింది. ఆ తప్పు నన్ను జీవితాంతం వెంటాడుతుంది" అని ఎమోషనల్ అయ్యాడు.

"కానీ నేను చెప్పిన అసలు విషయానికి మాత్రం కట్టుబడి ఉన్నా. అందులో వెనక్కి తగ్గేది లేదు. ఎందుకంటే అవతలి వాళ్ళను రెచ్చగొట్టడం కూడా నేరమే కదా" అని శివాజీ తన వాదన వినిపించాడు.

నిధి అగర్వాల్ సంఘటనే కారణం

తను అలా మాట్లాడటానికి ప్రధాన కారణం 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌ కు జరిగిన చేదు అనుభవమే అని శివాజీ చెప్పాడు.

"లులు మాల్‌లో జనం మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు నిధి అగర్వాల్ బట్టలు జారిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఆ వీడియోలు జీవితాంతం సోషల్ మీడియాలో ఉండిపోయేవి కదా? ఆమె కారులో కూర్చున్నప్పుడు ఎంత ఇబ్బంది పడిందో చూశాను. ఆ ఆవేదనే నన్ను అలా మాట్లాడేలా చేసింది" అని శివాజీ అన్నాడు.

"సమంత గారి వీడియో నేను చూడలేదు కానీ విన్నాను. ఆవిడ చీర కట్టుకోవడం వల్లే సేఫ్ అయ్యారని, లేకపోతే ఇబ్బంది పడేవారని నాకు చెప్పారు. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పానే తప్ప.. ఎవరినీ వ్యక్తిగతంగా అనలేదు" అని సమర్థించుకున్నాడు.

అనసూయ, చిన్మయిలపై కామెంట్స్

ఈ వివాదంలో తనను విమర్శించిన అనసూయ భరద్వాజ్ గురించి కూడా శివాజీ మాట్లాడాడు. "నేను ఆమె పేరు ఎత్తకపోయినా.. ఆమె ఎందుకు ఈ గొడవలోకి వచ్చిందో తెలియదు. ఆమెకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సమస్య వస్తే నేను సపోర్ట్ చేస్తాను" అని అన్నాడు. ఇక సింగర్ చిన్మయి పేరును తాను మర్చిపోయానని, సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తుంటే గుర్తొచ్చిందని సెటైరికల్‌గా మాట్లాడారు.

బిగ్ బాస్ వీడియోలపై వివరణ

బిగ్ బాస్ షోలో తోటి కంటెస్టెంట్ మెడ మీద కాలు వేసి తొక్కుతా అని అన్న వీడియోలు వైరల్ అవ్వడంపై విలేకరులు ప్రశ్నించగా.. "నాకు 50 ఏళ్లు దాటాయి. మా ఊర్లో ఆడ, మగ తేడా లేకుండా అలాగే మాట్లాడతాం. అది నా పొసెసివ్‌నెస్ తప్ప వేరే ఉద్దేశం కాదు" అని బదులిచ్చాడు. ఈ వ్యవహారంపై తెలంగాణ మహిళా కమిషన్ నుంచి తనకు నోటీసులు వచ్చాయని, తాను చేసిన తప్పుకు చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమని శివాజీ తెలిపాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More