OTT Release: తమిళనాడు థియేటర్లలో సంచలనం సృష్టించిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అన్బే డయానా' (Anbe Diana) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ హిట్ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ (SonyLIV) సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
రోజా రీ ఎంట్రీ

ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన సీనియర్ నటి రోజా ఈ అన్బే డయానా మూవీతో చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోకు తల్లిగా రోజా నటించారు. పద్ధతైన తెలుగు ఫ్యామిలీని నడిపించే ఇల్లాలిగా కనిపించారు. కొడుకు క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకొని ఆ తల్లి ఏం చేసిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
అన్బే డయనా ఓటీటీ
'అన్బే డయానా' చిత్రం ఆగస్టు 28 నుంచి సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. ఓటీటీలో ఈ సినిమాను కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం డిజిటల్ వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డైరెక్టరే హీరో
పారి ఇళవళగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయనే స్వయంగా హీరోగా నటించారు. రమ్య రంగనాథన్ కథానాయికగా మెప్పించగా, సీనియర్ నటి రోజా సెల్వమణి, పరితాబంగళ్ గోపి, చేతన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మిల్లియన్ డాలర్ స్టూడియోస్, నియో క్యాజిల్ క్రియేషన్స్, ఎరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. భరత్ శంకర్ అందించిన సంగీతం, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
స్టోరీ ఇదే
{{/usCountry}}మిల్లియన్ డాలర్ స్టూడియోస్, నియో క్యాజిల్ క్రియేషన్స్, ఎరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. భరత్ శంకర్ అందించిన సంగీతం, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
స్టోరీ ఇదే
{{/usCountry}}ఒక సాధారణ తెలుగు యువకుడికి, ఆంగ్లో-ఇండియన్ క్రిస్టియన్ యువతికి మధ్య చిగురించిన ప్రేమ కథ ఆధారంగా ఈ అన్బే డయానా మూవీని తెరకెక్కించారు. సంప్రదాయాలు, కుటుంబ నేపథ్యాల మధ్య ఈ జంట తమ ప్రేమను ఎలా గెలిపించుకుందనేది వినోదాత్మకంగా దర్శకుడు రెడీ చేశాడు.
అబ్బాయి వాళ్లు ఏమో పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగాలని డిమాండ్ చేస్తారు. అమ్మాయి తండ్రి ఏమో క్రిస్టియన్ వెడ్డింగ్ చేయిస్తానని పట్టుబడతాడు. మరి చివరకు ఏమైందో అన్బే డయానా సినిమాలో చూడాల్సిందే.
జూలైలో థియేటర్లలో విడుదలైన అన్బే డయానా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఆగస్టు 28 నుంచి సోనీ లివ్‌లో హ్యాపీగా వీక్షించవచ్చు.