ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్ వచ్చేసింది. ఓ అభిమాని బయోపిక్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి హీరో అభిమాని తన సినిమా అని చెప్పుకునే విధంగా ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అభిమాని కోసం కదిలి వచ్చే హీరో కథ ఇది.
ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ పోతినేని తీసిన మరో మాస్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్ తాలూకా. ఓ హీరో, అతని వీరాభిమాని చుట్టూ తిరిగే కథతో ఈ మూవీ వస్తోంది. ఇందులో సాగర్ అనే అభిమాని పాత్రలో రామ్ కనిపించగా.. ఆంధ్రా కింగ్ సూర్య అనే హీరో పాత్రలో ఉపేంద్ర నటించాడు. ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రతి హీరో అభిమాని ఇది తన స్టోరీ అనిపించేలా మూవీ తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ఏంటి సాగర్.. ప్రింట్ రాకపోతే అద్దాలు పగలగొడతావ్.. కాలేజీలో గొడవలు పడతావ్.. టికెట్లు దొరక్కపోతే పరువుపోద్ది అంటావ్ అంటూ మూవీలో ఫిమేల్ లో లీడ్ రామ్ పాత్రతో మాట్లాడే మాటలతో ఈ ట్రైలర్ మొదలైంది. ఓ మాస్ అభిమానిలో ఉండాల్సిన అన్ని లక్షణాలతో సాగర్ పాత్రలో రామ్ పోతినేని ఒదిగిపోయాడు. అయితే హీరో కోసం ఏదైనా చేసే అభిమానులకు కొదవ లేదు. కానీ కష్టాల్లో ఉన్న తన అభిమాని కోసం ఓ హీరోనే కదిలి వస్తే.. ఆ సూర్య ఈ సాగర్ తో కలిస్తే అనే భిన్నమైన కథతో ఈ సినిమా రూపొందింది.
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ గురించి..
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను మజిలీ, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు పి. డైరెక్ట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ మూవీని నిర్మిస్తోంది. వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందించారు.
{{/usCountry}}ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను మజిలీ, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు పి. డైరెక్ట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ మూవీని నిర్మిస్తోంది. వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందించారు.
{{/usCountry}}ఎ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అనే క్యాప్షన్ తోనే అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో నటించడంతోపాటు ఓ పాట రాసి పాడాడు రామ్ పోతినేని. ఇక భాగ్యశ్రీ, ఉపేంద్ర కీలకపాత్రలు పోషించారు. మూవీ ట్రైలర్ ఆంధ్రా కింగ్ తాలూకాపై అంచనాలు పెంచేసింది. చాలా రోజులుగా సక్సెస్ కోసం చూస్తున్న రామ్ పోతినేని ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.