నా ఇంట్లో వాళ్లెవరూ నా ఫ్యాన్ కాదు.. ఇప్పటికీ నా భార్య దగ్గర డబ్బులు తీసుకుంటాను..: అనిల్ కపూర్ షాకింగ్ కామెంట్స్
అనిల్ కపూర్ (Anil Kapoor) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ లో ఇంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా తన ఇంట్లో వాళ్లెవరికీ తన యాక్టింగ్ కెరీర్ పై అసలు ఆసక్తి లేదని, ఇప్పటికీ తాను తన భార్య దగ్గర డబ్బులు తీసుకుంటానని చెప్పడం విశేషం.
బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ తన రాబోయే యాక్షన్ మూవీ 'సుబేదార్' (Subedaar)తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్యే జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనిల్ చెప్పిన ఓ విషయం నవ్వు తెప్పించేలా ఉంది. ఒక నటుడిగా తనకు బయట ఎంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, తన సొంత ఇంట్లో మాత్రం తన కుటుంబ సభ్యులు ఎవరూ తనకు ఫ్యాన్ కాదని అతడు నవ్వుతూ వెల్లడించాడు.

భార్య దగ్గర డబ్బులు తీసుకుంటా..
తన వృత్తిపరమైన విజయాల్లో తన భార్య సునీతా కపూర్ పాత్ర ఎంత కీలకమో అనిల్ కపూర్ ఎన్నోసార్లు బహిరంగంగా చెబుతుంటాడు. ఈ 'సుబేదార్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అతడు మాట్లాడుతూ.. తన భార్య తనను ఎంత సాధారణమైన వ్యక్తిగా ఉంచుతుందో సవివరంగా చెప్పాడు.
"నా ఇంట్లో నాకు ఎవరూ ఫ్యాన్స్ లేరు. ఈరోజు నేను ఈవెంట్ కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు, ట్రైలర్ లాంచ్ కోసం వెళ్తున్నానని నా భార్యకు చెప్పాను. దానికి ఆమె 'ఏ సినిమా?' అని అడిగింది. నా వృత్తిపరమైన జీవితంలో ఏం జరుగుతుందో ఆమెకు అస్సలు తెలియదు. నేను అలాంటి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. వాళ్లు నన్ను అందరిలాగే చాలా సాధారణంగా చూస్తారు. కొన్నిసార్లు నేను షూటింగ్‌కు వెళ్లే ముందు ఖర్చుల కోసం రూ. 10,000 నుంచి 15,000 వరకు క్యాష్ నా భార్యను అడుగుతాను" అని అతడు చెప్పాడు.
ఈ సినిమాకు ఆమెనే స్ఫూర్తి
ఈ ఈవెంట్‌లో తన కెరీర్ కోసం తన భార్య ఎంతో త్యాగం చేసిందని కూడా అనిల్ కపూర్ వెల్లడించాడు.
"సుబేదార్ సినిమాలో నేను నా భార్యతో ఉన్న బంధాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. కచ్చితంగా నా కూతుళ్లతో నాకు అలాంటి బంధం లేదు. రియా, సోనమ్, నేను మంచి స్నేహితుల్లా ఉంటాము.. నా భార్య పట్ల నాకు ఉన్న ప్రేమ, నా పని పట్ల నాకు ఉన్న ప్రేమ.. అక్కడే నేను ఉంటాను. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. నా పనిని కూడా ఎంతో ప్రేమిస్తాను. ఆ తర్వాత కచ్చితంగా నేను నా భార్యను అమితంగా ప్రేమిస్తాను" అని అతడు ఎమోషనల్ అయ్యాడు.
సునీతా కపూర్, అనిల్ కపూర్ బంధం గురించి..
వీరిద్దరి ప్రయాణం ఒక సరదా ప్రాంక్ కాల్ తో మొదలై.. జీవితకాల బంధంగా మారింది. అనిల్, సునీత మే 19, 1984న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెద్ద కుమార్తె సోనమ్.. రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'సావరియా' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వారి చిన్న కుమార్తె రియా కపూర్ ఒక సినిమా నిర్మాతగా రాణిస్తోంది. ఇక చిన్న కుమారుడు హర్షవర్ధన్ కపూర్ కూడా బాలీవుడ్ నటుడిగా కొనసాగుతున్నాడు.
'సుబేదార్' సినిమా విశేషాలు
సురేష్ త్రివేణి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో అనిల్ కపూర్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో రాధికా మదన్, సౌరభ్ శుక్లా, ఆదిత్య రావల్, మోనా సింగ్, ఫైసల్ మాలిక్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా మార్చి 5న ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. తన జీవితంలో జరిగిన ఒక తీరని నష్టంతో బాధపడుతూ, తన కూతురికి దూరంగా ఉంటున్న రిటైర్డ్ సుబేదార్ అర్జున్ మౌర్య చుట్టూ తిరిగే కథ ఇది. ప్రశాంతమైన అతని జీవితం ఒక నిర్లక్ష్యపు పని వల్ల కుదుపునకు గురవుతుంది. అదేంటి? ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నది ఈ మూవీ స్టోరీ.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


