OTT: భారతీయ టెలివిజన్ చరిత్రలో సరికొత్త ఒరవడిని సృష్టించిన రియల్ టైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘24’ మళ్ళీ వస్తోంది. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్.. ఏటీయూ (ATU) చీఫ్ జై సింగ్ రాథోడ్‌గా నటించిన ఈ ఐకానిక్ షో ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. ఈ సిరీస్‌లోని రెండు సీజన్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ (JioHotstar) లో అందుబాటులోకి రానున్నాయి.
ఏప్రిల్ 24 నుంచి ఉత్కంఠ షురూ

ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనిల్ కపూర్ స్వయంగా ఒక టీజర్ ద్వారా ప్రకటించారు.
రిలీజ్ డేట్: ఏప్రిల్ 24 (శుక్రవారం)
రిలీజ్ ఇలా: ప్రతి శుక్రవారం 8 ఎపిసోడ్‌ల చొప్పున స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
అసలు ఈ సిరీస్ 2013లో కలర్స్ టీవీలో మొదటిసారి ప్రసారమైంది. ఆ తర్వాత 2016లో సెకండ్ సీజన్ వచ్చింది. హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ '24'కు అధికారిక రీమేక్‌గా వచ్చిన ఈ షో.. ప్రతి గంటకు ఏం జరుగుతుందనే రియల్ టైమ్ నెరేషన్ తో అప్పట్లో ప్రేక్షకులను కట్టిపడేసింది.
నా కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్: అనిల్ కపూర్
ఈ రీ-రిలీజ్ సందర్భంగా అనిల్ కపూర్ తన ఆనందాన్ని పంచుకున్నారు. "నేను నా కెరీర్‌లో ఎన్నో యాక్షన్ పాత్రలు చేశాను. కానీ '24' చేసిన అనుభవం చాలా ప్రత్యేకం. ఇది కేవలం ఒక షో కాదు.. ఒక 'అడ్రినలిన్ రష్'. ప్రతి నిమిషం ఉత్కంఠగా సాగే ఈ సిరీస్ నా మనసుకు చాలా దగ్గరైనది" అని ఆయన పేర్కొన్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా.. ఒక కథకుడిగా తనలో కొత్త కోణాన్ని ఈ ప్రాజెక్ట్ ఆవిష్కరించిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
సీజన్ 3 వస్తుందా?
ఈ ప్రకటనతో అభిమానుల్లో సీజన్ 3పై ఆశలు చిగురించాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అనిల్ కపూర్ స్పందిస్తూ.. "త్వరలోనే 24తో వస్తున్నా" అని బదులివ్వడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే కొత్త సీజన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికి పాత సీజన్లతోనే ప్రేక్షకులు జై సింగ్ రాథోడ్ సాహసాలను వీక్షించవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}ఈ ప్రకటనతో అభిమానుల్లో సీజన్ 3పై ఆశలు చిగురించాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అనిల్ కపూర్ స్పందిస్తూ.. "త్వరలోనే 24తో వస్తున్నా" అని బదులివ్వడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే కొత్త సీజన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికి పాత సీజన్లతోనే ప్రేక్షకులు జై సింగ్ రాథోడ్ సాహసాలను వీక్షించవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}1. ‘24’ సిరీస్ ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతోంది?
ఈ సిరీస్ ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్రవారం 8 ఎపిసోడ్‌లు విడుదల చేస్తారు.
2. అనిల్ కపూర్ ‘24’ లో ఏ పాత్రలో కనిపిస్తారు?
అనిల్ కపూర్ ఇందులో యాంటీ టెర్రరిజం యూనిట్ (ATU) చీఫ్ జై సింగ్ రాథోడ్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారు.
3. 24 సీజన్ 3 గురించి ఏదైనా అప్‌డేట్ ఉందా?
ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. అయితే అనిల్ కపూర్ తన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల వల్ల సీజన్ 3 వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.