బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన కొత్త సినిమా హీరోయిన్ ను డిఫరెంట్ గా అనౌన్స్ చేసేశాడు.
అనిల్ రావిపూడి సినిమా

అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్లు, అనౌన్స్ మెంట్లు వేరే లెవల్. ఇప్పుడు వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ తో అతను మల్టీ స్టారర్ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని కన్ఫామ్ చేశాడు అనిల్ రావిపూడి.
అఫీషియల్ గా
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్ మెంట్ తర్వాత ఇందులో ఓ హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుందనే వార్తలు జోరుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (లైక్)’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు.
‘‘కృతి శెట్టి త్వరలో వర్క్ చేద్దామని చెప్పింది. ఆల్రెడీ బయట రాసేశారు. మనం అఫీషియల్ గా చెప్పాల్సిన పని లేదు. మన బ్రదర్స్ రాసేస్తారు. సీ యూ సూన్ ఆన్ సెట్స్’’అని అనిల్ రావిపూడి పేర్కొన్నాడు.
మరో హిట్
లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సినిమలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. దీనికి విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. ఇప్పటికే ఈ మూవీ చూశానని, ప్రదీక్ కు ఇది మరో హిట్ అవుతుందని లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి చెప్పాడు.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్
{{/usCountry}}లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సినిమలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. దీనికి విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. ఇప్పటికే ఈ మూవీ చూశానని, ప్రదీక్ కు ఇది మరో హిట్ అవుతుందని లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి చెప్పాడు.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్
{{/usCountry}}అనిల్ రావిపూడి వరుసగా సూపర్ హిట్ లతో సాగిపోతున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్నాడు. ఆయన డైరెక్ట్ చేసిన తొమ్మిది సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ సాధించాయి. తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్ల మోత మోగించింది.
వెంకీతో అయిదోసారి
విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి అయిదో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే వీళ్ల కాంబినేషన్లో ఎఫ్1, ఎఫ్2, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలు వచ్చాయి. చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో వెంకీ మామ ఓ స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి తన కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.