చిరంజీవిని పిండేశాను.. నా టైమ్ బాగుండి ఆమె ఒప్పుకుంది.. ఆ ఇద్దరినీ కలిపి చూపించే అదృష్టం నాకు దక్కింది..: అనిల్ రావిపూడి

డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవిని ఈ సినిమా పిండేశానని ఆయనే చెప్పారని, సంక్రాంతికి వస్తున్నాంలాగే మన శంకర వరప్రసాద్ గారు కూడా నవ్విస్తుందని చెప్పాడు.

Dec 14, 2025, 08:32:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతికి తన సినిమాతో వస్తున్నాడు. ఈసారి చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు మూవీతో రెడీ అయ్యాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై తనదైన స్టైల్లో స్పందించాడు.

చిరంజీవిని పిండేశాను.. నా టైమ్ బాగుండి ఆమె ఒప్పుకుంది.. ఆ ఇద్దరినీ కలిపి చూపించే అదృష్టం నాకు దక్కింది..: అనిల్ రావిపూడి
చిరంజీవిని పిండేశాను.. నా టైమ్ బాగుండి ఆమె ఒప్పుకుంది.. ఆ ఇద్దరినీ కలిపి చూపించే అదృష్టం నాకు దక్కింది..: అనిల్ రావిపూడి

చిరంజీవిని పిండేశాను

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తనను పిండేస్తున్నాడని చిరంజీవి చేసిన కామెంట్స్ పై అనిల్ రావిపూడి స్పందించాడు.

“మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అందులో చిరంజీవి గారు మాట్లాడుతూ.. పిండేస్తున్నాడమ్మ అబ్బాయి అని అన్నారు కదా. వాడటం అంటే ఏదీ వదల్లేదు నేను. అది ఆయనదే. ఆయన స్ట్రెంత్ అన్నారు కదా. ఎ టు జెడ్ ఎంతయితే అంత చిరంజీవిగారిని ఎలా చూస్తే ఆడియెన్స్ లైక్ చేస్తారో అలా చూపించడానికి నా 100 శాతం ఎఫర్ట్స్ పెట్టాను. ఈ సినిమాలో ఆయన విపరీతంగా నచ్చుతారు” అని అనిల్ చెప్పాడు.

నా టైమ్ బాగుండి..

ఇక నయనతారను ఎయిర్‌పోర్టు నుంచి కారులో తీసుకొస్తూ ప్రమోట్ చేశారు.. చిరంజీవిగారిని బస్సు ఎక్కించారు.. ఏ డైరెక్టర్ కు సాధ్యం కాని ప్రమోషన్లు మీకెలా సాధ్యమవుతాయి అని అడిగినప్పుడు అనిల్ తనదైన స్టైల్లో స్పందించాడు.

“చాలామంది అడిగారు.. నయనతార ఎలా ఒప్పుకున్నారు అని.. నా టైమ్ బాగుండి ఒప్పుకున్నారామె. టైమ్ బాగుంది.. గ్రహ ఫలాలు బాగున్నాయి.. ఒప్పేసుకుందామె. కాన్సెప్ట్ కూడా ఆమెకు బాగా నచ్చింది. ఇక చిరంజీవి గారు గుర్రాన్ని పట్టుకున్నారు, ఎక్కారు. ఇది కథలో ఫ్లాష్‌బ్యాక్ లో ఎలా కలుసుకున్నారు అని చెప్పే పాట కోసం అలా చేశాం” అని అనిల్ చెప్పాడు.

ఆ ఇద్దరినీ కలిపి చూపించడం నా అదృష్టం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ నాలుగు స్తంభాలలాంటి వాళ్లని.. ఆ నలుగురిలో ఎవరైనా ఇద్దరిని కలిపి చూపించాలని అనుకున్నానని, ఇందులో చిరంజీవి, వెంకటేశ్ లను చూపించడం తన అదృష్టమని అనిల్ రావిపూడి తెలిపాడు. ఇద్దరినీ కలిసి చూడాలన్నది ఆడియెన్స్ కల అని, ఈ సినిమాలో చిరంజీవి, వెంకటేశ్ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారో చూడండి అని చెప్పాడు.

సంక్రాంతి అంటే ఇష్టం

ఇక సంక్రాంతికి రాబోతున్న అనిల్ రావిపూడి నాలుగో సినిమా ఇది. దీనిపైనా అతడు స్పందించాడు. సంక్రాంతి తనకు చాలా ఇష్టమని అన్నాడు. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ ఒక రోజు ముందే ముగిసిందని, ఇది తనకు చాలా ఎమోషనల్ అని చెప్పాడు. సంక్రాంతికి వస్తున్నాంలాగే ఈ మన శంకర వరప్రసాద్ గారు కూడా బాగా అలరిస్తుందని, చిరంజీవిలోని అప్డేటెడ్ వెర్షన్ కామెడీని ఇందులో చూస్తారని తెలిపాడు. మన శంకరవరప్రసాద్ గారు మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More