అనిల్ రావిపూడి తన సినిమాలతోనే కాదు తన కామెంట్స్, తన సినిమాలకు ప్రమోషన్లతోనూ ప్రేక్షకులను నవ్విస్తాడు. తన నెక్ట్స్ సినిమా గురించి చెబుతూ అతడు అలాంటి కామెంట్సే చేశాడు. మన శంకరవరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడిన అనిల్.. తన పదో సినిమా టైటిల్ చాలా క్రేజీగా ఉంటుందంటూ హింట్ ఇచ్చాడు.
అనిల్ రావిపూడి పదో సినిమా

టాలీవుడ్ లో అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ పట్టిందల్లా బంగారమే. హిట్ మెషీన్ గా, అందులోనూ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ల మాస్టర్ గా పేరుగాంచాడు. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నాడు. తాజాగా మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
“నా పదో సినిమా టైటిల్ ఫిక్స్ అయిపోయా.. చాలా విచిత్రమైన టైటిల్ అది.. హీరో ఎవరు అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి వీడు మళ్లీ మొదలుపెట్టాడురా బాబు అని అందరూ తిట్టుకోవడం ఖాయం. సంక్రాంతి 2027కు వస్తున్నాం” అని అనిల్ రావిపూడి అనడం విశేషం.
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్
అనిల్ రావిపూడి గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఓ బ్లాక్‌బస్టర్ అందుకోగా.. ఈసారి మన శంకరవరప్రసాద్ గారుతో అంతకంటే పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది.
సక్నిల్క్ ప్రకారం చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ మూవీ 10 రోజుల్లో ఇండియాలో రూ.175.65 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. చిరంజీవి కెరీర్ లో ఇదే అత్యధికం.
మన శంకరవరప్రసాద్ గారు మూవీ ప్రీమియర్ల నుండి రూ.9.35 కోట్లు సంపాదించింది. ఈ సినిమా మొదటి రోజు రూ.32.25 కోట్లు, రెండవ రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు, నాలుగో రోజు రూ.22 కోట్లు, అయిదో రోజు రూ.19.5 కోట్లు సంపాదించింది. 6వ రోజు రూ.18.9 కోట్లు, 7వ రోజు రూ.17.65 కోట్లు, 8 వ రోజు రూ.8 కోట్లు, 9వ రోజు రూ.5.75 కోట్లు ఖాతాలో వేసుకుంది.
{{/usCountry}}మన శంకరవరప్రసాద్ గారు మూవీ ప్రీమియర్ల నుండి రూ.9.35 కోట్లు సంపాదించింది. ఈ సినిమా మొదటి రోజు రూ.32.25 కోట్లు, రెండవ రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు, నాలుగో రోజు రూ.22 కోట్లు, అయిదో రోజు రూ.19.5 కోట్లు సంపాదించింది. 6వ రోజు రూ.18.9 కోట్లు, 7వ రోజు రూ.17.65 కోట్లు, 8 వ రోజు రూ.8 కోట్లు, 9వ రోజు రూ.5.75 కోట్లు ఖాతాలో వేసుకుంది.
{{/usCountry}}