Anil Ravipudi: అనిల్ రావిపూడిని లేటెస్ట్ గా టాలీవుడ్ కి దొరికిన జంధ్యాలగా చూస్తున్నారు. ఇప్పుడతడు అదే జంధ్యాల స్ఫూర్తిగా తన నెక్ట్స్ మూవీ ప్రమోషన్లు మొదలుపెట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ లను ఇంట్రడ్యూస్ చేస్తూ.. వాళ్లను ఇసుకలో పాతిపెట్టి టార్చర్ పెడుతున్న ఫన్నీ వీడియోను రిలీజ్ చేశాడు. అదేంటో మీరూ చూసేయండి.
అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్లు

వెంకటేశ్, కళ్యాణ్ రామ్ లతో కలిసి అనిల్ రావిపూడి మూవీ చేస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు.. అప్పుడే ప్రమోషన్లు మొదలుపెట్టాడు. తాజాగా శుక్రవారం (జూన్ 12) అనిల్ తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో మొదట్లోనే జంధ్యాల మూవీలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం సీన్ కనిపిస్తుంది.
అందులో బ్రహ్మానందాన్ని ఇసుకలో పాతిపెట్టి టార్చర్ పెట్టినట్లే.. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ను ఇసుకలో పాతిపెట్టి తనకు ఎలాంటి మ్యూజిక్ కావాలో చెబుతాడు అనిల్. ఆ తర్వాత లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ను కూడా అలాగే ఇసుకలో పాతిపెట్టడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
జీవీ ప్రకాష్ కు వెల్‌కమ్.. అనిల్ రావిపూడి ట్వీట్
ఈ మ్యూజికల్ అప్‌డేట్ ను ఒక ఫన్నీ కాన్సెప్ట్ వీడియో ద్వారా అనిల్ రావిపూడి అనౌన్స్ చేశారు. దీనిపై అతడు ట్వీట్ చేస్తూ.. "ఆడియన్స్ కు ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయ్యేలా మ్యూజిక్ అందించే జీవీ ప్రకాష్ టాలెంట్ అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. మా #VenkyAnil5 - #NKRAnil2 ప్రాజెక్ట్ లోకి ఆయనను ఆహ్వానించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫన్ కాన్సెప్ట్ వీడియోను మేము భలే ఎంజాయ్ చేస్తూ షూట్ చేశాం. ఈ ఐడియాను నమ్మి, మాతో కలిసి ఫన్ లో జాయిన్ అయినందుకు థాంక్యూ బ్రదర్. మనమిద్దరం కలిసి ఒక మంచి మెమొరీని క్రియేట్ చేయబోతున్నాం" అంటూ రాసుకొచ్చారు.
జీ.వి. ప్రకాష్ కుమార్ కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, సౌత్ లో స్టార్ హీరో కూడా. ఆయన అందించే ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ కానున్నాయి.
Top Production Houses | భారీ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్
{{/usCountry}}జీ.వి. ప్రకాష్ కుమార్ కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, సౌత్ లో స్టార్ హీరో కూడా. ఆయన అందించే ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ కానున్నాయి.
Top Production Houses | భారీ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్
{{/usCountry}}ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తుండగా, నందమూరి కళ్యాణ్ రామ్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సౌత్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ పాటలు అందిస్తున్నారు.
అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు జీవీ ప్రకాష్ క్లాసిక్ మ్యూజిక్ తోడైతే వెండితెరపై మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి సంక్రాంతికి వచ్చి ఓ హిట్ కొట్టే అనిల్.. ఈసారి ఏం మాయ చేస్తాడో చూడాలి.
హెచ్‌టీ విశ్లేషణ
వెంకటేశ్, అనిల్ రావిపూడి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అనిల్ రావిపూడి తన సినిమాల్లో కామెడీతో పాటు మ్యూజిక్ కు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. జీవీ ప్రకాష్ కుమార్ ప్రస్తుతం సౌత్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ మ్యూజికల్ హిట్స్ కొట్టిన జీవీ.. ఇప్పుడు వెంకీ - అనిల్ ప్రాజెక్ట్ లోకి రావడం సినిమా బిజినెస్ రేంజ్ ను పెంచుతుంది.
అనిల్ రావిపూడి ప్రమోషన్స్ ను ఎప్పుడూ చాలా కొత్తగా, ఫన్నీగా ప్లాన్ చేస్తారు. ఈసారి కూడా జీవీ ప్రకాష్ తో కలిసి చేసిన ఫన్ కాన్సెప్ట్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సినిమా ప్రమోషన్స్ కి మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు.
People Also Ask (FAQs)
వెంకటేశ్ - అనిల్ రావిపూడి కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందించబోతున్నారు.
ఈ సినిమాను ఏ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి?
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాకు లిరిక్స్ అందిస్తున్నది ఎవరు?
ప్రముఖ టాలెంటెడ్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఈ సినిమాకు పాటలు రాస్తున్నారు.