Anirudh Kavya Wedding: రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట బుధవారం అంటే నవంబర్ 11, 2026న గ్రీస్ (Greece) దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు.

పెళ్లి ముగిసిన వెంటనే అనిరుధ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివాహ ఫోటోలను షేర్ చేస్తూ.. “My once in a lifetime, for a lifetime 11.11” అని రాసుకొచ్చారు. ఈ ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ కొత్త దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాయల్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోయిన జంట
వివాహ వేడుకలో అనిరుధ్, కావ్య మారన్ జంట రాయల్ అండ్ క్లాసిక్ లుక్‌లో మెరిసిపోయారు. అనిరుధ్ ఐవరీ రంగు కుర్తా, మ్యాచింగ్ వేష్టి (ధోతి), ఎంబ్రాయిడరీ వర్క్ తో కూడిన లాంగ్ జాకెట్ ధరించి ఎంతో క్లాసీగా కనిపించారు.
అటు కావ్య మారన్ బ్లష్-పింక్ రంగు లెహంగాలో మెరిసిపోయారు. సీక్విన్ వర్క్, డిజైనర్ ఎంబ్రాయిడరీ ఉన్న లెహంగాకు మ్యాచింగ్ బ్లౌజ్, రాయల్ చోకర్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ ధరించి ఎంతో అందంగా కనిపించారు. ఇద్దరి కాంబినేషన్ పాస్టెల్ కలర్ థీమ్‌లో రాయల్ లుక్‌ను తలపించింది.
నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్
గ్రీస్‌లో పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరగగా, చెన్నై నగరంలో నవంబర్ 21న అత్యంత వైభవంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతులు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి రిసెప్షన్ పత్రికను స్వయంగా అందించారు. ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
ఆహ్వానం అందుకున్న వాళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఉన్నారు.
{{/usCountry}}ఆహ్వానం అందుకున్న వాళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఉన్నారు.
{{/usCountry}}ఇక సినీ, క్రికెట్ ప్రముఖల విషయానికి వస్తే.. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, కమల్ హాసన్, ధనుష్, అజిత్ కుమార్-షాలిని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి, శివకార్తికేయన్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, ఆండ్రియా, ప్రసన్న, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు చెందిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సహా పలువురు ఐపీఎల్ స్టార్లు హాజరుకానున్నారు.
ఏడాది కాలంగా ప్రేమ
అనిరుధ్, కావ్య మారన్ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు 2025 నుంచి ప్రచారంలో ఉన్నాయి. అయితే అప్పట్లో అనిరుధ్ ఈ వార్తలను ఖండిస్తూ "పెళ్లా? రూమర్స్ ఆపండి" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే 2026 జూన్‌లో అనిరుధ్ బాబాయ్, సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ వీరి వివాహంపై క్లారిటీ ఇవ్వడంతో వార్తలు నిజమయ్యాయి.
'వై దిస్ కొలవెరి డి' పాటతో సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించిన అనిరుధ్, ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు కావ్య మారన్ లండన్ వారిక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసి సన్ నెట్‌వర్క్, సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవంతమైన సీఈవోగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు సక్సెస్ ఫుల్ పర్సనాలిటీలు పెళ్లిపీటలు ఎక్కడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.