'గుంజి గుంజి' సాంగ్ వివాదం.. హీరో చంద్రహాస్‌పై మరో కేసు...!

నటుడు చంద్రహాస్‌కు మరో షాక్ తగిలింది. ‘గుంజి గుంజి’ సాంగ్ వివాదంలో ఇప్పటికే మాదాపూర్ లో ఓ కేసు నమోదు కాగా...తాజాగా మరో కేసు నమోదైంది. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published on: Feb 6, 2026, 21:08:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'బరాబర్‌ ప్రేమిస్తా' సినిమా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో నటుడు చంద్రహాస్‌ పాడిన పాట పెద్ద దుమారాన్నే రేపుతోంది. ‘గుంజి గుంజి’ అంటూ సాగే ఈ పాటలో బూతులు ఉండటంపై సినీవర్గాల నుంచే కాకుండా ఇతరుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇదేం పాట అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

నటుడు చంద్రహాస్‌పై మరో కేసు
నటుడు చంద్రహాస్‌పై మరో కేసు

మరో కేసు నమోదు…!

ఇప్పటికే చంద్రహాస్‌పై జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదు ఇవ్వగా.. కేసు నమోదైంది. దీనిపై పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా… ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ బూతు సాంగ్ పాడారని జూబ్లీహిల్స్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. పాటలో వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చంద్రహాస్‌పై మరో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ వారుసుడిగా చంద్రహాస్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. రామ్ నగర్ బన్నీ మూవీతో హీరోగా మారాడు. సినిమా కంటే ముందు తన ప్రవర్తనతో యాటిట్యూట్ స్టార్ అనే ట్యాగ్‌ను నెటిజన్ల నుంచి అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి గుంజి గుంజి అనే పాటతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

తను పాడిన పాటపై ఇంతగా కాంట్రవర్సీ అవుతున్నా కూడా చంద్రహాస్ మాత్రం వెనక్కి తగ్గినట్లు కనిపించటం లేదు. ఈ విషయంలో సారీ చెప్పనని గుర్తు చేస్తూనే... గతంలో తనపై ఎంతో ట్రోలింగ్ సాగిందని అప్పుడు వీరంతా ఏమైపోయారంటూ వీడియో రిలీజ్ చేశాడు. అంతేకాకుండా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రహాస్…అందులోనూ మరికొన్ని కామెంట్స్ చేశాడు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More