Anshula Kapoor: పెద్ది హీరోయిన్ సోదరి పెళ్లి సందడి.. జాన్వీ కపూర్ హంగామా చూశారా? అన్ సీన్ ఫొటోలు వైరల్

Anshula Kapoor: బోనీ కపూర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అతని మొదటి భార్య కూతురు అన్షుల కపూర్ ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్స్ షురూ అయ్యాయి. తమ సిస్టర్ తో అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి. రీసెంట్ గా పెద్ది మూవీలో జాన్వీ నటించింది.

Published on: Jun 24, 2026, 10:51:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anshula Kapoor: రామ్ చరణ్ పెద్ది మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ సోదరి పెళ్లి వేడుకుల సందడి మొదలైంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కుమార్తె, నటుడు అర్జున్ కపూర్ సొంత సోదరి అన్షులా కపూర్ వివాహ వేడుకలు ముంబైలో వైభవంగా ప్రారంభమయ్యాయి. తన లాంగ్-టైమ్ బాయ్‌ఫ్రెండ్ రోహన్ థక్కర్‌తో పెళ్లికి అన్షుల రెడీ అవుతోంది. తాజాగా జరిగిన ప్రీ వెడ్డింగ్ సంబరాల ఫొటోలు వైరల్ గా మారాయి.

బోనీ కపూర్ ఇంట పెళ్లి సందడి.. అన్షుల కపూర్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ షురూ (instagram-Anshula Kapoor)
బోనీ కపూర్ ఇంట పెళ్లి సందడి.. అన్షుల కపూర్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ షురూ (instagram-Anshula Kapoor)

ఓ రేంజ్ సెలబ్రేషన్స్

బాలీవుడ్‌లో కపూర్ ఖాందాన్ (Kapoor Family) పెళ్లిళ్లంటేనే ఒక రేంజ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బోనీ కపూర్, ఆయన మొదటి భార్య దివంగత మోనా శౌరీ కపూర్‌ల కుమార్తె అన్షులా కపూర్ (Anshula Kapoor) పెళ్లి పీటలెక్కుతుండటంతో ముంబైలో పండుగ వాతావరణం నెలకొంది. గత ఏడాది (జూలై 2025) న్యూయార్క్‌లో సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్న అన్షులా-రోహన్ థక్కర్ జంట, ఇప్పుడు జూలై 6న గ్రాండ్‌గా జరిగే వెడ్డింగ్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

‘మాతా కీ చౌకీ’తో మొదలైన సంబరాలు

ఈ వివాహ వేడుకలకు సంబంధించిన మొదటి అధికారిక కార్యక్రమం తాజాగా ముంబైలో అత్యంత సన్నిహితుల మధ్య ప్రారంభమైంది. వరుడు రోహన్ థక్కర్ కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన ‘మాతా కీ చౌకీ’ పూజతో ఈ పెళ్లి హంగామా మొదలైంది. ఈ పూజకు సంబంధించిన ఫోటోలను అన్షులా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, "ప్రేమ, ఫ్యామిలీ, దైవ ఆశీర్వాదాలతో మా కొత్త ప్రయాణం మొదలైంది" అంటూ ఎమోషనల్ క్యాప్షన్ పెట్టింది.

అన్నయ్య అర్జున్

ఈ పెళ్లి వేడుక కేవలం ఒక సాధారణ బాలీవుడ్ వెడ్డింగ్ మాత్రమే కాదు.. అర్జున్ కపూర్, అన్షులా జీవితాల్లో అత్యంత కీలకమైన ఘట్టం. తల్లి మోనా కపూర్ మరణం తర్వాత అన్షులాకు అన్నయ్య అర్జున్ కపూరే సర్వస్వమయ్యాడు. ఒక తండ్రి లాగా బాధ్యత తీసుకుని మరీ తన చెల్లెలి పెళ్లిని దగ్గరుండి జరిపిస్తున్నాడు అర్జున్.

ఒకే ఫ్రేమ్‌లో కపూర్ సిస్టర్స్

బోనీ కపూర్ రెండో భార్య శ్రీదేవి కుమార్తెలైన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లతో ఒకప్పుడు అర్జున్, అన్షులాకు పెద్దగా అనుబంధం ఉండేది కాదు. కానీ శ్రీదేవి హఠాన్మరణం తర్వాత ఈ నలుగురు తోబుట్టువులు ఒకరికొకరు కొండంత అండగా నిలిచారు. తన అక్క పెళ్లి వేడుకల్లో జాన్వీ కపూర్ తెగ హంగమా చేసేసింది.

ఇప్పుడు అన్షులా పెళ్లి వేడుకల్లో జాన్వీ, ఖుషీలు తమ సొంత అక్క పెళ్లిలాగే ముందే ఉండి పనులు చూసుకోవడం, సోనమ్ కపూర్, రియా కపూర్‌లతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో డాన్స్ చేయడం కపూర్ ఫ్యామిలీలో వచ్చిన బ్యూటిఫుల్ ఎమోషనల్ బాండింగ్‌ను సూచిస్తోంది.

స్టార్లు వస్తారని

ముంబైలో ఏర్పాటు చేసిన స్పెషల్ అన్షుల కపూర్ డిన్నర్ విందుకు బాబాయ్ సంజయ్ కపూర్, పిన్ని మహీప్ కపూర్‌లతో పాటు బాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ అంతా హాజరయ్యారు. జూలై 6న జరిగే పెళ్లికి బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలంతా విచ్చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More