Janhvi Kapoor: సింగిల్ ట్వీటు లేదు.. పోస్టు లేదు.. పెద్దిని పట్టించుకోని జాన్వీ కపూర్.. ఇలా అయితే తెలుగులో కష్టమే!

Janhvi Kapoor: బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమా రూ. 378 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్నా, హీరోయిన్ జాన్వీ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇలా అయితే తెలుగులో కష్టమేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

Published on: Jun 15, 2026, 12:05:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' చిత్రం థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలై పది రోజులు దాటినా కలెక్షన్ల వేగం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. అయితే మూవీపై జాన్వీ కపూర్ సైలెన్స్ హాట్ టాపిక్ గా మారింది.

సింగిల్ ట్వీటు లేదు.. పోస్టు లేదు.. పెద్దిని పట్టించుకోని జాన్వీ కపూర్ (instagram)
సింగిల్ ట్వీటు లేదు.. పోస్టు లేదు.. పెద్దిని పట్టించుకోని జాన్వీ కపూర్ (instagram)

పెద్దిపై జాన్వీ సైలెన్స్

సాధారణంగా మూవీ సక్సెస్ ను హీరో హీరోయిన్లు గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకుంటారు. సినిమా కలెక్షన్లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తారు. అయితే, ఇంతటి భారీ విజయాన్ని పెద్ది యూనిట్, అభిమానులు పండగలా జరుపుకుంటుంటే, హీరోయిన్ జాన్వీ కపూర్ మాత్రం ఈ సక్సెస్‌కు పూర్తిగా దూరంగా ఉంటోంది. సినిమా సాధిస్తున్న రికార్డులపై ఆమె కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

కారణం అదేనా?

జాన్వీ కపూర్ మూవీ ప్రమోషన్లలో యాక్టివ్ గానే ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా పోస్టులు పెడుతుంది. బాలీవుడ్ సినిమాలు పరమ్ సుందరి, సన్నీ సంస్కారీకి తులసి కుమారి అప్ డేట్లను బాగానే షేర్ చేసింది. కానీ పెద్ది మూవీ రిలీజ్ తర్వాత మాత్రం ఈ భామ సైలెట్ అయిపోయింది.

కానీ జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ లేదా ఎక్స్ ఖాతాలో 'పెద్ది' వసూళ్లకు సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. సినిమా ప్రమోషన్లకు కూడా ఆమె దూరంగా ఉండటంతో నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఆమె పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర చిత్రణపై ఆమెకు ఉన్న అసంతృప్తి వల్లే ఈ నిర్ణయం తీసుకుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

క్యారెక్టర్ పోర్ట్రెయిట్‌పై వివాదం

సినిమా విడుదలైన మొదటి రోజుల్లో హీరోయిన్ పాత్రను చూపించిన విధానం, కొన్ని కెమెరా యాంగిల్స్ తీవ్ర వివాదానికి దారితీశాయి. కేవలం గ్లామర్ కోణంలోనే తన పాత్రను ప్రెజెంట్ చేయడంపై జాన్వీ కపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టాక్ నడుస్తోంది.

తన పాత్రకు నటన పరంగా పెద్దగా స్కోప్ లేకుండా, కేవలం గ్లామర్ కోణానికే పరిమితం చేశారనే కోపంతో ఆమె ఉందని సమాచారం. హీరో రామ్ చరణ్ పాత్రలోని మొరటుతనాన్ని చూపించడానికి అలా చేశామని దర్శకుడు బుచ్చిబాబు వివరణ ఇచ్చినప్పటికీ, జాన్వీ మాత్రం చిత్ర యూనిట్‌పై ఇంకా ఆగ్రహంతోనే ఉన్నట్లు తెలుస్తోంది.

కోల్డ్ వార్?

ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సాన స్పందించి, గతంలోనే కొన్ని అభ్యంతరకర సీన్లను ట్రిమ్ చేశారు. అంతేకాకుండా, అచ్చియమ్మ పాత్ర ప్రాధాన్యతను పెంచేందుకు ఎడిటింగ్‌లో తీసేసిన రెండు కీలక సన్నివేశాలను ఈ బుధవారం నుంచి థియేటర్ ప్రింట్లకు యాడ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

"జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఆర్క్‌ను ఎలివేట్ చేయడానికి ఉపయోగపడే రెండు సీన్లను ఈ బుధవారం నుంచి జోడిస్తున్నాం" అని బుచ్చిబాబు స్పష్టం చేశారు. దర్శకుడు ఇంతలా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నా, జాన్వీ కపూర్ మాత్రం ఇంకా మూవీ టీమ్‌తో కోల్డ్ వార్ కొనసాగిస్తోందని, అందుకే సినిమా సక్సెస్‌ను ఓన్ చేసుకోవడం లేదని ఇండస్ట్రీ టాక్.

ఇలా అయితే కష్టమే

జాన్వీ కపూర్ పెద్ది విషయంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల మూవీ టీమ్ నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. అసలే హిందీలో పెద్దికి వసూళ్లు అంతంతమాత్రమే ఉన్నాయి. జాన్వీ మూవీని ప్రమోట్ చేస్తే అక్కడ కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంది. కానీ జాన్వీ సైలెంట్ గా ఉంది. ఇలా అయితే తెలుగులో జాన్వీకి సినిమా ఆఫర్లు రావడం కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'పెద్ది' సినిమా కలెక్షన్లపై జాన్వీ కపూర్ ఎందుకు స్పందించడం లేదు?

జవాబు: సినిమాలో తన 'అచ్చియమ్మ' పాత్రను చూపించిన విధానంపై ఆమె చిత్ర యూనిట్‌పై అసంతృప్తితో ఉన్నట్లు, అందుకే ప్రమోషన్లకు, కలెక్షన్ల పోస్టులకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రశ్న: హీరోయిన్ పాత్రపై వచ్చిన విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు ఏం చేశారు?

జవాబు: మొదట కొన్ని వివాదాస్పద సీన్లను ట్రిమ్ చేసిన దర్శకుడు, ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్‌ను ఎలివేట్ చేసే రెండు కొత్త సన్నివేశాలను ఈ బుధవారం నుంచి థియేటర్లలో యాడ్ చేస్తున్నారు.

ప్రశ్న: 'పెద్ది' సినిమా ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది?

జవాబు: రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More