...
...
Next Story

OTT: ముగిసిన ఓటీటీ వివాదం- వెనక్కి తగ్గిన నటి అనుగ్రహ- పదేళ్ల కష్టాన్ని 3 రోజుల్లో దెబ్బతీశారు, భార్యకు హీరో క్షమాపణలు!

Anugraha Nambiar Vs Vijay Kumar Rajendran: జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న రిసార్ట్ నటీనటుల వివాదం కొలిక్కి వచ్చింది. నిర్మాణ సంస్థ రంగంలోగి దిగడంతో మానసిక ప్రశంతాత కోసమే మలయాళ నటి అనుగ్రహ నంబియార్ వెనక్కి తగ్గినట్లు చెప్పారు. హీరో విజయ్ కుమార్ తన భార్యకు క్షమాపణలు చెప్పారు.

Published on: Apr 30, 2026, 13:42:12 IST
Advertisement

OTT Series Resort Anugraha Nambiar Vs Vijay Kumar: మలయాళ నటి అనుగ్రహ ఎస్ నంబియార్, కోలీవుడ్ హీరో విజయ్ కుమార్ రాజేంద్రన్ మధ్య గత వారం రోజులుగా సాగుతున్న మాటల యుద్ధం ఒక కొలిక్కి వచ్చింది. పరస్పర ఆరోపణలతో సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ ఓటీటీ సిరీస్ వివాదం నుంచి అనుగ్రహ నంబియార్ తప్పుకోగా, తన పరువు తీశారంటూ విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగింది? 'రిసార్ట్' ఓటీటీ సిరీస్ వివాదం

ముగిసిన ఓటీటీ వివాదం- వెనక్కి తగ్గిన నటి అనుగ్రహ- పదేళ్ల కష్టాన్ని 3 రోజుల్లో దెబ్బతీశారు, భార్యకు హీరో క్షమాపణలు!
ముగిసిన ఓటీటీ వివాదం- వెనక్కి తగ్గిన నటి అనుగ్రహ- పదేళ్ల కష్టాన్ని 3 రోజుల్లో దెబ్బతీశారు, భార్యకు హీరో క్షమాపణలు!

జియో హాట్‌స్టార్ ఓటీటీ కోసం రూపొందించిన 'రిసార్ట్' అనే తమిళ్ వెబ్ సిరీస్ రెమ్యూనరేషన్ విషయంలో ఈ రచ్చ మొదలైంది. ఈ వెబ్ సిరీస్‌లో నటించిన మలయాళ బ్యూటీ అనుగ్రహ నంబియార్ తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని, విజయ్ భార్య నక్షత్ర మూర్తి తనను దూషించిందని ఆరోపిస్తూ వరుస వీడియోలు పోస్ట్ చేసింది.

అంతేకాకుండా నక్షత్ర కేవలం పేరు కోసమే విజయ్‌ని పెళ్లి చేసుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం ముదిరింది. అయితే నిర్మాణ సంస్థ 'గ్లోబల్ విలేజర్స్' రంగంలోకి దిగి అనుగ్రహ ఆరోపణలను ఖండించడంతో సీన్ రివర్స్ అయింది.

భార్యకు క్షమాపణలు చెప్పిన విజయ్ కుమార్

ఈ ఓటీటీ సిరీస్ వివాదం తన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని విజయ్ కుమార్ రాజేంద్రన్ (ఎరుమ సాణి ఫేమ్) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన నోట్ పెట్టారు. తన వల్ల తన భార్య నక్షత్ర లేనిపోని నిందలు భరించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"గత మూడు రోజులుగా నక్షత్ర మానసిక క్షోభను అనుభవిస్తోంది. తన దైనందిన పనులను కూడా చేసుకోలేనంతగా కుమిలిపోయింది. నా వల్ల ఆమె ఈ గొడవలోకి లాగబడటం, అవమానాలు ఎదుర్కోవడం నాకు చాలా బాధగా ఉంది. నన్ను క్షమించు నక్షత్ర" అంటూ విజయ్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు.

నిర్మాణ సంస్థ నుంచి లీగల్ నోటీసులు రావడం, విజయ్ వర్గం గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో అనుగ్రహ నంబియార్ తన వీడియోలన్నీ డిలీట్ చేసింది. తన మానసిక ప్రశాంతత కోసం, కుటుంబ సభ్యుల కోసం ఈ వివాదం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

"నేను బలహీనతతో వెనక్కి తగ్గడం లేదు. లీగల్ పోరాటం చేసే ఆర్థిక స్తోమత ఇప్పుడు నాకు లేదు. అందుకే ప్రశాంతత కోరుకుంటున్నాను" అని అనుగ్రహ నంబియార్ పేర్కొంది. కాగా, ఆమె కేవలం ప్రొడక్షన్ టీమ్‌కు మాత్రమే క్షమాపణలు చెప్పి, విజయ్ దంపతులకు చెప్పకపోవడం గమనార్హం. అనుగ్రహ తీరుపై నక్షత్ర మూర్తి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కోర్టులో తేల్చుకుంటామంటున్న నక్షత్ర

"మా పరువు తీసి, మా పెళ్లిపై అసత్య ఆరోపణలు చేసి ఇప్పుడు డ్రామా వద్దు, ప్రశాంతత కావాలి అంటే ఎలా? మాకు జరిగిన నష్టం జరిగిపోయింది. ఇన్‌ఫ్లుయెన్సర్లను అడ్డం పెట్టుకుని మమ్మల్ని బెదిరించాలని చూశారు. క్షమాపణలు కూడా చెప్పకుండా తప్పుకోవడం ఏంటి? మిమ్మల్ని కోర్టులోనే చూసుకుంటాం" అంటూ నక్షత్ర ఇన్‌స్టా స్టోరీస్‌లో ధ్వజమెత్తారు. త్వరలోనే అనుగ్రహకు లీగల్ నోటీసులు పంపనున్నట్లు ఆమె వెల్లడించారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అనుగ్రహ నంబియార్ వర్సెస్ విజయ్ కుమార్ వివాదం దేని గురించి?

ఇది 'రిసార్ట్' అనే ఓటీటీ వెబ్ సిరీస్ రెమ్యునరేషన్ చెల్లింపులు, వ్యక్తిగత దూషణల చుట్టూ తిరిగిన వివాదం. నటి అనుగ్రహ తనకు డబ్బులు రాలేదని ఆరోపించగా, విజయ్ దంపతులు వాటిని ఖండించారు.

2. విజయ్ కుమార్ రాజేంద్రన్ తన భార్యకు ఎందుకు క్షమాపణలు చెప్పారు?

తన వృత్తిపరమైన వివాదంలోకి భార్య నక్షత్రను అనవసరంగా లాగడం, ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడంతో మనస్తాపానికి గురైన విజయ్ ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

3. అనుగ్రహ నంబియార్ వీడియోలను ఎందుకు డిలీట్ చేశారు?

నిర్మాణ సంస్థ, విజయ్ తరపు న్యాయవాదులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో, ఆమె తన పోస్టులను తొలగించి వివాదం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe