...
...
Next Story

Anupama Parameswaran: ఆ రెండేళ్లు నరకం చూశాను.. ప్రతీ రాత్రి ఏడ్చేదాన్ని.. మానసిక, శారీరక వేధింపులు: అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తాజాగా తాను రిలేషిన్షిప్ లో ఎదుర్కొన్న వేధింపులపై నోరు విప్పింది. రెండేళ్లు నరకం అనుభవించానని, ప్రతీ రాత్రి ఏడ్చేదాన్నని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించడం షాక్ కు గురి చేస్తోంది.

Published on: Aug 12, 2026, 22:01:13 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్'తోపాటు పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాన్ని బయటపెడుతూ నెటిజన్లకు షాక్ ఇచ్చింది. గత రెండేళ్లుగా తాను ఒక విషపూరితమైన రిలేషన్‌షిప్‌లో ఉంటూ దారుణమైన పరిస్థితులను అనుభవించానని, తీవ్రమైన శారీరక, మానసిక నరకయాతన చూశానని సంచలన విషయాలు వెల్లడించింది.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వెనుక రెండేళ్ల బాధ

Anupama Parameswaran: ఆ రెండేళ్లు నరకం చూశాను.. ప్రతీ రాత్రి ఏడ్చేదాన్ని.. మానసిక, శారీరక వేధింపులు: అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran: ఆ రెండేళ్లు నరకం చూశాను.. ప్రతీ రాత్రి ఏడ్చేదాన్ని.. మానసిక, శారీరక వేధింపులు: అనుపమ పరమేశ్వరన్

గత నెలలో అనుపమ తన సోషల్ మీడియా ఖాతాలో "మనశ్శాంతి దక్కాలంటే కొన్ని డెడ్ ఎండ్స్ దాటి ముందుకు వెళ్లాలి" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్ చూసి చాలామంది ఆమెకు బ్రేకప్ అయిందని, ఇప్పుడే కోలుకుంటోందని భావించారు.

అయితే ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు నిజాన్ని ధన్య వర్మ టాక్ షో 'ఐ యామ్' (I AM) ఇంటర్వ్యూలో అనుపమ బయటపెట్టింది. "ఆ పోస్ట్ ఏదో రాత్రికి రాత్రే పెట్టింది కాదు. దాని వెనుక రెండేళ్ల పెయిన్, ఫిజికల్ అండ్ ఎమోషనల్ డిస్ట్రక్షన్ ఉంది. నేను పూర్తిగా కోలుకుని, ధైర్యంగా నిలబడే స్థాయికి వచ్చిన తర్వాతే ఆ విషయాన్ని ప్రపంచంతో పంచుకున్నాను" అని ఎమోషనల్ అయింది.

'నార్సిసిస్టిక్ అబ్యూస్' అంటే ఏంటి? అనుపమ షాకింగ్ ఎక్స్‌పీరియన్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో నటి మడోన్నా సెబాస్టియన్ నార్సిసిస్టిక్ అబ్యూస్ గురించి మాట్లాడిన ఒక వీడియో చూసినప్పుడు తన శరీరం భయంతో వణికిపోయిందని అనుపమ గుర్తు చేసుకుంది. ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాక అందంగా వికసించాల్సిన తాను, రోజురోజుకూ బరువు తగ్గి కృంగిపోవడం మొదలైందని ఆవేదన వ్యక్తం చేసింది.

అనుపమ ఇంటర్వ్యూలో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. కానీ కోలీవుడ్ వర్గాల్లో మాత్రం తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో ఆమె నడిపిన డేటింగ్ గురించే చర్చలు మొదలయ్యాయి. గతంలో మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో వస్తున్న 'బైసన్ కాళమాడన్' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.

వీరిద్దరూ కలిసి ఉన్న పిక్స్, స్పాటిఫై ప్లేలిస్ట్ డీపీలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఓ అవార్డు ఫంక్షన్‌లో ధ్రువ్ విక్రమ్ విష్ చేసినప్పుడు అనుపమ సిగ్గుపడటం, అతన్ని తన '2 AM కాల్' అని చెప్పడం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య దూరం పెరగడంతో బ్రేకప్ జరిగిందనే వార్తలకు ఇప్పుడు అనుపమ కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయి.

కెరీర్ ఫుల్ బిజీ.. కంబ్యాక్‌కి రెడీ

'ప్రేమమ్' సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ, తెలుగులో 'అ ఆ', 'శతమానం భవతి', 'కార్తికేయ 2', 'టిల్లు స్క్వేర్' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పర్సనల్ లైఫ్‌లో ఎదురైన ఈ చేదు అనుభవాల నుంచి బయటపడి, ఇప్పుడు తన వాయిస్‌ని బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం తను పూర్తి స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నానని, మళ్లీ తనను తాను ప్రేమించుకోవడం ప్రారంభించానని వెల్లడించింది. వరుస సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, రాబోయే ప్రాజెక్టులతో బాక్సాఫీస్ దగ్గర గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe