Anupama Parameswaran: పీరియడ్స్ వచ్చినందుకు సిగ్గుపడేలా చేశాడు-11 మంది పిల్ల‌ల‌ను క‌నాల‌నుకున్నా-ఎక్స్ ల‌వ‌ర్‌పై అనుప‌మ‌

Anupama Parameswaran: మాజీ ప్రేమికుడి వేధింపులు, నార్సిసిస్టిక్ ప్రవర్తనపై నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన విషయాలు బయటపెట్టారు. చివరకు పీరియడ్స్ విషయంలోనూ చిన్నచూపు చూస్తూ తనను మానసికంగా కుంగదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె లేటెస్ట్ కామెంట్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Published on: Aug 19, 2026, 09:11:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anupama Parameswaran: గ్లామరస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్న తాను ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక వేధింపుల (నార్సిసిస్టిక్ అబ్యూస్) గురించి ఆమె బహిరంగంగా మాట్లాడారు.

పీరియడ్స్ వచ్చినందుకు సిగ్గుపడేలా చేశాడు-11 మంది పిల్ల‌ల‌ను క‌నాల‌నుకున్నా-ఎక్స్ ల‌వ‌ర్‌పై అనుప‌మ‌ (instagram)
పీరియడ్స్ వచ్చినందుకు సిగ్గుపడేలా చేశాడు-11 మంది పిల్ల‌ల‌ను క‌నాల‌నుకున్నా-ఎక్స్ ల‌వ‌ర్‌పై అనుప‌మ‌ (instagram)

అనుపమ పరమేశ్వరన్ కామెంట్లు

ధ్యాన్ వర్మ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తన మాజీ ప్రియుడి ప్రవర్తనను వివరిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. "నేను నటినైనందుకు, ధైర్యంగా నా భావాలను చెప్పగలిగినందుకు, ఆఖరికి నాకు పీరియడ్స్ వస్తున్నాయనే నిజానికి కూడా తీవ్రంగా సిగ్గుపడే పరిస్థితికి ఆ వ్యక్తి నన్ను నెట్టేశాడు.

సైకిల్‌లో మొదటి రోజు, ఐదో రోజు, పది, పదిహేను, ఇరవై లేదా ఇరవై ఐదో రోజు.. ఇలా ఏ రోజునైనా అతడు చేసిన తప్పును నిలదీస్తే చాలు, 'నీకు పిఎమ్ఎస్ (PMS) మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, పీరియడ్స్ వచ్చే సమయం కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నావ్' అని నాపైకే నెట్టేసేవాడు’’ అని సంచలన విషయాలను అనుపమ బయటపెట్టారు.

11 మంది పిల్లలు కావాలని

పిల్లల విషయంలోనూ అనుపమ పరమేశ్వరన్ తన ఆలోచనలను వెల్లడించారు. ‘‘ఒకప్పుడు నాకు 11 మంది పిల్లలు కావాలని ఆశపడ్డాను. కానీ, ఆ చేదు అనుభవం తర్వాత అసలు పిల్లలే వద్దనుకునే స్థాయికి చేరుకున్నాను. ఒక మహిళగా పుట్టినందుకు, నేను సాధించిన విజయాలను చూసి నాకే చాలా బాధ అనిపించింది" అని అనుపమ ఎమోషన్ అయ్యారు.

అన్నింటిపై కంట్రోల్

రెండేళ్ల పాటు సాగిన ఆ బంధంలో ఆ వ్యక్తి తనను పూర్తిగా తన కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రయత్నించాడని అనుపమ తెలిపారు. తన దుస్తుల ఎంపిక నుంచి తాను చేసే సినిమాల వరకు ప్రతిదాన్నీ ఆ వ్యక్తి మార్చేశాడని చెప్పారు. అతని తీవ్రమైన ఒత్తిడి వల్లే తాను 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లలో పాల్గొనలేదని, అలాగే 'పరదా' సినిమా ప్రమోషన్ల సమయంలో తనపై అసభ్యకరమైన కామెంట్లు రావడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నానని వెల్లడించారు.

ఆ వ్యక్తి తనను నిశ్చితార్థం, పెళ్లి చేసుకోవాలని నిరంతరం ఒత్తిడి తెచ్చాడని అనుపమ చెప్పారు. అయితే తన అంతరాత్మ చెప్పిన హెచ్చరికల వల్లే ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చానని అనుపమ తెలిపారు.

ధృవ్ విక్రమ్‌తో డేటింగ్ రూమర్లు

కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అనుపమ.. గతేడాది జూలైలో మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆ వ్యక్తి పేరును నేరుగా చెప్పకుండా అతని విపరీతమైన ప్రవర్తనను నెట్టింట బయటపెడుతున్నారు. అతడి వైఖరిని ప్రముఖ తమిళ చిత్రం 'అపరిచితుడు' (అన్నియన్) లోని విక్రమ్ పాత్రతో పోల్చడం గమనార్హం.

మరి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'బైసన్ కాళమాడన్' చిత్రంలో ధృవ్ విక్రమ్‌తో కలిసి నటించిన అనుపమ, 2025 ఆరంభం నుంచి ఆయనతో డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో, ఒకే స్పోటిఫై ప్లేలిస్ట్ పంచుకోవడం, వివిధ అవార్డు వేడుకల్లో వారి మధ్య కనిపించిన కెమిస్ట్రీ ఈ రూమర్లకు బలం చేకూర్చాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More