AnilVenky: అనిల్ రావిపూడి క్రియేటివిటీ ఏంటో? వెంకీ- కళ్యాణ్ రామ్ మూవీకి క్రేజి టైటిల్.. సినిమా పేరు ఇదేనా?

AnilVenky: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ టైటిల్ బజ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ఫన్ ఎంటర్‌టైనర్ టైటిల్ రూమర్ వివరాలు ఇవే. 

Published on: Aug 18, 2026, 13:45:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AnilVenky: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించే హిలేరియస్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈసారి ఆయన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లను ఒకే ప్రేమ్‌లోకి తెస్తూ ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది.

అనిల్ రావిపూడి క్రియేటివిటీ ఏంటో? వెంకీ- కళ్యాణ్ రామ్ మూవీకి క్రేజి టైటిల్.. సినిమా పేరు ఇదేనా?
అనిల్ రావిపూడి క్రియేటివిటీ ఏంటో? వెంకీ- కళ్యాణ్ రామ్ మూవీకి క్రేజి టైటిల్.. సినిమా పేరు ఇదేనా?

ఆసక్తికర టైటిల్ బజ్!

ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీకి 'బాల్‌రెడ్డి బావమరిది' అనే వినూత్నమైన టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. మరోవైపు ‘జనవరి 12 విడుదల’ అనే పేరు కూడా వినిపిస్తోంది.

మరి క్రియేటివిటీగా మారుపేరుగా నిలిచే అనిల్ రావిపూడి ఏ టైటిల్ పెడతాడో చూడాలి. రాయలసీమ నేపథ్యంలో సాగే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఈ సినిమాను రూపుదిద్దుతున్నారు. మాస్ క్యారెక్టరైజేషన్లు, టైమింగ్ డైలాగులతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.

నవ్వులు పూయించే ప్రోమో షూట్!

సినిమా అధికారిక టైటిల్ ప్రకటన కోసం అనిల్ రావిపూడి ఒక వినోదాత్మక ప్రోమో వీడియోను కూడా ఇప్పటికే చిత్రీకరించారని తెలిసింది. "ఈ టైటిల్ ప్రకటనను కూడా తన మార్క్ హ్యూమర్‌తో సరికొత్త కాన్సెప్ట్‌లో డిజైన్ చేసి షూట్ చేశాం" అని చిత్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రామోను విడుదల చేసి టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

సంక్రాంతి రేసులో 'జనవరి 12' విడుదల!

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అందుకే సామాజిక మాధ్యమాల్లో '#January12Vidudala' అనేది టైటిల్ అని తెగ వైరల్ గా మారింది. ఈ హ్యాష్‌ట్యాగ్ సంచలనం సృష్టిస్తోంది.

గతంలో వెంకటేష్‌తో 'ఎఫ్2', 'ఎఫ్3', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి ఘనవిజయాలు సాధించిన అనిల్ రావిపూడి, పటాస్ చిత్రంతో కళ్యాణ్ రామ్‌కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించారు. ఇప్పుడు వీరిద్దరినీ కలిపి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మరోసారి వినోదాల సునామీ సృష్టించేందుకు రెడీ అవుతున్నారు.

వరుస విక్టరీలు

టాలీవుడ్ లో ఫ్లాప్ అన్నదే లేని చాలా కొద్దిమంది డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకూ 9 సినిమాలు తీసిన ఆయన అన్నింటినీ హిట్ బాట పట్టించారు. చివరగా ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఎంటర్ టైన్మెంట్ రైడ్ రెడీ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More